తను సెక్స్ విషయంలో.. మీకు చెప్పాలనుకునే సీక్రెట్లు ఏంటో తెలుసా?

తను సెక్స్ విషయంలో.. మీకు చెప్పాలనుకునే సీక్రెట్లు ఏంటో తెలుసా?

సీక్రెట్లు (secrets).. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. కొందరు వాటిని తమకు నచ్చినవారితో.. తాము అందరికంటే ఎక్కువగా నమ్మే వారితో పంచుకుంటూ ఉంటారు. మరికొందరు తమలోనే దాచుకుంటారు. అయితే కొన్ని సీక్రెట్లు ఎదుటివారితో పంచుకోవడం వల్ల మనకు మంచే జరుగుతుంది. కొన్ని సీక్రెట్లు పంచుకోవడం వల్ల ఆనందం కలిగితే.. మరికొన్ని సీక్రెట్లు మనసులోని భారాన్ని తగ్గిస్తాయి.

సాధారణంగా చెప్పుకునే సీక్రెట్లు మాత్రమే కాదు.. సెక్స్ (sex) గురించి చెప్పుకునే సీక్రెట్లు కూడా కొన్ని ఉంటాయి. అందుకే ఈ రోజు సెక్స్ గురించి.. మగవారు తమ భాగస్వామితో షేర్ చేసుకోవాలనుకునే సీక్రెట్లు ఏంటో తెలుసుకుందాం..

అబ్బాయిలు ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్‌గా ఉంటారని చాలామంది భావిస్తారు. కానీ సెక్స్ విషయంలో మాత్రం వారు కలల ప్రపంచంలో మునిగి తేలుతుంటారు. సెక్స్‌లో పాల్గొంటున్నట్లు.. పోర్న్ సినిమాల్లో చూసిన భంగిమలు ప్రయత్నిస్తున్నట్లు.. ఇలా చాలా రకాల కలలు కంటూ ఉంటారు.

వాటిలో కొన్నింటి గురించి మీకు చెప్పినా.. మరికొన్ని కలల గురించి మాత్రం వారు తమలోనే దాచుకుంటారు. వారి నుంచి ఈ సీక్రెట్లు వినేందుకు ముఖ్యమైన మార్గం వారితో మీకున్న కలలను పంచుకోవడమే.. మీరు సీక్రెట్లు చెబితేనేగా వారూ మీతో మాట కలిపేది.. అందుకే మీరూ మీకున్న కలల గురించి వారితో పంచుకోండి.. 

చాలామంది కలలను కంటారు. అయితే సెక్స్ విషయంలో మాత్రం.. అందరికీ అన్ని విషయాలూ తెలీవు. అయితే.. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి.. కొత్తవి ప్రయత్నించాలన్న కోరిక మాత్రం తప్పక ఉంటుంది. మీక్కూడా ఇలాంటి ఆసక్తి, కోరిక ఉండాలని వారు కోరుకుంటారు. ఒకవేళ మీకు అలాంటి కోరిక ఉంటే చాలు.. మీ ఇద్దరూ కలిసి కొత్త ప్రపంచాన్ని వెతుక్కోవచ్చు. ఆనందపు అంచులనూ చూడవచ్చు. 

సెక్స్ అనేది ఎప్పుడూ ఒకేలా చేయాలని ఎవరూ అనుకోరు. అందుకే చాలాసార్లు సున్నితంగా ప్రయత్నించినా.. కొన్ని సార్లు మాత్రం నొప్పిలోనే వారు ఆనందాన్ని వెతుక్కుంటారు. కొన్ని సార్లు సెక్స్‌ని రఫ్‌గా ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది కొన్నిసార్లు.. ఎదుటివారి ప్రమేయం లేకుండానే  వేగంగా సెక్స్ చేస్తుంటారు. దీనికి వారిలో గూడుకట్టుకుపోయిన కోరికలు కూడా కారణమని చెప్పుకోవచ్చు.

కొన్ని సార్లు సెక్స్ చాలా ఎక్కువ సమయం పాటు కొనసాగాలని.. మగవాళ్లు కూడా కోరుకుంటారు. భాగస్వామితో తాము ఎంజాయ్ చేసే సమయం.. ఇంకా ఎక్కువగా ఉండాలని వారు కోరుకుంటారు. అందుకే చాలా సార్లు రియల్ సెక్స్ ప్రారంభించేందుకు కాస్త సమయం తీసుకుంటారు. దీనివల్ల రొమాన్స్‌కు చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో వారు తమకు కావాల్సిన ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు.

కొందరు మగాళ్లు ఎప్పుడూ సెక్స్‌ను కోరుకుంటూనే ఉంటారు. అది రాత్రయినా.. పగలైనా సరే. పగలంతా పని చేసి బాగా అలసిపోయాక.. సేదతీరడానికి సెక్స్‌ను ఒక వాహకంగా ఉపయోగించుకుంటారు. అంతెందుకు.. అప్పటికే ఒకటి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొన్నా సరే.. ఇంకా వారికి ఆ కోరిక మాత్రం అలాగే ఉంటుంది. ఒకవేళ మీకు ఇష్టమైతే సరే.. లేదంటే మీ భావాలను మీ భాగస్వామితో నేరుగా చెప్పడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదని గమనించాలి. 

మగాళ్లు తమ శరీరాన్ని ఎంతగానో ప్రేమిస్తారు. అయితే తమ శరీరాన్ని చూసి మీరెలా ఫీలవుతున్నారో తెలుసుకోవడానికి వారు ఎంతగానో ఇష్టపడతారట. అంతేకాదు.. సెక్స్ సమయంలో వారు మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరచగలుగుతున్నారా ? లేదా? అన్న విషయాన్ని కూడా మీరు చెప్పాలని ఆశిస్తారు.  అలాగే మీరు కూడా మీ మనసులోని ఫీలింగ్స్‌ను పంచుకోవడం వల్ల.. ఇద్దరూ దగ్గరవుతారు. 

ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరికీ పెట్టని ఆభరణం. అదే ప్రతి ఒక్కరికీ సెక్సీ లుక్‌ని కూడా అందిస్తుంది. చాలామంది ఆడాళ్లు తమ శరీరం లావుగా ఉందనో లేదా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయనో దాన్ని ఇష్టపడరు. కానీ తన భార్య సెక్స్ విషయంలో.. ఆత్మవిశ్వాసంతో ఉండడమనేది ప్రతి ఒక్కరికీ ఇష్టం. దీనికోసం మీ శరీరాన్ని మీరు ప్రేమించుకోవాలని మీ భాగస్వామి భావిస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ.. తనని ప్రేమించడం వారికెంతో ఇష్టం కూడా.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.