11 నవంబరు 2019 (సోమవారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

11 నవంబరు 2019 (సోమవారం),  ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (11 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు బాగా కలిసొస్తుంది. ఆలుమగల మధ్య మనస్పర్థలు వచ్చినా.. అటువంటి సమస్యలు వేగంగానే సమసిపోతాయి. ప్రేమికులు కొన్ని ఊహించని చిక్కులలో పడతారు. ఇలాంటప్పుడే వివేకంగా ఆలోచించాలి. విద్యార్థులు లక్ష్యసాధనలో ఇంకాస్త కష్టపడాలి. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందే అవకాశం ఉంది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. మహిళలు స్వయం ఉపాధిని పొందుతారు. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. సినిమా, కళా రంగాలలో ప్రయత్నాలు చేస్తున్న వారికి ఊహించని అవకాశాలు తలుపు తడతాయి. 

కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. అలాగే విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బాల్య మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. కష్టపడి పనిచేసే ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రేమికులు తమ సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం ఉత్తమం.

సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే విధంగా ప్రణాళికలు రచించడం మంచిది. ఆర్థిక విషయాలలో రిస్క్ చేయవద్దు. కుటంబ వివాదాలలో ఆచితూచి వ్యవహరించండి. వాహన వినియోగంలో నియమాలను పాటించండి.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. భార్యభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చినా.. వేగంగానే కలిసిపోతారు. ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం అనేది ముఖ్యం. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. 

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ఆలుమగలు కొన్ని సందర్భాలలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం అనేది ముఖ్యం. తల్లిదండ్రులు కొన్ని విషయాలలో పిల్లలను కట్టడి చేయడం మంచిది.

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ లేదా ఇతరత్రా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు సన్మాన కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారస్తులు కూడా అనుకోని లాభాలు పొందుతారు. ప్రేమికులు కొన్ని అనుకోని పరిస్థితులలో చిక్కుకుంటారు. అయినా ఆ సమస్యల నుండి వేగంగానే బయటపడతారు.

మకర రాశి (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని అనుకోని సమస్యలను ఎదుర్కొంటారు. అయినా వాటి నుండి వేగంగానే బయటపడతారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిమిత్తం దూర ప్రాంతాలకు వెళతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా విరివిగా పాల్గొంటారు. విద్యార్థులు చదువు విషయంలో ఇంకా బాగా కష్టపడాల్సి ఉంది. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆలుమగలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యలు తామే పరిష్కరించుకోవాలి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఓ శుభవార్తను వింటారు. ఆలుమగల మధ్య పలు రొమాంటిక్ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.