07 నవంబరు 2019 (గురు వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

07  నవంబరు 2019 (గురు వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (07 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీ పని మామూలుగా సాగుతుంది. కానీ క్లైంట్ నుంచి మీకు మంచి గుర్తింపు రావడంతో ఆనందంగా అనిపిస్తుంది. మీకు ఈ రోజు చాలా క్రియేటివ్ ఆలోచనలు వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. మీ స్నేహితుల మధ్య గొడవను తగ్గించే ప్రయత్నం చేస్తారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీరు పనిచేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఓ క్లారిటీ లభిస్తుంది. ఓ ముఖ్యమైన మీటింగ్ వాయిదా పడుతుంది. కానీ ఆఖరికి అంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పేమెంట్స్ మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. 

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీరు మీ ఆలోచనలు, పనుల వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కాస్త ఇబ్బందిగా మారొచ్చు. మీ అంతట మీరే బాధ్యతలు తీసుకోవడం వల్ల ముందుకు వెళ్లొచ్చని భావించకండి. పని ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీరు కొత్త బాధ్యతల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ప్రస్తుతం కొనసాగిస్తున్న పని నెమ్మదిస్తుంది. ఓ ముఖ్యమైన వ్యక్తి గురించి మీ షెడ్యూల్ మార్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. ఓ ముఖ్యమైన ఈవెంట్ లో పాల్గొనాల్సి రావడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీకు కొత్త ఆలోచనలు వచ్చిన పనిని ఉత్సాహంగా చేయాలనుకున్నా.. పని మీరు అనుకున్నట్లుగా సాగకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీ ఆలోచనలకు, మీరు చేసే పనులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. స్నేహితులను కలిసి జరిగిన విషయాలు మర్చిపోయే ప్రయత్నం చేయండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా.. ఫలితం ఉండదు. సాయంత్రానికి మీరు చేసిన పని గురించి ఆలోచిస్తూ అలసిపోయినట్లు ఫీలవుతారు. పేపర్ వర్క్ చేయడం మంచిది. మీరు కొత్తగా చేస్తున్న పని గురించి ఇతరులకు ఎక్కువ సమాచారం అందించకండి. తోబుట్టువులతో గొడవలు జరుగుతాయి. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పని అస్తవ్యస్తంగా ఉంటుంది. దాన్ని సరి చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పాత క్లైంట్లు తిరిగి మీ దగ్గరికి వస్తారు. మీకు రావాల్సిన పేమెంట్లు ఆలస్యమవుతాయి. పాత స్నేహితులను కలుస్తారు. వారితో సాయంత్రం చాలా బిజీగా గడిచిపోతుంది. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ పని మామూలుగా ఉన్నా.. మీరు మరింత ఎక్కువ బాధ్యతలు తీసుకుంటారు. అయితే మీరు చేస్తున్న పని పట్ల మీరు అంత ఆనందంగా ఉండలేరు. మానసికంగా మిమ్మల్ని మీరు బలంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి. పెండింగ్ లో ఉన్న పేమెంట్స్ లభిస్తాయి. ఒంటరిగా ఎక్కువ సమయం గడుపుతారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు ఇతరుల ఆలస్యం వల్ల మీ పని వాయిదా పడుతుంది. మీకు చిరాకుగా అనిపించినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ పనిని షెడ్యూల్ చేసుకోండి. మీ ఆధీనంలో ఉన్న పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఇంట్లో పెద్ద వాళ్లతో గొడవలకు దూరంగా ఉండండి. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీ పనిని తిరిగి చేయాల్సి వస్తుంది. ఇది మీలో నిరుత్సాహాన్ని నింపుతుంది. మీ పై అధికారులు కూడా మీ పని పట్ల ఆనందంగా ఉండరు. ఏది అవసరమో గుర్తించి దాన్నే చేయాల్సి ఉంటుంది. విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల మీ ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. కుటుంబ సభ్యులు మీకు ఓదార్పునిస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీరు ఇంతవరకూ ఇది జరగాలి అని అనుకుంటున్న పనుల గురించి పునరాలోచించుకుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచనల వేగాన్ని తగ్గించుకుంటారు. పెండింగ్ లోని పనులు పూర్తి చేసేందుకు కుటుంబం, స్నేహితుల నుంచి దూరంగా ఉంటారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ పని ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. చాలా పనుల గురించి క్లారిటీ రావడం వల్ల వాటిని పూర్తి చేయాల్సి వస్తుంది. మీ సహోద్యోగి పని కూడా మీ పై పడడంతో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పని గంటలు పని చేయడం వల్ల విశ్రాంతి తీసుకోలేరు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.