5 అక్టోబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

5 అక్టోబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (5 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ కోరికలు నెరవేరుతాయి. అలాగే కుటుంబ సభ్యులకు కూడా తమ గురించి చెప్పడానికి ఇదే సరైన సమయం. ఇక ఈ రోజు నిరుద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. మహిళలు కూడా షాపింగ్ చేసేటప్పుడు.. అనుకోని రిబేట్లు, డిస్కౌంట్లు పొందుతారు.

వృషభం (Tarus) – ఈ రోజు ఆలుమగలకు శుభదినం. తమ బంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. రొమాంటిక్ మజిలీలు చేస్తారు. ఇక విద్యార్థులకు తమ తల్లిదండ్రుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహితులు ఖర్చుల విషయంలో జాగరూకతతో వ్యవహరించాలి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు కుటుంబ సమస్యలలో చిక్కుకుంటారు. అయినా సరే వాటి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. అయితే ఇలాంటి సమయాలలోనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అలాగే కొన్ని విషయాలలో దాపరికం లేకుండా.. భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది.

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది. వివాహితులకు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. అలాగే ప్రేమికులు పలు సమస్యలలో చిక్కుకుంటారు. అయితే సాధ్యమైనంత వరకు.. తమ సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం మంచిది. నిరుద్యోగులు ఇంకా కష్టపడాల్సిన సమయమిది. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ కెరీర్‌కు సంబంధించి నూతన ఆలోచనలు చేస్తారు. విదేశీ విద్య పై కూడా ఆసక్తి చూపిస్తారు. అలాగే సినీ రంగంలో ప్రయత్నాలు చేసే వారికి ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. అనుకోని అవకాశాలు మీ తలుపు తట్టే అవకాశం ఉంది. అయితే కొన్ని అవకాశాలు దక్కాలంటే.. మనం సమయస్ఫూర్తిగా వ్యవహరించడం నేర్చుకోవాలి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ప్రేమికుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే ఒకరి పట్ల మరొకరు నిజాయతీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ బంధంలోనైనా నిజాయతీ అనేది ముఖ్యమనే విషయాన్ని బలంగా నమ్మాలి. ఇక ఆలుమగల మధ్య కూడా పలు అభిప్రాయభేదాలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. 

తుల (Libra) – ఈ రోజు ఫ్రెషర్స్‌కు శుభ దినం. బీపీఓ లేదా సాప్ట్‌వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. అలాగే ఇలాంటి సందర్భాల్లోనే మీ భావ ప్రసార నైపుణ్యాలు.. మీ ఇంటర్వ్యూలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కనుక ప్రిపేర్ అయ్యి వెళ్లండి. అలాగే ఉద్యోగస్తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పదోన్నతులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం కూడా మంచిది. మీ ఆలోచనలకు బ్రేక్ వేయడానికి.. మీ ప్రత్యర్థులు ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలోనే అప్రమత్తంగా ఉండాలి. మీ నిజాయతీ, శ్రమను బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనే నిజాన్ని నమ్మాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలి. కొన్ని విషయాలను కాలానికి వదిలేయాలి. అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకాలి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని విపత్కర పరిస్థితులలో మీ భాగస్వామి కూడా.. మీకు సహాయం చేసే అవకాశం ఉంది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసేటప్పుడుు.. ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా బ్రోకర్లు లేదా ఏజెంట్లను నమ్మే విషయంలో.. అప్రమత్తంగా ఉండాలి. ప్రేమికులు ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందు.. కాస్త వివేకంతో వ్యవహరించాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ బాల్య మిత్రులను కలిసే అవకాశం ఉంది. అలాగే తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహితులు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపారస్తులు ఆర్థిక లాభాలను పొందుతారు. అయితే లాటరీలు, పందేలు లాంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆలోచించండి. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అలాగే మహిళలు అనుకోని బహుమతులు, కానుకలు పొందుతారు. అవివాహితులు కూడా శుభవార్తలు వింటారు. మీకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆ సమస్యలు త్వరలోనే సమసిపోతాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.