ADVERTISEMENT
home / Food & Nightlife
హైదరబాదీ స్పెషల్ వంటకం.. ‘కిచిడి – ఖీమా’ తయారీ విధానం మీకోసం ..!

హైదరబాదీ స్పెషల్ వంటకం.. ‘కిచిడి – ఖీమా’ తయారీ విధానం మీకోసం ..!

హైదరబాదీ వంటకాల్లో స్పెషల్ వంటకం (Hyderabadi Special Dish) – కిచిడి. హైదరాబాద్ నగరంలో చాలామంది ఈ వంటకాన్ని అల్పాహారంగా తీసుకుంటుంటారు. మరి ముఖ్యంగా ఓల్డ్ సిటీలో అయితే కిచిడి – ఖీమా (Kichidi – Kheema), కిచిడి – కట్టా వంటి కాంబినేషన్స్ చాలా పాపులర్. అలాగే ఈ కిచిడి & ఖీమా కాంబినేషన్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. మరి ఈ వంటకం తయారీ విధానం (Recipe) గురించి తెలుసుకుందాం.

హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??

కిచిడి – ఖీమా తయారీకి కావాల్సిన వస్తువులు..

ముందుగా కిచిడి (Kichidi) కోసం

ADVERTISEMENT

* బియ్యం – 1/2 కిలో

* ఎర్ర కందిపప్పు – 1/2 గ్లాసు

* మంచి నూనె – 2 టేబుల్ స్పూన్స్

* జీలకర్ర

ADVERTISEMENT

* దాల్చిన చెక్క

* లవంగాలు

* ఇలాచి

* ఉల్లిగడ్డ – 1

ADVERTISEMENT

* పసుపు – 1 స్పూన్

* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్

* ఉప్పు – తగినంత

* పచ్చిమిర్చి – 5

ADVERTISEMENT

* కొత్తిమీర

* పుదీనా

కిచిడి తయారీ విధానం ఇలా –

కిచిడీ తయారీలో భాగంగా తొలుత 1/2 కిలో బియ్యం తీసుకోవాలి (అంటే దాదాపు నాలుగు గ్లాసులు). అలాగే ఒక అర కప్పు ఎర్ర కందిపప్పు కూడా తీసుకోవాలి. అయితే హైదరాబాది కిచిడిలో కేవలం ఎర్ర కందిపప్పు మాత్రమే వాడాలి. ముందుగా బియ్యాన్ని, పప్పును శుభ్రంగా కడిగి నీటిలో దాదాపు 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 

ADVERTISEMENT

ఆ తరువాత ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, అందులో అర టీ స్పూన్ల జీలకర్ర, 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు & 4 లవంగాలు కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి నూనెలో వేగుతుండగానే, అప్పటికే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలని ఇందులో వేసుకోవాలి.

ఆ తర్వాత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అలా వేయించిన మిశ్రమానికి 2 టీ స్పూన్ల అల్లం వెల్లులి పేస్ట్ కలిపి పక్కన  పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో అల్లం వెల్లులి పేస్ట్ బాగా కలిసిపోయిందని అనుకున్న తరువాత, 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ఆ తర్వాత ఈ తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.

ఇక ఇప్పుడు మనం బియ్యం ఎన్ని గ్లాసులు తీసుకుంటే.. అంతకు సరిసమానంగా మళ్లీ అన్నే గ్లాసుల్లో నీరు పోసుకోవాల్సి ఉంటుంది. మనం 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాము కాబట్టి.. 8 గ్లాసుల నీరు గిన్నెలో పోసుకోవాలి. అందులోకి అయిదు పచ్చిమిర్చీలు, కొత్తిమీర వేసుకోవాలి. అలా స్టవ్ పైన కొద్దిసేపు ఉంచిన తరువాత, నీరు బాగా ఉడుకుతున్న సమయంలో.. మనం  నానబెట్టుకున్న బియ్యం, పప్పు ఇందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి.

అలా కలుపుకున్న తరువాత, స్టవ్ సిమ్‌లో పెట్టుకుని గిన్నె పైన మూత పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తరువాత.. ఒక 5 నిమిషాల పాటు అన్నం బాగా ఉడకనివ్వాలి.  5 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే, మీ నోరూరే కిచిడి సిద్దమైనట్లే..

ADVERTISEMENT

కిచిడి సిద్ధమైపోయింది కదా.. మరి ఇక ఇందులోకి నంజుకోవడానికి రుచికరమైన ఖీమా సిద్ధం చేసుకుందాం.

హైదరాబాద్‌లో “సామాన్యుడి ఐస్ క్రీమ్” అంటే.. గుర్తొచ్చే పార్లర్ ఇదే..!

ఖీమా తయారీ కోసం కావాల్సిన వస్తువులు

* ఖీమా – 1/2 కిలో (చికెన్ లేదా మటన్)

ADVERTISEMENT

* మంచి నూనె – 4 టేబుల్ స్పూన్లు

* జీలకర్ర

* ఇలాచీ

* లవంగాలు

ADVERTISEMENT

* ఉల్లిగడ్డలు – పెద్దవి 2

* అల్లం వెల్లులి పేస్ట్ – 3 టీ స్పూన్స్

* పసుపు – 1 టీ స్పూన్

* కారం – 2 టీ స్పూన్లు

ADVERTISEMENT

* ఉప్పు తగినంత

* మెంతులు – 2 టీ స్పూన్లు

* గరం మసాలా – 1/2 టీ స్పూన్

* పచ్చిమిర్చి – 5

ADVERTISEMENT

* కొత్తిమీర

ఖీమా (kheema) తయారీ విధానం 

ప్రెషర్ కుక్కర్‌లో అయితే ఖీమాని సులభంగా చేసుకోవచ్చు. పైగా త్వరగా కూడా వంటకం ఉడుకుతుంది. అందుకే ముందుగా కుక్కర్ స్టవ్ పైన పెట్టి, నాలుగు టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత అందులోకి అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్న సమయంలోనే రెండు ఉల్లిగడ్డలని చిన్నగా కోసుకుని.. వాటిని ఇందులో వేసుకుని ఫ్రై చేయాలి.

ఈ మిశ్రమం బంగారు రంగులోకి ఫ్రై అయ్యాక, నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసిపోయిందని అనుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, రెండు టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకుని బాగా కలుపుకున్న తరువాత, ముందుగా శుభ్రంగా కడిగిపెట్టుకున్న అర కిలో ఖీమాని (చికెన్/మటన్) ఇందులో వేసుకోవాలి.

ADVERTISEMENT

ఖీమాని కుక్కర్‌లో ఉన్న మిశ్రమంతో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇక దాదాపు అయిదు నిమిషాల పాటు పెద్ద మంట పైన దీనిని ఉడకనివ్వాలి. ఆ తరువాత అరకప్పు గరం మసాలా వేసుకుని.. బాగా కలుపుకున్న కొద్దిసేపటికి ఒక అర కప్పు నీరు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వంటకాన్ని ఉడకనివ్వాలి.

ఇక నాలుగు విజిల్స్ తరువాత మూత తీసి చూస్తే.. ఖీమా బాగా ఉడికిపోయి ఉంటుంది. అందులోకి నాలుగు పచ్చిమిర్చిలతో పాటు కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని ఒక మూడు – నాలుగు నిమిషాల తరువాత స్టవ్ పై నుండి దించేస్తే సరిపోతుంది. దీనితో ఖీమా వంటకం పూర్తయినట్టే.

అలా కిచిడి ఖీమా సిద్ధం చేసుకున్నాక, ప్లేట్‌లో ఈ రెండింటిని వడ్డించుకుని రుచి చూస్తే వచ్చే ఆ మజానే వేరులే.. తెలిసిందిగా.. హైదరాబాదీ స్పెషల్ వంటకం కిచిడి – ఖీమా ఎలా చేయాలో మరి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ స్పెషల్ వంటకాన్ని సిద్ధం చేసుకుని రుచి చూడండి.

తెలంగాణ స్పెషల్ వంటకం – సర్వ పిండి ముచ్చట్లు మీకోసం..!

ADVERTISEMENT
08 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT