ఈ రోజు (06 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు మీరు ఉదయం లేచినప్పటి నుంచే చాలా ఉత్సాహంగా ఫీలవుతారు. మీ శక్తినంతా ఉపయోగించి పని పూర్తయ్యేలా చేస్తారు. ఈ రోజు మీ పని కూడా చాలా వేగంగా పూర్తవుతుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. స్నేహితులు మీ సలహా కోరుకొని మీ దగ్గరికి వస్తారు.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు మీ పని మామూలుగానే సాగినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరులు మీ పని తీరును ఒప్పుకోకపోవచ్చు. మీరు ఏదైనా డీల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని ఈ రోజు మొదలు పెట్టకపోవడం మంచిది. ఈ రోజు మీరేం చేసినా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటారు. సాయంత్రం మీకు నచ్చిన పని చేస్తూ వీటన్నింటినీ మర్చిపోయే ప్రయత్నం చేయండి.
మిథున రాశి (Gemini) – ఈ రోజు మీ పనిలో మీకు ఆసక్తి కలిగించేది ఏదీ ఉండదు. ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారు. కొత్త ఆలోచనలేవీ రావు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. సాయంత్రానికి పని వల్ల అలసిపోయి ఒంటరిగా విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటారు.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు మీకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పని వాయిదా పడుతూ మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కొత్త పనులు మిమ్మల్ని సంతోషపెట్టినా.. ప్రస్తుతం చేయాల్సిన పని మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పని పూర్తి చేయడానికి మీ తోటి పనివారిని కూడా కాస్త ఇబ్బంది పెట్టినా ఆఖరిని పని పూర్తవుతుంది. స్నేహితులతో గతంలో జరిగిన విషయాలు తలచుకొని గొడవ పెట్టుకోకండి.
సింహ రాశి (Leo) – ఈ రోజు మీకు కొత్త ఆలోచనలు వచ్చిన పనిని ఉత్సాహంగా చేయాలనుకున్నా.. పని మీరు అనుకున్నట్లుగా సాగకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ ఆలోచనలకు, మీరు చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. స్నేహితులను కలిసి జరిగిన విషయాలు మర్చిపోయే ప్రయత్నం చేయండి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య రాశి (Virgo) – ఈ రోజు మీకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. మీ టీమ్ సభ్యుల నుంచి కూడా సహాయం లేకపోవడం వల్ల చాలా చిరాగ్గా అనిపిస్తుంది. కొత్త వారిని పనిలోకి తీసుకుంటారు. అయితే పని గురించి మాత్రం మీకు క్లారిటీ ఉండదు. సాయంత్రం స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు.
తుల రాశి (Libra) – ఈ రోజు మీరు కోరుకున్నట్లుగా కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కొత్త వ్యక్తులను పనిలోకి తీసుకుంటారు. కొత్త డీల్స్ కూడా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి పట్టించుకోండి. మానసికంగా వారికి కాస్త విశ్రాంతినివ్వడం మంచిది.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీ పని చాలా నెమ్మదిగా సాగుతుంది. నిర్ణయాలు తీసుకునేందుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. తోటి పనివారితో గొడవలు పెట్టుకోకండి. గతంలో జరిగిన విషయాలు గుర్తుంచుకొని కొందరు మీపై కోపం పెంచుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని వారు చెబితే మీరు అది కాదని నిరూపించేందుకు ప్రయత్నించకండి. కుటుంబంలో అందరూ బిజీగా ఉండడం వల్ల మీరు ఒంటరిగా సమయం గడుపుతారు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు రాశి (Saggitarius) – ఈ రోజు ఉదయం అంతా మీటింగ్స్, చర్చలతో సాగిపోతుంది. సాయంత్రానికి మీరు పూర్తిగా అలసిపోపతారు. పని పై ఫోకస్ పెట్టలేకపోతారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మీరు ఒంటరిగా ఉండిపోతారు. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నించండి.
మకర రాశి (Capricorn) – ఈ రోజు మీ పని చాలా అద్భుతంగా సాగుతుంది. మీరు గతంలో చేసిన పనికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు, మీటింగ్స్ అన్నీ సక్సెస్ ఫుల్ గా సాగి మిమ్మల్ని సెంటరాఫ్ అట్రాక్షన్ గా మార్చేస్తాయి. అయితే పనిలో ఎక్కువ సమయం గడపడం వల్ల కుటుంబంతో ఎక్కువగా ఉండలేరు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు పని మామూలుగా ఉంటుంది. చాలామంది నిర్ణయాల గురించి మీ పై ఆధారపడతారు. మీటింగ్స్ లో ఆఖరి నిమిషంలో జరిగే మార్పుల వల్ల మీ షెడ్యూల్ చాలా బిజీగా మారిపోతుంది. కుటుంబ సభ్యులు మీతో మాట్లాడాలనుకుంటారు. వారి కోసం సమయాన్ని కేటాయించండి. స్నేహితుల వ్యవహార శైలి మీకు నచ్చకపోవడం వల్ల వారి నుంచి దూరంగా ఉండొచ్చు.
మీన రాశి (Pisces) – ఈ రోజు మీరు ఇతరుల బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. గతంలో తీసుకున్న నిర్ణయాలతో మీరు ఇబ్బంది పడుతుంటే అది ఈరోజు తొలగిపోతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ ఆత్మవిశ్వాసం పెంచుతారు. కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.