ఈ రోజు (13 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అంతా లాభసాటిగా సాగుతుంది. భార్యభర్తల మధ్య చిన్నిపాటి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికులు ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువిస్తేనే.. ఎక్కువ కాలం బంధంలో కొనసాగగలరు. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు వివేకంగా ఆలోచించాలి. విద్యార్థులు ఇంకా కష్టపడి చదవాలి.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే క్రమంలో లేదా తీసుకొనే క్రమంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మహిళలు షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపిస్తారు. ఆలుమగలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడం మంచిది. వివాహితులు పలు శుభవార్తలు వింటారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కొన్ని విషయాలలో కట్టడి చేయడం మంచిది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం.
సింహ రాశి (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ప్రత్యర్థుల నుండి ఊహించని ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. మీ నిజాయతీయే మీకు శ్రీరామరక్ష. అలాగే వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. భార్యభర్తల మధ్య చిన్నిపాటి తగాదాలు ఏర్పడినా.. ఆ తర్వాత సర్దుకుపోతారు. ప్రేమికులు ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించాలి. అప్పుడే మీ బంధం మరింత పటిష్టమవుతుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేసేముందుకు ఆచితూచి వ్యవహరించాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి.
తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. ఆఫీసులో జరిగే కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగించవచ్చు. ఇలాంటప్పుడే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ఆలుమగలు కొన్ని విషయాలలో ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు లక్ష్యసాధనలో మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. సినిమా, మార్కెటింగ్ రంగాల్లోని వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధను రాశి (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సామాజిక సేవ పట్ల మొగ్గు చూపించే అవకాశముంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రేమికులు కొన్ని విపత్కర పరిస్థితుల నుండి బయటపడతారు. ఆలుమగలు దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు క్రీడలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. మంచి ఉపాధి అవకాశాలను పొందుతారు
మకర రాశి (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందే కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగులు తాము కష్టపడిన దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు. ప్రేమికులు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని విషయాలలో భావోద్వేగానికి గురవుతారు. కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపించే అవకాశముంది. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. భార్య భర్తలు తమ ఆంతరంగిక సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం మంచిది
మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అక్కరకు రాని స్నేహాలను దూరం పెట్టడం శ్రేయస్కరం. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు. సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.