ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
ట్విట్టర్ లో కలిశారు.. జీవితంలో ఒక్కటయ్యారు..  రాహుల్  – చిన్మయి ల అందమైన ప్రేమ కథ..

ట్విట్టర్ లో కలిశారు.. జీవితంలో ఒక్కటయ్యారు.. రాహుల్ – చిన్మయి ల అందమైన ప్రేమ కథ..

నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి ఈమధ్య కాలంలోనే ఒక ప్రతిభావంతుడైన దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్.. మంచి గాయనిగా. డబ్బింగ్ కళాకారిణిగా తమిళం, తెలుగు, హిందీ చిత్రసీమలలో ఎంతోమంది చేత శభాష్ అనిపించుకున్న చిన్మయి చూసేందుకు ఎంతో అద్భుతమైన జంటగా అనిపిస్తారు. టాలీవుడ్, కోలీవుడ్ లలోని చక్కటి సెలబ్రిటీ జంటల్లో వీరిది కూడా ఒకటి. ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ భిన్న మనస్తత్వాలు కలవారంటే నమ్మడం కాస్త కష్టమే. గత కొంతకాలంగా ఆడవారి పైన జరిగే అకృత్యాలని సామజిక మాధ్యమాల ద్వారా ఎండగడుతూ #MeToo ఉద్యమానికి ఒక నూతనోతేజాన్ని ఇచ్చింది చిన్మయి శ్రీపాద (chinmayi sripada). రాహుల్ మాత్రం బయట విషయాలు అంతగా పట్టించుకోనట్లుగా సైలెంట్ గా వ్యవహరిస్తారు. మరి, ఈ జంట ప్రేమకథ (love story) గురించి మీకు తెలుసా? తెలుసుకుందాం రండి.. 

ప్రేమలో ఉన్నా.. పెళ్లికి రోజా – సెల్వమణి పదకొండేళ్లు ఎందుకు ఆగారో తెలుసా?

ముందుగా రాహుల్ రవీంద్రన్ మనస్తత్వాన్ని ఒకసారి గమనిస్తే ఎంతో శాంత పరుడు. రాహుల్ రవీంద్రన్ శాంతమూర్తి అయితే.. చిన్మయి సమాజంలో జరిగే ఆ తప్పునూ సహించలేరు. ముఖ్యంగా అమ్మాయిలపై జరిగే దాడులు, హింస వంటి అంశాలను చిన్మయి అస్సలు భరించరు. దాని గురించి పోరాటం చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. ఇటువంటి రెండు భిన్న మనస్తత్వాలు ప్రేమలో పడేందుకు.. అక్కడి నుంచి పెళ్లి వరకూ ప్రయాణం చేసేందుకు ట్విట్టర్ ది చాలా ముఖ్యమైన పాత్ర అట. 

2012లో అందాల రాక్షసి అనే చిత్రం ద్వారా తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు రాహుల్ రవీంద్రన్. ఆ చిత్రంలో ఆయన పక్కన నటించిన లావణ్య త్రిపాఠి పాత్రకి తెలుగులో డబ్బింగ్ చెప్పింది చిన్మయి. అలా ఈ ఇద్దరు తొలిసారి అందాల రాక్షసి ప్రీమియర్ కోసం చెన్నైలో మొట్టమొదటి సారిగా కలుసుకోవడం జరిగింది.

ADVERTISEMENT

ఆ ప్రీమియర్ లో రాహుల్ రవీంద్రన్ (rahul ravindran) తల్లి మొదట చిన్మయితో మాట్లాడి ఆ తరువాత రాహుల్ కి పరిచయం చేసిందట… ఆ తర్వాత ఈ చిత్రం తనకి బాగా నచ్చడంతో ట్విట్టర్ వేదికగా రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర & లావణ్య త్రిపాఠి లని అభినందిస్తూ ట్వీట్ చేసింది చిన్మయి.

ఆ ట్వీట్ కి రాహుల్ రిప్లై ఇవ్వడంతో వీరి స్నేహం ట్విట్టర్ ద్వారా మొదలైంది. అలా కొద్దిరోజులు గడిచాక, పురాణాల గురించి ఒక టాపిక్ పైన రాహుల్ తన ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేయగా.. ఆ విశ్లేషణని సమర్థిస్తూ చిన్మయి ట్వీట్ చేసింది. ఇలా క్రమంగా ఇద్దరి భావనలు ఒకేలా ఉండడంతో వారి స్నేహం ట్విట్టర్ నుండి ఫోన్ లో మెసేజెస్ & కాల్స్ వరకు వెళ్ళింది.

జీవిత – రాజశేఖర్ లవ్ స్టోరీ తెలుసుకుంటే క్రేజీ అనాల్సిందే

ఇలా ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతున్న కొద్దీ చిన్మయి ని  ఇష్టపడడం మొదలుపెట్టాడు రాహుల్. ఇదే విషయాన్ని ఆమెకి పరోక్షంగా తెలియచేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆమె అందుకు స్పందించేది కాదు. అందుకే ఆమెకి తన మనసులో మాట నేరుగా చెప్పేశాడు రాహుల్. కానీ అప్పుడు ఆమె రాహుల్ ప్రపోజల్ ని తిరస్కరించింది, మెల్లగా అతన్ని దూరం పెట్టేసింది. ఇలా ఒక ఆరు నెలల పాటు ఒకరితో మరొకరు మట్లాడుకోలేదు కూడా.

ADVERTISEMENT

ఈ సమయంలో ఒకరోజు దర్శకుడు సెల్వరాఘవన్ ప్రేమ & పెళ్లి గురించి చిన్మయితో మాట్లాడుతూ.. జీవితంలో సరైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎంత ముఖ్యమో అని వివరించారట. సరైన వ్యక్తి అనగానే చిన్మయికి ఒక్కసారిగా తనని ఇష్టపడుతున్నాను అని చెప్పిన రాహుల్ రవీంద్రన్ గుర్తుకు వచ్చాడట.

సెల్వరాఘవన్ మాటల ప్రభావమో లేక మనసులో రాహుల్ పట్ల ఉన్న ప్రేమనో కాని .. తిరిగి అతడితో మాట్లాడడం ప్రారంభించింది చిన్మయి. అంతే కాదు.. ఆ తరువాత కొద్దిరోజులకే రాహుల్ ప్రేమను కూడా అంగీకరించింది. అలా ఈ ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఆపై కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ మొదటిసారి కలిసింది 2012లో అయితే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కింది మే 5, 2014.. అంటే వీరిమధ్య ఉన్న పరిచయం ఒక బలమైన బంధంగా బలపడడానికి రెండేళ్ల సమయం పట్టింది. 

అయితే వీరి వివాహం జరిగిన తరువాత ఈ ఇద్దరి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికి కూడా ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమలో ఏమాత్రం కూడా తేడా రాలేదు.. కొన్ని రోజుల క్రితం #MeToo అంశంలో తానూ వేధింపులు ఎదుర్కొన్నానని చిన్మయి చెప్పినప్పుడు ఆమె పైన ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా దాడికి దిగినా తన భార్యకి మద్దతుగా నిలిచాడు రాహుల్. అలాగే హీరోగా ఉన్న రాహుల్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకుంటాను అని చెబితే చిన్మయి ఆ నిర్ణయానికి మద్దతు తెలిపి అండగా నిలిచింది.

మనసులో నిజమైన ప్రేమ ఉంటే చాలు.. అది ఎలాగైనా గెలుస్తుందని వీరిద్దరి ప్రేమ మనకు చెబుతుంది. 

ADVERTISEMENT

మాది 100 % ‘లవ్ స్టోరీ’ – సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

 

22 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT