14 నవంబరు 2019 (గురువారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

14 నవంబరు 2019 (గురువారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (14 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు మీరు కాస్త ఓపికగా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యర్థుల నుండి మీకు అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.  అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  కొన్ని విషయాలలో మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత జీవితం కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా హాయిగా సాగిపోతుంది. 

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు మీ జీవితంలో ప్రతిదీ స్థిరంగా ఉంటుంది. అయినా మిమ్మల్ని కొందరు అపార్థం చేసుకోవచ్చు. మీ ఉద్దేశాలు ఎలా ఉన్నా.. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండడం మేలు. అప్పుడప్పుడు మీ భాగస్వామికి తెలియకుండా.. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులలో పడతారు. అలాగే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. 

మిథున రాశి (Gemini) – కుటుంబ కట్టుబాట్ల కారణంగా.. మీరు మీ మనసుకి నచ్చని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు  మీరు కొన్ని వివాదాలలో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ ప్రత్యర్థుల వల్ల కూడా.. కొన్ని సందర్భాలలో మీకు లాభమే చేకూరుతుంది. అదేవిధంగా సమయపాలనను పాటించడం వల్ల మీకు అనుకోని లాభం చేకూరుతుంది. 

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీరు చేసే పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి. వ్యాపారస్తులకు ఊహించని విధంగా కొత్త ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగస్తులు పరధ్యానంలో పడి.. తప్పులు చేయకుండా ఉంటే మేలు. మీకున్న శక్తిని మీరే తక్కువ చేసుకొని చూడకపోవడం మంచిది. అలాగే మీ కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రియమైనవారితో కొంత సమయం గడపితే బాగుంటుంది. 

సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే వ్యాపారస్తులు అనుకున్న ఉత్పాదకతను పొందకపోవచ్చు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. అదేవిధంగా సామాజిక బాధ్యతల వల్ల కుటుంబ జీవితం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. మీ సలహా లేదా మార్గదర్శకత్వం కోసం కొందరు మిత్రులు మిమ్మల్ని సంప్రదించవచ్చు. వివాహితులు శుభవార్తలు వింటారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు విద్యార్థులు బాగా కష్టపడితే ఊహించని ఫలితం ఉంటుంది. అలాగే ఆలుమగలు ఎంతో సంతోషంతో గడుపుతారు.  కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారస్తులు చేసుకొనే ఒప్పందాలలో జాప్యం ఉండవచ్చు. అలాగే ఒక సమయంలో.. కేవలం ఒకే  విషయంపై దృష్టి పెట్టండి. మీ అలవాట్లు మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.  అలాగే దూర ప్రయాణలు చేస్తారు.

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు పనిలో ఉద్యోగులు లేదా సహచరులు సహకరిస్తారు. ఆఫీసులో మంచి సామరస్య వాతావరణం ఉంటుంది. విద్యార్థులు కొన్ని గందరగోళ పరిస్థితులలో పడతారు. అదేవిధంగా పెండింగ్ చెల్లింపులు ఈ రోజు పూర్తి అవుతాయి. కుటుంబ జీవితం సజావుగా ఉంటుంది. అయితే సామాజిక కట్టుబాట్లు కొన్ని మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి.

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు కాస్త నిదానంగా పనులు చేయాలి. అలాగే మీ వ్యక్తిగత జీవితంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి. కొన్ని అనివార్య పరిస్థితులలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మీకున్న పరిమితులను బట్టి కూడా.. ప్రణాళికలను  పరిగణనలోకి తీసుకోండి. మీ కుటుంబం జీవితం కూడా కొన్ని ఒత్తిళ్లకు గురవుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) - ఈ రోజు మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అలాగే చేయబోయే పనుల మీద కూడా స్పష్టత వస్తుంది. వ్యక్తిగత జీవితానికి, ప్రొఫెషనల్ లైఫ్‌కి మధ్య సమతుల్యత కలిగి ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  సామాజిక కార్యక్రమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు.

మకర రాశి (Capricorn) – ఈ రోజు మీరు మీ మనసుకి నచ్చినట్లు నడుచుకోండి. కొన్ని పనులు వాయిదా పడినా చింతించవద్దు. మీ లక్ష్యసాధనలో నిజాయతీగా ఉండడం నేర్చుకోండి. అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. విద్యార్థులు అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకడం శ్రేయస్కరం. అలాగే ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ అవసరం. కుటుంబానికి కూడా సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు మీ ప్రాజెక్టులు అన్నీ నత్తనడకన నడుస్తాయి. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మనో ధైర్యంతో ముందుకు వెళ్లండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. మీ  కుటుంబ జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది.  ఆస్తి తగాదాలు, కోర్టు లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. చాలా రోజుల తర్వాత బాల్య మిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. అలాగే మీ పనిలో చాలా బిజీగా ఉంటారు. ఎడతెరిపి లేకుండా పనిచేస్తూనే ఉంటారు. అలాగే ఊహించని చిక్కులలో కూడా పడే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి సహకారం పూర్తిగా ఉంటుంది. వీలైనప్పుడు తన సలహాలు కూడా తీసుకోండి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు.  

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.