అందమైన ఫ్యామిలీ.. ఆనందాల లోగిలి... మహేష్ బాబు కుటుంబం

అందమైన ఫ్యామిలీ.. ఆనందాల లోగిలి... మహేష్ బాబు కుటుంబం

(Mahesh Babu's new family photo is going viral in Social Media)

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక అభిమాన గణాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో మహేష్ బాబు. 'రాజకుమారుడు' చిత్రంతో టాలీవుడ్‌కు తను కథానాయకుడిగా పరిచయమైనా.. అంతకు ముందే బాల నటుడిగా అనేక చిత్రాలలో నటించి.. తన నటనా సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ ఆయన. తనను అభిమానులు ప్రిన్స్ అనే పేరుతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. వంశీ చిత్ర షూటింగ్ సమయంలో.. బాలీవుడ్ కథానాయిక నమ్రతా శిరోద్కర్‌తో ప్రేమలో పడిన మహేష్.. ఆ తర్వాత ఆమెనే ఇల్లాలిగా స్వీకరించారు.

'మిస్ ఇండియా'ను ప్రేమించిన 'మిస్టర్ పర్ఫెక్ట్'.. మహేష్, నమ్రతల అద్భుత ప్రేమకథ మీకు తెలుసా?

మహేష్, నమ్రత దంపతుల ప్రేమకు చిహ్నమే.. ఇద్దరు బిడ్డలు గౌతమ్, సితార. ఇక సితార గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ కిడ్‌గా అనతి కాలంలోనే సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ పిల్ల.. చిన్నవయసులోనే ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ పిల్ల అల్లరి చేయడంలో కూడా తనకు తానే సాటి. తన మమ్మీ, డాడీల ఫోటోలను తానే స్వయంగా తీస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంది. 

"వి లవ్ యూ సితారా.." - 'డాటర్స్ డే' రోజు తమ ముద్దుల కూతురికి.. మహేష్ దంపతుల సందేశం

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. వారాంతంలో మాత్రం తప్పకుండా తన కుటుంబంతోనే ఆయన గడుపుతారు. ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారిని టూర్లకు, ఔటింగ్స్‌కు తీసుకెళ్తూ ఉంటారు. అంతే కాదు.. వారికి తనదైన శైలిలో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉంటారు. 

 

ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, ప్రదీప్ రావత్, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్, ఆది పినిశెట్టి, బ్రహ్మానందం, కిరీటి దామరాజు, సచిన్ ఖేద్కర్ మొదలైనవారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

నా భర్తే నాకు హీరో.. కానీ పిల్లలు వద్దనుకున్నాం: లేడీ అమితాబ్ విజయశాంతి

ఇదే చిత్రంలో తమన్నా, పూజా హెగ్డేలు ఐటం సాంగ్‌లలో కనువిందు చేయడం విశేషం. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. సుంకర రామబ్రహ్మం, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉండడం విశేషం. 2020 సంవత్సరంలో.. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.