30 అక్టోబరు 2019 (బుధ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

30 అక్టోబరు 2019 (బుధ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (30 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈరోజు మీరు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ పనులు చేయాల్సి రావడంతో కాస్త కంగారు పడతారు. కానీ మీరు పనిచేసే విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది. మీ తోటివారు మీకు సహాయం చేస్తారు. భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీ నమ్మకాలన్నీ పటాపంచలవుతాయి. మీరు ఇతరులకు చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ చెప్పి వారిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ తర్వాత ఎలా జరిగితే అలా జరగనివ్వండి.  

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీరు మీ మనసు చెప్పింది చేయాల్సి వస్తుంది. నచ్చని పని చేయడం సరికాదు. కష్టపడి పనిచేసినా పెద్దగా ఫలితం ఉండదు. అందుకే మీపై మీరు నమ్మకం ఉంచుకొని మీరు అనుకున్నది చేయండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి  (Cancer) – మీరు ఎంత పనిచేసినా సరే.. మీ పని చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇతరులు మీ మాటలను అర్థం చేసుకోలేరు. కానీ కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇతరులు మీ సహనాన్ని పరీక్షించినా సాయంత్రానికి అది తగ్గిపోతుంది. మీకు రావాల్సిన డబ్బు మీకు అందుతుంది. మీ మూడ్ బాగాలేకపోయినా స్నేహితులతో బయటకు వెళ్లాల్సి వస్తుంది.

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీరు బ్యాలన్స్డ్ గా ఉండడం నేర్చుకోండి. మీ కోపాన్ని ఇతరులపై చూపించకండి. లేదంటే మీరు తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈరోజు మీకు కొత్త అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించేవారికి ఈరోజు మంచి రోజు. ఓ ఫ్రెండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ దాన్ని మర్చిపోవడం మంచిది.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు చాలా పని చేయాల్సి వస్తుంది. దానికి ఇతరుల సహాయం తీసుకోండి. పని నెమ్మదిగా సాగుతుంది. అయితే అన్ని పనులూ మీరే చేసేయలేరని గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యులు మీకు సలహాలు ఇస్తారు. వారితో గొడవలు తగ్గించి వాటిని పాటించండి.

తుల రాశి (Libra) – ఈ రోజు మీ రోజు మామూలుగా సాగుతుంది. పని ప్రదేశంలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. వారితో మనసు విప్పి మాట్లాడడం వల్ల గతాన్ని మర్చిపోయే వీలుంటుంది. సాయంత్రాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. మీకేం కావాలో మీకు తెలిసినా దానికి సంబంధించి నిర్ణయం తీసుకోలేరు. మీటింగ్స్ వాయిదా పడడంతో పని నెమ్మదిగా సాగుతుంది. తోటి పనివారికి మీకు మధ్య అభిప్రాయ బేధాలు రావచ్చు. ఓ స్నేహితుడితో గొడవ వల్ల ఒంటరిగా సమయం గడుపుతారు.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీ పని చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇతరులపై మీ నిర్ణయాల గురించి ఆధారపడకండి. మీ నిర్ణయాలకు మీరే బాధ్యత వహించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ బిజీగా ఉండడంతో మీరు కలిసి సమయం గడపలేరు.

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీకు శుభవార్తలు అందుతాయి. కొత్త అవకాశాలు అందుతాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అయితే దీనికోసం మీ నిర్ణయాలు మీరే తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరులపై ఆధారపడకండి. బయటకు వెళ్లాలనుకున్నా ఆఖరి నిమిషంలో వాయిదా వేస్తారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీ పని మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ ఇతరులతో అభిప్రాయ బేధాల వల్ల మీరు ముభావంగా ఉంటారు. వారి అభిప్రాయాలను కూడా వినండి. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం దొరికినా.. పనిలో జరిగిన గొడవల వల్ల దాన్ని సద్వినియోగం చేసుకోలేరు. అయితే గొడవల ప్రభావం మీపై ఉండకుండా జాగ్రత్తపడండి.

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. పనిలో ఫలితాలు ఎలా ఉన్నా సరే కొత్త ఆలోచనలు, అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అయితే నిర్ణయాలు వేగంగా తీసుకోకండి. ఆర్థికంగా వెసులుబాటును అందించే పని మీ సొంతం అవుతుంది. మీ సీనియర్ల సలహాలు తీసుకోండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.