10 అక్టోబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

10 అక్టోబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (10 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు రుణాలు ఇవ్వడం మానుకోవాలి. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలకు స్వస్తి పలకాలి. విద్యార్థులు పాకెట్ మనీ ఖర్చు పెట్టే విషయాలలో.. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమికులు జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. ఆచితూచి వ్యవహరించాలి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవనశైలిలో పలు మార్పులు చేసుకుంటారు. అలాగే  ఆరోగ్యానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో ఉద్యోగస్తులకు తమ సామర్థ్యానికి తగ్గ అవకాశాలు లభిస్తాయి. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. 

మిథునం (Gemini) – ఈ రోజు కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. అలాగే ఆఫీసులో ఉద్యోగులు కొన్ని ఆంక్షలకు కట్టుబడాల్సి ఉంటుంది. యువత కొన్ని విషయాలలో ఆగ్రహావేశాలకు లోనవుతారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ప్రత్యర్థుల ప్రవర్తన మీలో ఒత్తిడిని పెంచుతుంది. కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోండి. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు మీ అనారోగ్యం కారణంగా కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే తెలియని భయాలు మీలో అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైన విషయాలలో మీకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది. విద్యార్థులకు రాజకీయాలపై ఆసక్తి పెరగుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.  

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపార ప్రణాళికలను రూపొందిస్తారు. విద్యార్థులు తాము అనుకున్న టార్గెట్‌ను చేరుకుంటారు. సృజనాత్మక, సినీ, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. వివాహితులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడతాయి. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో సీనియర్ అధికారుల విశ్వాసాన్ని చూరగొంటారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినా... ఆఖరికి మీదే పై చేయిగా మారుతుంది. అదేవిధంగా స్నేహితుల మద్దతు మీకు కచ్చితంగా ఉంటుంది. 

తుల (Libra) –  ఈ రోజు  సోమరితనం లేదా నిర్లక్ష్యం కారణంగా.. కొన్ని పనులను వాయిదా వేసుకుంటారు. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. ఓ అనుకోని ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఆలుమగల సంబంధాలు పటిష్టంగా మారతాయి.  కొన్ని విషయాలలో భావోద్వేగాలకు గురవుతారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖరీదైన బహుమతులు అందుకుంటారు. అలాగే వీరికి ఈ రోజు వాహన యోగం ఉంది. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబానికి సంబంధించి.. పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులను అనుకోని సమస్యలు చుట్టుముడతాయి. అయినా ఆత్మస్థైర్యంతోనే ముందుకు వెళ్లండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఆడిట్ విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఇంకొంచెం కష్టపడితే.. ప్రత్యమ్నాయ రంగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులకు పిల్లల బాధ్యత నెరవేరుతుంది. ఆలుమగల బంధం మరింత పటిష్టంగా మారుతుంది.  కొన్ని విషయాలలో మీరు మీ స్నేహితులు సహాయాన్ని పొందుతారు. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శుభవార్తలు వింటారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారాా ఆత్మసంతృప్తిని పొందుతారు. ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు.  ఆర్థిక స్థితిగతులు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు. 

మీనం (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు లాభాల బాటలో పయనిస్తారు. క్రీడాకారులకు అనుకోని విజయాలు సిద్ధిస్తాయి. అలాగే వివాహితులు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు తమ కెరీర్‌కు సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.