ఈ రోజు (8 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు మీరు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అలాగే మీలో ఎన్నడూ లేని విధంగా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఒక సామాజిక సంస్థ నుండి గౌరవ సత్కరాలను కూడా అందుకుంటారు. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
వృషభం (Tarus) – ఈ రోజు మీకు కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి ఉంటుంది. ప్రేమకు సంబంధించిన విషయాలలో నిరాశ చెందే అవకాశం ఉంది. అలాగే చిన్న విషయాలను పెద్దవి చేసి చెప్పడాన్ని మానుకోవాలి. లేకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకండి. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
మిథునం (Gemini) – ఈ రోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అదేవిధంగా ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు. సృజనాత్మక, సినీ, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే బాల్య మిత్రులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు ఆస్తి వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక విషయాలను పరిష్కరించే సమయంలో.. మీ భాగస్వామి సలహాలను కూడా తీసుకోండి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తారు. అయినా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు.
సింహం (Leo) – ఈ రోజు మీరు ప్రేమించే వ్యక్తికి మనసులో మాటను చెప్పడం మంచిది. అలాగే ఆలుమగలకు వైవాహిక జీవితం రసవత్తరంగా సాగుతుంది. వ్యాపారస్తులు వివాదాస్పద కేసుల నుండి బయటపడతారు. ఉద్యోగస్తుల విషయంలో.. అధికారులతో మంచి సంబంధాలు పదోన్నతికి సహాయపడతాయి. విద్యార్థులు సోమరితనాన్ని వీడి మరింత కష్టపడాలి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు నిరుద్యోగులకు బాగా కలిసొస్తుంది. అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. ఉద్యోగులు ఆఫీసులో ఉద్రిక్తత వాతావరణాన్ని చూస్తారు. వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామితో సరదాగా గడుపుతారు. అవగాహన లేని ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి.
తుల (Libra) – ఈ రోజు మీ కుటుంబంలోని ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. మహిళలు ఇంటి అలంకరణ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆఫీసులో వచ్చే కొత్త మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. చట్టపరమైన వివాదాలలో తలదూర్చడానికి ప్రయత్నించకండి. అలాగే ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీ కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే ఆఫీసులో మీ బాధ్యతలను తేలికగా తీసుకోకుండా ఉంటే మంచిది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. మహిళలు కొన్ని అనవసర ఖర్చులను నియంత్రించండి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే ఆఫీసు వాతావరణం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి పలు శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. నిరుద్యోగులు మరింత కష్టపడాలి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రేమకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబాన్ని ఎదిరించి పలు ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఆర్థిక విషయాలలో మీకు మీ సన్నిహితులు లేదా స్నేహితుల మద్దతు ఉంటుంది. విద్యార్థులకు క్రీడలు లేదా కళల విషయంలో ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు యువతకు కెరీర్‌కు సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. అలాగే పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు పలు వివాదాల నుండి బయటపడతారు. నిరుద్యోగులలో ఆత్మవిశ్వాసం పెరగుతుంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలోనే పాజిటివ్ ఆలోచనలను పెంచుకోవాలి. మీ తప్పులను మీరే సమీక్షించుకోవాలి. విద్యార్థులు విజయం సాధించాలంటే.. మీ సబ్జెక్టుకి సంబంధించిన కొన్ని కీలక విషయాలను అధ్యయనం చేయాలి. వ్యాపారస్తులు నిర్లక్ష్యాన్ని వీడకపోతే.. కొన్ని కీలక ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.