బాలీవుడ్ లో అద్బుతమైన జంటల్లో దీపికా పదుకొణె (deepika padukone), రణ్ వీర్ సింగ్ (ranveer singh) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ లవ్లీ కపుల్ కి దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఎంతోమంది అభిమానులున్నారని చెప్పుకోవచ్చు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట లేక్ కొమొలో గతేడాది వివాహమాడి తమ ప్రేమను పెళ్లి (wedding)గా మార్చుకున్నారు. ఈ పెళ్లి గురించి అప్పట్లో దేశమంతా చర్చించింది. ఈ పెళ్లి ఫొటోల కోసం దేశమంతా వేచిచూసింది. తాజాగా హార్పర్ బజార్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తన పెళ్లి గురించి.. తమ జీవితం గురించి కొన్ని విశేషాలను పంచుకుంది దీపిక.
ఇందులో భాగంగా తమ పెళ్లి వేదిక గురించి వెల్లడించింది దీపిక. మేమిద్దరం మా జీవితాన్ని ప్రైవేట్ గా సెలబ్రేట్ చేసుకునే వేడుక పెళ్లి. దానికోసం ఓ వేదిక వెతకడం మాకు చాలా ఇబ్బందైంది. మా ఇద్దరికీ నీళ్లంటే ఎంతో ఇష్టం. అందుకే నీళ్లతో చుట్టుముట్టి ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలనుకున్నాం. రణ్ వీర్ పెళ్లి సమయంలో నేను చాలా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. దీనికోసం సంప్రదాయాలను పక్కన పెట్టి పెళ్లి చేసుకోవడానికి కూడా తను సిద్ధమయ్యాడు. మేమిద్దరం ఎప్పుడూ సినిమా షూటింగుల్లో భాగంగా బిజీగా ఉంటాం కాబట్టి మామూలుగా చేయాలని తను భావించాడు. పెళ్లికి ముందు తను మాట్లాడుతూ.. పెళ్లి నువ్వు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. నువ్వు సంతోషంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్లే అని చెప్పాడు. కానీ నేను చిన్నతనం నుంచి సంప్రదాయబద్ధమైన కుటుంబంలో పెరిగిన దాన్ని. ఆ సంప్రదాయాలకు నేను చాలా విలువనిస్తాను. అందుకే పెళ్లి అలాగే జరగాలని కోరుకున్నా.. అని వివరించింది.
పెళ్లికి ముందు చాలామంది సెలబ్రిటీ జంటలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు కలిసి జీవించారు. కానీ దీపిక, రణ్ వీర్ లు మాత్రం కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నా సరే.. ఇద్దరూ కలిసి ఉండలేదు. దీని గురించి ప్రశ్నిస్తే దీపిక చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చింది. పెళ్లికి ముందు మేమిద్దరం కలిసి జీవిస్తే ఆ తర్వాత మేమిద్దరం ఒకరి గురించి మరొకరు తెలుసుకునేది ఏముంటుంది? ఈ సంవత్సరం నుంచి మేమిద్దరం కలిసి జీవిస్తూ ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాతే కలిసి ఉండాలన్నది మా జీవితంలో మేం తీసుకున్న బెస్ట్ నిర్ణయం అని మా ఫీలింగ్. చాలామంది అలా చేయడానికి ఇష్టపడతారు. కానీ మేం అలా కాదు. మేం పెళ్లి అనే బంధాన్ని ఇష్టపడతాం. అందుకే పెళ్లి చేసుకునే కలిసి ఉండాలనుకున్నాం. అలా చేసినందుకు ఇప్పుడు జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. అంది దీపిక..
అంతేకాదు.. తన జీవితంలో పిల్లల ప్రాముఖ్యత గురించి కూడా చెప్పింది దీపిక. మా ఇద్దరు తల్లిదండ్రులు పనిచేసేవారు. కానీ నాకు, నా చెల్లెలికి జీవితంలోని ప్రతి విషయంలో వారు తోడుగా ఉన్నారు. వాళ్లు మాకు సమయం, ప్రేమాభిమానాలు అందించడంతో పాటు మాకు తోడునీడగా నిలిచి పెంచారు. భవిష్యత్తులో మా ఇద్దరికీ పిల్లలు పుట్టిన తర్వాత మా అమ్మానాన్నల నుంచి నేను అందుకున్న ప్రేమకంటే మరింత ఎక్కువగా వారికి అందించాలనుకుంటున్నా. ఇలా చేయడం వల్ల వాళ్లు సెక్యూర్ గా.. మానసికంగా బలంగా తయారవుతారని నా నమ్మకం.. అంటూ వివరించింది దీపిక.
ప్రస్తుతం ఈ ఇద్దరూ కపిల్ దేవ్ బయోపిక్ అయిన 83 లో కలిసి భార్యాభర్తల్లా కనిపించనున్నారు. ఇందులో రణ్ వీర్ హర్యాణా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించగా.. దీపిక ఆయన భార్య రోమీ భాటియా దేవ్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. 83 సినిమాలో కపిల్ జీవిత చరిత్ర గురించి మాత్రమే కాకుండా 1983లో భారత్ సాధించిన చారిత్రక విజయం గురించి కూడా చూపిస్తారని ఈ చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్ వెల్లడించారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.