25 అక్టోబరు 2019 (శుక్ర వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

25 అక్టోబరు 2019 (శుక్ర వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (25 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీ పని మామూలుగా సాగుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు. మీ చుట్టూ ఉన్నవారు మీ నిర్ణయాలను సమర్థిస్తారు. మరిన్ని బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. అయితే వారు చేసిన చిన్న తప్పులను పెద్దగా ఊహించుకోకండి. చాలా కాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీ పనిలో.. నిర్ణయాల్లో ఇతరులు తలదూర్చకుండా జాగ్రత్త పడండి. మీ మనసు చెప్పింది వినండి. సమయానికి తినండి. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కానీ మీ పని మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ ఇతరులు మీ వేగంతో సమానంగా పనిచేయలేరు. ఇతరులపై ఆధారపడడం తగ్గించండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. ఒంటరిగా సమయం గడపాలనుకుంటారు.

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు పని చాలా నెమ్మదిగా సాగుతుంది. మానసికంగా మీరు చాలా బలహీనంగా ఉంటారు. మీ నిర్ణయాలను బలంగా కుటుంబ సభ్యులకు వివరించాల్సి ఉంటుంది. లేదంటే వారు మిమ్మల్ని చూసి చిరాకు పడే ప్రమాదం ఉంటుంది. పాత విషయాలను పట్టుకొని వేలాడకండి. మీ స్నేహితులు మీ మాటలను అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీ పని మామూలుగా సాగుతుంది. ఇతరులు వదిలేసిన పెండింగ్ పనులను మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు అదనపు బాధ్యతే అయినా మీరు దాన్ని ఆనందంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఒంటరిగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీ పని వేగంగా సాగుతుంది. మీ చుట్టూ ఉన్నవారు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను అర్థం చేసుకోగలుగుతారు. ఓ ముఖ్యమైన మీటింగ్ ఆలస్యమవడం లేదా క్యాన్సిల్ కావడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ కుటుంబ సభ్యులు మీ సలహాల కోసం వస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పని చాలా మందకోడి గా సాగుతుంది. పనులు పూర్తిగా వాయిదా పడుతుండడంతో పాటు మీరు చాలా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అంతేకాదు.. పని ప్రదేశంలో ఇతరులు మిమ్మల్ని కించపర్చినట్లు మాట్లాడే అవకాశం కూడా ఉంది. కానీ వాటిని పట్టించుకోవద్దు. ఈ ఒత్తిడినంతా మీ కుటుంబంతో సమయం గడిపి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. వాళ్లు మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీరు ముందుకు వెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఉంటారు. అయితే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాల్సి వస్తుంది. కొత్త వ్యక్తులతో కలిసి పని చేస్తారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబంతో సమయం ఆనందంగా గడపండి. ఓ ఫ్రెండ్ తన బాధను చెప్పుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. వారిని అర్థం చేసుకొని వారికి సహాయం చేయండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీ పని మామూలుగా సాగుతుంది. కొత్త వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గతంలో మీరు చేసిన పనికి మీరు ఈ రోజు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడండి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకండి. స్నేహితులందరిలో మీరే సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతారు. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు మీ పాత క్లైంట్ల నుంచి కొత్త పనిని పొందుతారు. పని ప్రదేశంలో ఇతరుల అవసరాలను గుర్తించి వారికి సాయం చేయండి. గతంలో జరిగిపోయిన వాటిని తవ్వి వర్తమానాన్ని పాడు చేయకండి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీరు పని ప్రదేశంలో ఇతరులతో గొడవలు పడకుండా జాగ్రత్త పడండి. ఈ రోజు మీకు అంత ఆనందకరంగా ఉండదు. ఇతరుల తప్పులను క్షమించడం అలవాటు చేసుకోండి. పాత క్లైంట్ల నుంచి కొత్త పని మీకు లభిస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా మీరే పని చేయడం మంచిది. మీ ఇంటికి బంధువుల రాక మిమ్మల్ని సంతోషపెడుతుంది. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీరు ఇతరులు చెప్పిన విషయాల గురించి కాస్త శ్రద్ధ పెట్టండి. అయితే విమర్శలను పర్సనల్ గా తీసుకోకండి. పని పై ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ విమర్శలను తిప్పి కొట్టండి. ఈ రోజు మీరు కుటుంబంతో చాలా ఎక్కువ సమయం ఆనందంగా గడుపుతారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.