నా అభిమానులు.. నాకు గుడి కడితే బాగుంటుంది : రష్మిక మందాన

నా అభిమానులు.. నాకు గుడి కడితే బాగుంటుంది : రష్మిక మందాన

అప్పుడెప్పుడో తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌కు ఖుష్బూకి.. ఆమె అభిమానులు గుడి కట్టారట. అదే స్థాయిలో సినీ అభిమానులు నటి శ్రీదేవికి గుడి కట్టకపోయినా.. ఆమె కటౌట్లకి పాలాభిషేకాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వీరి లిస్టులో చేరాలని కోరుకుంటోంది మరో నటి. ఆమే రష్మిక మందాన (Rashmika Mandanna). గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో తెలుగు సినీ అభిమానుల మనసును దోచుకున్న ఈమె.. ఇటీవలే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టింది. 

"నా అభిమానులు నాక్కూడా గుడి కడితే బాగుంటుంది" అని ఆమె తెలిపింది. అయితే "ఇలా మీరెలా ఆలోచిస్తారని" ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా.. దానికి కూడా సమాధానమిచ్చింది రష్మిక. "ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నేను కేవలం నా అభిమానులు కూడా నాకు గుడి కడితే బాగుంటుందనే కోరికను బయటపెట్టాను. అంతే కానీ తప్పనిసరిగా అలా చేయమని వారిని కోరలేదు కదా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఏమో.. నా అభిమానులు నాకు గుడి కూడా కట్టవచ్చు" అని తెలిపిందామె. 

మహేష్ బాబు vs అక్కినేని అఖిల్.. ఈ ఇద్దరిలో రష్మిక ఓటు ఎవరికి?

2016 లో కన్నడంలో "కిరాక్ పార్టీ" చిత్రం ద్వారా.. సినీ పరిశ్రమకు పరిచయమైన నటి రష్మిక మందాన. ఈ చిత్రం తర్వాత ఆమె అంజనీ పుత్ర, చమక్, యజమాన, పొగరు మొదలైన కన్నడ చిత్రాలలో నటించింది. నాగశౌర్య సరసన ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం "ఛలో". ఈ చిత్రం తర్వాత ఆమెకు వరుసగా తెలుగులో ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా 'గీత గోవిందం'లో కథానాయికగా ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హీరోతో సమానంగా ఆమె పోషించిన పాత్రకు ఎందరో అభిమానులనూ సంపాదించుకుంది.

ఇప్పుడు రష్మిక చేతిలో వరుస చిత్రాలున్నాయి. భీష్మ, సరిలేరు నీకెవ్వరుతో పాటు అల్లు అర్జున్ నటిస్తున్న 20వ చిత్రంలో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది రష్మిక. అలాగే 'సుల్తాన్' చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయం కాబోతుంది ఈ అమ్మడు. కన్నడంలో తను నటించిన తొలి చిత్రానికే సైమా పురస్కారాన్ని కైవసం చేసుకున్న రష్మిక.. 'గీత గోవిందం' చిత్రంలోని నటనకు గాను.. జీ సినీ అవార్డును కైవసం చేసుకుంది. అయితే రష్మిక మాతృభాష కన్నడం అయినప్పటికీ కూడా.. తెలుగులో ఆమెకు ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండడం విశేషం. 

ఈ ముద్దుకు... కథకు సంబంధముంది: 'డియర్ కామ్రేడ్' కథానాయిక రష్మిక

కర్ణాటకలోని కొడగు జిల్లాలో పుట్టి పెరిగిన రష్మిక.. జర్నలిజంలో డిగ్రీ చేసింది. తర్వాత ఫ్యాషన్ అడ్వర్టైజింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత.. కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన రష్మిక.. తర్వాత తనతో పెళ్లికి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా.. ఈ జంట విడిపోయింది. ప్రస్తుతం దక్షిణాదిలో వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తున్న నటీమణుల్లో రష్మిక కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. 

మీరు నన్ను భయపెట్టలేరు - 'డియర్ కామ్రేడ్'లో విజయ్ దేవరకొండ

Featured Image: Instagram.com/Rashmika Mandanna

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.