31 అక్టోబరు 2019 (గురు వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

31 అక్టోబరు 2019 (గురు వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (31 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి ఒక్కటీ మీరు అనుకున్నట్లుగానే సాగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు టీమ్ సలహాలు తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయాలకు మీకు ప్రశంసలు దక్కుతాయి.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చాలా పనిని పూర్తి చేస్తారు. కానీ మీ తోటివారు పని చేయడానికి మీకు సహకారం అందించరు. ఇతరులు వారు చెప్పిన పనులు సరిగ్గా చేయకపోవడం వల్ల మీరు చేయాల్సిన పనులు ఆగిపోతాయి. మీరు ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారనే విషయం మరోసారి పరిశీలించుకోండి. పని ఒత్తిడి వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీరు చేసే పనిని ఇతరులు కంట్రోల్ చేస్తారు. మీరు వేసుకున్న ప్లాన్ లో చాలా మార్పులు, ఆలస్యం, వాయిదాలు ఉంటాయి. మీరు ఎంతగా ప్రయత్నించినా మీరు అనుకున్న దారిలో సాగలేరు.  అయితే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆరోగ్యం గురించి పట్టించుకోండి. స్నేహితులతో కలిసి ఇవన్నీ మర్చిపోయేందుకు ప్రయత్నించండి. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీ పని వేగం పుంజుకుంటుంది. పాత క్లైంట్ల నుంచి కొత్త ఆర్డర్లు లభిస్తాయి. ఈ రోజు మీ పనిని మరింత విస్తరించేందుకు మీకు అవకాశాలు లభిస్తాయి. కానీ వాటికి సంబంధించిన నిర్ణయాలు ఈ రోజే తీసుకోకండి. కుటుంబ జీవితం అంత బాగుండదు. పాత స్నేహితులను కలుస్తారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీ మాటలకు చేతలకు సంబంధం ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులను ఆనందంగా మార్చేందుకు మీరు అడ్జస్ట్ అవుతుంటారు. కానీ అది మీకు సంతోషాన్ని అందించదు. మీకు ఆనందాన్ని అందించే పని చేయండి. పనిలో ఇతరులకు మీకు అభిప్రాయ బేధాలు వస్తాయి. కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు ఫోకస్ తో పని చేయండి. శుభవార్తలు వింటారు. పెండింగ్ లో పనిని పూర్తి చేస్తారు. పాత పనులన్నింటినీ పూర్తి చేసిన తర్వాతే కొత్తవి ప్రారంభించడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి.

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇతరుల చెప్పినట్లు చేసుకుపోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. ఇతరులతో కలిసి చేసిన పనిలో పర్ఫెక్షన్ కనిపించదు. అందుకే మీరే సొంతంగా పని చేయడం మంచిది. కుటుంబ సభ్యులు మీతో గొడవకు దిగుతారు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీరు వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులకు లోనవుతారు. దానివల్ల పని కూడా సరిగ్గా చేయలేరు. ఇతరులు అన్న మాటలు మిమ్మల్ని నీరసపడిపోయేలా చేస్తాయి. అయితే పనిపై ఫోకస్ పెట్టడం మంచిది లేదంటే పని ఆలస్యమవుతుంది. కొత్త ఆలోచనలు, అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో మీ ఇబ్బందిని పంచుకోండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీరు కూర్చొని బాగా ఆలోచించి మీతో మీరు మాట్లాడుకొని మీ లక్ష్యం ఏంటో క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సరైన లక్ష్యం లేకుండా ముందుకెళ్లడం సరికాదు. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకండి. డబ్బుకి సంబంధించిన క్లారిటీ మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ నిర్ణయాల్లో మీకు సపోర్ట్ అందిస్తారు. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు ఏం చేయాలనుకున్నా అది బెడిసి కొడుతుంది. అందుకే వెనక్కి తగ్గి కాస్త నెమ్మదిగా సాగండి. ఎలా జరిగేది అలా జరగనివ్వండి. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని భావించకండి. క్లైంట్లు ప్రాజెక్ట్ లో ఆలస్యం చేయడం మీకు చిరాకు కలిగిస్తుంది. అయితే కుటుంబంపై ఈ ప్రభావం చూపకండి. వారు మీ దగ్గరికి సలహాల కోసం వచ్చినప్పుడు వారికి సలహాలు ఇవ్వండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీ మనసులో చాలా నడుస్తుంటుంది. మీరు పని పై ఫోకస్ పెట్టలేనంతగా అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ ముందున్నది చేయండి. భవిష్యత్తు గురించి ఆలోచించకండి. ఇతరుల మాటలను బట్టి మీ విలువను తగ్గించుకోకండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. కుటుంబ సభ్యులు మీరు వారితో సమయం గడపాలని కోరుకుంటారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీరు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే పని చాలా నెమ్మదిగా సాగుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలను మీరు తీర్చాల్సి వస్తుంది. వారి సమస్యలను తీర్చుకునేందుకు వారికి సహాయం చేయండి. అంతా వినండి. కానీ రియాక్ట్ అవడం మంచిది కాదు. వారి బాధను మీతో పంచుకోనివ్వండి. మీరు చెప్పాల్సింది తర్వాత చెప్పవచ్చు. స్నేహితులు మీకు సపోర్ట్ చేస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.