తరచూ ముద్దు పెట్టుకోవడం మీ ఇద్దరికీ ఎంత మంచిదో తెలుసా..?

తరచూ ముద్దు పెట్టుకోవడం మీ ఇద్దరికీ ఎంత మంచిదో తెలుసా..?

ముద్దు (kiss).. మనలోని ప్రేమను మొత్తం వ్యక్తీకరించే భాష అది. మనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ముద్దు ద్వారా చాలా అందంగా, ఎదుటివారికి వ్యక్త పరిచే వీలుంటుంది. మనల్ని ప్రేమించే వ్యక్తులకు మన ప్రేమను ముద్దు రూపంలో చూపించడం చాలా మంది చేసే పనే.. ప్రతి ప్రేమ కథలోనూ తొలి ముద్దు ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అయితే కేవలం ప్రేమను వెల్లడించడం మాత్రమే కాదు.. ముద్దు వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు (benefits) ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా? తెలుసుకుందాం రండి..

1. హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి..

మనం ముద్దు పెట్టుకున్నప్పుడు మన మెదడు హ్యాపీ హార్మోన్లు విడుదల చేస్తుంది. ఈ హ్యాపీ హార్మోన్లన్నీ కలిసి మనల్ని అదో రకమైన ఆనందంలో ముంచెత్తుతుంది. అందుకే ఆనందానికి అద్భుతమైన మంత్రం ముద్దే అని గుర్తుంచుకోవాలి.

2. సూపర్ మ్యాన్ అయిపోతారు..

ముద్దు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కూడా. ముద్దు పెట్టుకున్నప్పుడు ఒకరి నోట్లోంచి మరొకరి నొటిలోకి లాలాజలం ద్వారా సూక్ష్మ జీవులు మారుతాయి. దీనివల్ల మన శరీరం దానికి సంబంధించి యాంటీ బాడీస్ విడుదల చేస్తుంది. దీనివల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు మనకు రాకుండా రోగ నిరోధక శక్తి బలంగా మారుతుంది.

3. అందంగా కనిపించేలా..

కాస్త ఎక్కువ సమయం పాటు ముద్దు పెట్టుకోవడం వల్ల మన ముఖంలో ఉన్న కండరాలకు వ్యాయామం అందుతుంది. ఎంత ఎక్కువగా ముద్దు పెట్టుకుంటే అవి అంత బలంగా తయారవుతాయి. మీ ముఖం అంత అందంగా కనిపిస్తుంది. దీంతో పాటు రక్త ప్రసరణ వేగం కూడా పెరుగుతుంది కాబట్టి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

4. ఒత్తిడి ని తగ్గించేస్తుంది.

మీరు ఆఫీస్ ఒత్తిళ్లు లేదా ఇతరత్రా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మీరు ప్రేమించిన వారిని ఓ నిమిషం లేదా రెండు నిమిషాల పాటు గట్టిగా ముద్దు పెట్టుకోండి. దీనివల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్లు విడుదలవడంతో పాటు కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల తగ్గుతుంది. మనం ఒత్తిడి కి గురైనప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఇది. కొన్ని నిమిషాల పాటు ముద్దు పెట్టుకోవడం మెడిటేషన్ చేయడంతో సమానం అట. అందుకే ఓ చక్కటి ముద్దు తర్వాత మీ ఒత్తిడి చాలా వరకూ తగ్గుతుంది.

5. ఇద్దరి బంధం బలంగా మారుతుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల లవ్ హార్మోన్ల విడుదల పెరుగుతుంది. ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని పెంచుతుంది. మీ బంధం సరైన దిశలో సాగేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.

 6. నోటి శుభ్రత పెరుగుతుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల నోరు, పళ్లు సహజంగానే శుభ్రమైపోతాయి. పంటి పిప్పిని కలిగించే బ్యాక్టీరియా పళ్లకు అతుక్కుపోకుండా ఇది చేయడంతో పాటు నోటి శుభ్రతను పెంచుతుంది.

7. మీ రొమాంటిక్ మూడ్ పెంచుతుంది.

మంచి రొమాన్స్ కి మూడ్ పెంచేది ముద్దే.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముద్దు పెట్టుకోవడం అనేది రొమాన్స్ కి తద్వారా సెక్స్ కి కూడా దారి తీస్తుంది. ఇద్దరి మధ్య రొమాన్స్ ని పెంచేందుకు ముద్దు కంటే మరో ముఖ్యమైన మార్గం ఇంకొకటి లేదు.

8. నొప్పిని ఇట్టే తగ్గించేస్తుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది అంటే వినడానికి జోక్ లా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా నిజం. ముద్దుకి తక్కువ స్థాయి నొప్పి ని పూర్తిగా తగ్గించే గుణం ఉంది. అందుకే తల నొప్పి, పిరియడ్ సమయంలో ఎదురయ్యే నొప్పి ని కూడా తగ్గిస్తుంది. నొప్పి తగ్గించేందుకు పెయిన్ కిల్లర్ వేసుకోవడం కంటే ఇది చాలా సులువు కదా..

9. బాధను దూరం చేసేస్తుంది.

సాధారణంగా మనం ఒక్కో రోజు చాలా సంతోషంగా ఉంటాం. మరికొన్నిసార్లు చాలా బాధలో ఉంటాం. ఆరోజు జరిగిన ఏదో ఒక సంఘటన లేదా గతంలో జరిగిన సంఘటన గుర్తుకురావడం దీనికి కారణం. అయితే ఇలాంటప్పుడు మీరు ప్రేమించిన వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఇచ్చే ముచ్చటైన ముద్దు మీ బాధను సగానికి సగం తగ్గించేస్తుంది. మిగిలిన సగం తగ్గేందుకు వారితో మీ బాధను పంచుకొని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సిందే.

10. ప్రేమను పంచుతుంది.

ప్రేమను పంచేందుకు ముద్దు కంటే వేరే ఇతర అద్భుతమైన మార్గం లేదనే చెప్పుకోవాలి. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ మనసైన వారిని ముద్దు ల్లో ముంచెత్తండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.