"వి లవ్ యూ సితారా.." - 'డాటర్స్ డే' రోజు తమ ముద్దుల కూతురికి.. మహేష్ దంపతుల సందేశం

"వి లవ్ యూ సితారా.." -  'డాటర్స్ డే' రోజు తమ ముద్దుల కూతురికి.. మహేష్ దంపతుల సందేశం

(Mahesh Babu "Daughters Day" Special Wishes to Sitara)

'డాటర్స్ డే' సందర్భంగా టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, ఆయన శ్రీమతి నమ్రతా శిరోద్కర్‌లు తమ గారాల పట్టి సితారకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వీడియో కూడా రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వివిధ సందర్భాలలో సితారతో దిగిన చిత్రాలతో ఈ వీడియోని రూపొందించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు... సితారకు గ్రీటింగ్స్ తెలిపారు. " నా బుజ్జి "సీతా పాప"కు డాటర్స్ డే శుభాకాంక్షలు. నీవు చాలా అద్భుతమైన అల్లరి పిల్లవు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను" అని మహేష్ పోస్టు చేశారు. 

యూట్యూబ్‌లోకి అడుగుపెట్టిన.. మహేష్ బాబు గారాలపట్టి సితార ..!

మరో వైపు నమ్రత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన గారాల పట్టి సితారకు వినూత్న రీతిలో విషెస్ తెలిపారు. "నా జీవితంలో నువ్వో వెలుగు దివ్వె. నా ఆకాశంలో నిరంతరం మెరుస్తుండే చిన్నారి తారవు నువ్వు. నా ప్రపంచాన్ని ఎంతో ఆనందంగా మార్చావు. ఐ లవ్ యూ సితార" అని నమ్రత మెసేజ్ పోస్టు చేశారు. మహేష్ బాబు సితారను ముద్దుగా "సీతా పాప"  అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. పైగా సితారకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగే ఉంది.

ఇటీవలే సితార తన స్నేహితురాలు మరియు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. వారు ఆ ఛానల్‌లో తొలుత 3 మార్కర్స్ ఛాలెంజ్ అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసారు. మహర్షి చిత్ర షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరు పిల్లలు.. మంచి ఫ్రెండ్స్ అయ్యారట. అలాగే సితార మంచి ఫోటోగ్రాఫర్ కూడా. తన మమ్మీకి అప్పుడప్పుడు మంచి మంచి ఫోటోలు తీసిపెడుతుంది. అలాగే సెలబ్రిటీ కిడ్స్‌లో ఎక్కువ పాపులారిటీ ఉన్న చిన్నారుల్లో సితార ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. 

మీ గారాల పట్టికి ఇలా "డాటర్స్ డే విషెస్" చెప్పి.. వారిని సంతోషపర్చండి..!

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. "మహర్షి" సినిమా ఘన విజయం సాధించాక.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో ప్రాజెక్టుకి సైన్ చేశారాయన. ఆ చిత్రం పేరే "సరిలేరు నీకెవ్వరు". ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్. అలాగే చాలా రోజుల గ్యాప్ తర్వాత.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రోహిణి, వెన్నెల కిషోర్, ఆది పినిశెట్టి, అనసూయ భరద్వాజ్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

'డాటర్స్ డే' సందర్భంగా.. మీ అమ్మాయికి 'మంచి బహుమతి' ఇవ్వాలనుకుంటున్నారా..?

"సరిలేరు నీకెవ్వరు" చిత్రంలో తమన్నా ఓ ఐటమ్ సాంగ్ కూడా చేయడం విశేషం. దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్ గెటప్‌లో మహేష్ కనిపిస్తున్నారు. 2020 సంవత్సరంలో సంక్రాంతి స్పెషల్‌గా ఈ చిత్రం అభిమానులకు కనువిందు చేయనుంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా.. జనవరిలో విడుదల కానుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.