15 నవంబరు 2019 (శుక్రవారం), ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

15 నవంబరు 2019 (శుక్రవారం),  ఈ రోజు రాశిఫలాలు చదివేయండి

ఈ రోజు (15 నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి (Aries) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సోమరితనాన్ని వీడాల్సి ఉంటుంది. అలాగే కొన్ని విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మంచిది. అదేవిధంగా వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  తల్లిదండ్రులు పిల్లలను కొన్ని విషయాలలో కట్టడి చేయడం మంచిది.  ఇలాంటి విషయాలలో మీకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది.  ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

వృషభ రాశి (Tarus) –  ఈ రోజు మీకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మీ భాగస్వామి నుండి మీరు ఓ శుభవార్తను వింటారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. ప్రేమికులు కొన్ని సందర్భాలలో.. ఎదుటి వ్యక్తికి ఏ మాత్రం తెలియకుండా.. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులలో పడతారు. అలాగే విద్యార్థులు అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకడం మంచిది. 

మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు మీ మనసుకి నచ్చిన పని చేయడం మంచిది. ఎవరి కోసమో మీరు మీ వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ నిజాయతీ మాత్రమే.. మిమ్మల్ని విపత్కర పరిస్థితులలో కాపాడుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల గురించి ఆలోచించేటప్పుడు.. పెద్దల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.  

కర్కాటక రాశి (Cancer) –  ఈ రోజు మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులు రుణాలు ఇచ్చేటప్పుడు లేదా తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. 

సింహ రాశి (Leo) – ఈ రోజు మీరు అనుకోని ఇబ్బందులలో పడతారు. అయినా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. ప్రత్యర్థులు విసిరే సవాళ్లకు అసలు భయపడకండి.  వ్యాపారస్తులు భవిష్యత్ గురించి చింతించకుండా.. ప్రస్తుత పరిస్థితులను ఎలా చక్కదిద్దాలో ఆలోచించడం మంచిది. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు నిరుద్యోగులు పలు శుభవార్తలు వింటారు.  ఆలుమగలు తమ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడే అవకాశముంది. మహిళలు అపరిచితులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పలు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించవచ్చు.

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. ఆఫీసులో కూడా మంచి సామరస్య వాతావరణం ఉంటుంది. విద్యార్థులు ఇంకాస్త కష్టపడి చదవాలి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు.. కొన్ని విషయాలలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. 

వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు మీరు నిరాశావాదాన్ని వీడి ఆశావాదంతో పనిచేయాలి. అలాగే దైనందిన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. సానుకూల భావధోరణితోనే ముందుకు వెళ్లాలి. అలాగే  కొన్ని అనివార్య పరిస్థితులలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు మొదలైనవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధను రాశి (Saggitarius) - ఈ రోజు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు తమ భవిష్యత్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. విద్యార్థులు తాము ఏ రంగంలో రాణించాలని భావిస్తున్నారో.. ఆ రంగంపై ఒక స్పష్టత ఏర్పరచుకోవాలి.  అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  నిరుద్యోగులు తమ ప్రయత్నలోపం లేకుండా.. కొన్ని సార్లు సమయపాలన పాటించాలి. 

మకర రాశి (Capricorn) – ఈ రోజు మీరు కొన్ని విషయాలలో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. అలాగే అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. మీ ప్రత్యర్థులు కూడా మీకు స్నేహ హస్తం చాచే అవకాశం ఉంది. ఆఫీసులో మీ నిజాయతీయే మీకు కొన్ని సందర్భాలలో రక్షణ కవచంగా నిలుస్తుంది. మీ తల్లిదండ్రుల సలహాలు మీకు అప్పుడప్పుడు చాలా అవసరం. అలాగే ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ చూపించడం శ్రేయస్కరం. 

కుంభ రాశి (Aquarius) - ఈ రోజు మీరు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. మీ భావజాలాన్ని సమర్థించే కొత్త మిత్రులు మీకు ఏర్పడతారు. కొన్ని సార్లు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయినా భయపడవద్దు. మనో ధైర్యంతో ముందుకు వెళ్లండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అండగా నిలుస్తారు. ఆస్తి తగాదాలు, కోర్టు లావాదేవీలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. అలాగే ఆఫీసు పనిలో చాలా బిజీగా ఉంటారు. వ్యాపారస్తులు తమకు కొత్తదైన రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు.. అనుభవం గలవారి సలహాలు తీసుకోవడం మంచిది.  ప్రేమికులు కొన్ని విషయాలలో ఒకరితో ఒకరు.. నిజాయతీగా వ్యవహరించడం మంచిది. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.

ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.