03 నవంబరు 2019 (ఆది వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

03  నవంబరు 2019 (ఆది వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (03 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు ఇతరులు వారి సమస్యల మధ్యలోకి మిమ్మల్ని లాగుతారు. ఇద్దరిలో ఒకరి పక్షాన ఉండాల్సి రావడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. మీరు అనుకున్నట్లుగా అన్నీ జరగవు. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకండి. సాయంత్రానికి మీరు పూర్తిగా అలసిపోతారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు ఉదయం నుంచే మీరు చాలా ఫ్రెష్ గా ఫీలవుతారు. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. సాయంత్రం బంధువులు లేదా స్నేహితులను కలుస్తారు. అయితే మీరు చేయాల్సిన పని పెండింగ్ ఉండడం వల్ల దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు పెండింగ్ పనులు పూర్తి చేయడంతో పాటు మీ వార్డ్ రోబ్ సర్దడానికి ఉపయోగించండి. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీరు పూర్తిగా రిలాక్స్ అవుతూ అసలే పనీ చేయకుండా ఉండాలనుకుంటారు. కానీ మీరు చేయాలనుకుంటున్న పనులు చేసేందుకు ఇతరులను బతిమాలాల్సి వస్తుంది. పెద్దవారితో గొడవలు వద్దు. మీరు ఈరోజు చాలా అలసిపోయినా కుటుంబ సభ్యుల కోసం పనిచేసిన ఆనందంతో నిద్రపోతారు. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీరు మీకు కొంత సమయాన్ని కేటాయించుకుంటారు. స్నేహితులు, కుటుంబానికి కూడా సమయాన్ని ఇచ్చి వారితో ఆనందంగా గడుపుతారు. మనసుకు నచ్చిన వారితో సమయం గడుపుతూ వారి గురించి ఇంకా లోతుగా తెలుసుకుంటారు. సాయంత్రాలు పాత స్నేహితులను కలుస్తారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీరు చాలా విశ్రాంతి తీసుకుంటారు. రోజంతా రిలాక్సింగ్ గా ఉన్నా మీ భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సాయంత్రం కుటుంబ సభ్యులందరితో కలిసి సినిమా లేదా డిన్నర్ కి వెళ్తారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు మీకు మాత్రమే సమయాన్ని కేటాయించుకుంటారు. స్నేహితులు సాయంత్రం కలిసే ప్లాన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా మీరు మాత్రం మీ ప్లాన్లతో బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు స్పాలో గడపడం లేదా ఒంటరిగా మీకు నచ్చిన పుస్తకం చదువుతూ సమయం వెళ్లబుచ్చడం చేస్తారు. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. మీరు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడపాల్సి ఉంటుంది. ఓ ఫ్రెండ్ మానసికంగా ఇబ్బంది పడుతూ ఓదార్పు కోసం మీ వద్దకు వస్తారు. ఇవన్నింటి మధ్యలో మీరు మీ పనిని కూడా పూర్తి చేస్తారు. రాత్రి చక్కటి నిద్రతో రేపటికి సిద్ధమవుతారు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీరు మనసులో ఉన్నది బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటారో అని ఎప్పటినుంచో మీ మనోభావాలను లోపలే దాచుకున్నారు. వాటిని ఇకనైనా బయటపెట్టండి. లేదంటే మీరు మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. సాయంత్రాలు స్నేహితులతో సమయం గడుపుతారు. మీకు పనిలో ఉపయోగపడే కొత్త వ్యక్తులను కలుస్తారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీ ఆరోగ్యం అంతగా బాగోదు. అందుకే మీరు వేసుకున్న చాలా ప్లాన్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లోనే మీ కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటారు. ఈరోజు సమయం దొరికితే కాస్త నిద్రపోండి. బంధువులు, స్నేహితులను కలుస్తారు. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీకు చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. మీకు నచ్చిన పని చేస్తూ నచ్చిన వ్యక్తులతో మాట్లాడుతూ సమయం గడుపుతారు. స్నేహితులు అనుకోకుండా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తారు. మీ భాగస్వామి మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. చిన్న వారి అల్లరిని చూసి కోపగించుకోకండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీరు చాలా చేయాలనుకుంటారు. కానీ ఎదుటివారు మీకు సహకరించరు. అయితే మీరు చేయాలనుకున్నది చేయమని ఎదుటివారిని బలవంతం చేయకండి. మీరు చేయాలనుకున్నవి మీరే స్వతంత్రంగా చేయండి. ఎక్కువ ఖర్చు చేయకండి. స్నేహితులు వారికి ప్రత్యేకమైన ప్లాన్లు చేసుకోవడం వల్ల మీరు ఒంటరిగా ఫీలవుతారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలా ఉంటుంది. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లండి. కుటుంబం, స్నేహితుల మధ్య సమయం విభజించుకోవాల్సి వస్తుంది. చాలా కాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. తల్లిదండ్రులతో గొడవలు పెట్టుకోండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.