04 నవంబరు 2019 (సోమ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

04  నవంబరు 2019 (సోమ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (04 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు పెండింగ్ లో ఉన్న చాలా పని ముందుకు సాగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఇతరులు మీ పనిని గుర్తిస్తారు. మిమ్మల్ని మీరు అందరిలోనూ ప్రత్యేకంగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తారు. డబ్బు ఎక్కువగా అందుతుంది. కుటుంబ సభ్యులతో సాయంత్రాలు ఆనందంగా గడుపుతూ భవిష్యత్తు గురించి కలలు కంటారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీరు మీ తోటి పనివారితో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వారు సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరికి వస్తే మీరు కూడా ఓపెన్ గా ఉండండి. ఓ ముఖ్యమైన మీటింగ్ వాయిదా పడుతుంది. కుటుంబ సభ్యులు డల్ గా ఉంటారు. వారికి మీ సహకారం అందించండి. 

మిథున రాశి  (Gemini) – ఇంతకుముందు కంటే పని చాలా మెరుగ్గా ఉంటుంది. కానీ ప్రణాళిక ప్రకారం పనిచేసేందుకు ప్రయత్నించండి. నిర్ణయాలు తీసుకొని మళ్లీ వాటిని మార్చడం వల్ల ఇతరులకు గందరగోళంగా అనిపిస్తుంది. పని ఎక్కువగా ఉండడం వల్ల ఆఫీస్ లోనే అలసిపోతారు. కాబట్టి కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీ క్రియేటివ్ ఆలోచనలను మీ పై అధికారులు ప్రశంసిస్తారు. గతంలో పరిచయం ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి స్నేహితుల నుంచి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. స్నేహితులు మిమ్మల్ని ఒత్తిడి నుంచి బయట పడేస్తారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీ పని మామూలుగానే ఉన్నా పని ప్రదేశంలో కొలీగ్ తో గొడవ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయితే వారిని అలాగే ఉండనివ్వండి. కుటుంబ సభ్యులు వారి ఒత్తిడిలో ఉంటారు. దాన్ని తగ్గించేందుకు వారితో సమయం గడపండి. స్నేహితులతో సాయంత్రం గడుపుతూ పని గురించి, ఆధ్యాత్మిక అంశాల గురించి మాట్లాడుకుంటారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు చాలాకాలం నుంచి మీరు పడిన కష్టానికి ప్రతిఫలం పొందుతారు. మీ పై అధికారులు మీ ఐడియాలను ఒప్పుకొని మిమ్మల్ని ప్రశంసిస్తారు. డబ్బు విషయంలో ప్లానింగ్ చేసుకుంటారు. మీ భాగస్వామి నుంచి సలహాలు తీసుకోండి. స్నేహితులు ఆఖరి నిమిషంలో ప్లాన్ చేసి మిమ్మల్ని ఆహ్వానించడంతో సాయంత్రం ఆనందంగా గడుపుతారు. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీరేం చేసినా వాటికి సంబంధించి విమర్శలే ఎదురవుతూ ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే తోబుట్టువులతో ఇబ్బంది ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండండి. పాత స్నేహితులను కలుస్తారు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీకు కొత్త ప్రాజెక్టులు, ఆర్డర్లు మీకు లభిస్తాయి. ఓ పాత క్లైంట్ మీ దగ్గరికి సలహా కోసం వస్తారు. కొత్త టీం మెంబర్స్ తో కలిసి పని చేస్తారు. ఖర్చు ఎక్కువగా పెట్టడం సరికాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అయితే వీలైనంత ఎక్కువగా ఒంటరిగా సమయం గడిపేందుకు ప్రయత్నించండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీరు చాలా పని పూర్తి చేస్తారు. కొత్త పనివారు లేదా ఫ్రీలాన్సర్ల గురించి కూడా వెతుకుతారు. కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతుంటాయి వాటిని మర్చిపోయేందుకు స్నేహితులతో కలిసి సమయం గడుపుతారు. 

మకర రాశి  (Capricorn) – క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు చాలా మంచి రోజు. మీ ఆలోచనలు, పనులు ఒకే రకంగా ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా పని చేయాల్సి ఉంటుంది. వేగంగా చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. స్నేహితులతో సమయం గడపాలని ఉన్నా ఒంటరిగా ఉండి పెండింగ్ పని పూర్తి చేస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు ఉదయం చాలా పని ఒత్తిడి ఉంటుంది. సాయంత్రానికి ఇతరుల ఆలస్యం వల్ల పని వాయిదా పడడం, దానికి మీరేం చేయలేకపోవడం వంటివాటి వల్ల చిరాగ్గా ఉంటుంది. అయితే మరీ ఎక్కువగా ఒత్తిడి పెంచడం సరికాదు. ఒంటరిగా సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీరు అన్ని విషయాలను మర్చిపోతుంటారు. కుటుంబం, పని అన్నీ సజావుగానే సాగినా మీ మెదడు పూర్తిగా బ్లాంక్ అయిపోయినట్లుగా ఉంటుంది. ఏదైనా మంచి పని లేదా మీకు నచ్చిన అలవాటు పై ఫోకస్ పెట్టడం వల్ల సాయంత్రానికి అంతా మామూలుగా మారుతుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.