ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు తెలుసా?

సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీకు తెలుసా?

సెక్స్ (sex).. ఆనందతీరాల్లో ముంచేసే ఓ అద్భుతమైన ఫీలింగ్.. అయితే జీవితంలో ఏది ఎక్కువైనా నష్టమే.. అది సెక్స్ విషయంలోనూ వర్తిస్తుంది. జీవితంలో ఏదైనా మరీ తక్కువ లేదా మరీ ఎక్కువ కాకుండా మధ్యస్థంగా ఉండాలి. సెక్స్ కూడా మరీ ఎక్కువ కాకుండా చూసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ (side effects)రాకుండా చూసుకోవచ్చు. సెక్స్ లో తరచూ పాల్గొనకపోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఆశ్చర్యంగా అనిపించినా సరే.. సెక్స్ లో ఎక్కువగా పాల్గొనడం లేదా తక్కువగా పాల్గొనడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో కొన్ని మనల్ని సంతోషపరిచేవి.. మరికొన్ని ఇబ్బంది పెట్టేవి.. అవేంటో తెలుసుకుందాం రండి..

1. ఇంకా కావాలనిపిస్తుంది.

అవును.. ఇది కచ్చితంగా సెక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సెక్స్ ఇద్దరు వ్యక్తులను దగ్గర చేయడంతో పాటు ఇద్దరినీ ఆనందంలో ముంచెత్తుతుంది. సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎండార్ఫిన్లు అనే ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల చాలా ఆనందం మన సొంతం అవుతుంది. అందుకే సెక్స్ లో పాల్గొన్న తర్వాత చాలా ఆనందంగా ఫీలవుతాం. అందుకే దాని తర్వాత మరింత ఎక్కువగా సెక్స్ లో పాల్గొనాలనిపిస్తుంది. ఇది ఎంత ఎక్కువగా చేస్తే అంత కోరిక పెరుగుతుంది.

2. వెంటనే నిద్ర పట్టేస్తుంది.

సెక్స్ లో పాల్గొనడం అంటే మన శరీరంలోని ఎన్నో కండరాలు, కీళ్లకు వ్యాయామం అందించినట్లు.. ఒకేసారి ఎన్నో భంగిమల్లో ఎన్నో రకాలుగా కదలికలు చేయడం కేవలం సెక్స్ లో మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాదు.. సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అందుకే అటు వ్యాయామం, ఇటు ఒత్తిడి నుంచి రిలీఫ్ రెండూ ఒకేసారి రావడం వల్ల సెక్స్ పూర్తి కాగానే సునాయాసంగా నిద్ర పట్టేస్తుంది.

ADVERTISEMENT

3. గ్యాస్ సమస్య

క్వీఫ్.. సెక్స్ సమయంలో మన యోని నుంచి వచ్చే గాలి వల్ల వచ్చే శబ్దం ఇది. ఇది సెక్స్ లో ఎక్కువగా పాల్గొనేవారిలో చాలా సహజంగా జరుగుతుంది. అయితే గాలి బయటకు వస్తున్నప్పుడు ఆ శబ్దం కాస్త ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయితే దీని వల్ల సిగ్గు పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా అలవాటైతే చాలు.. ఆ శబ్దాలు మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.

4. నొప్పి ఎక్కువగా ఉండొచ్చు.

మొదటి సారి సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు మాత్రమే కాదు.. సెక్స్ లో అరుదుగా పాల్గొనేవారికి కూడా నొప్పి ఎదురవుతుంది. అరుదుగా పాల్గొనడం వల్ల యోని కండరాలు బిగుసుకు పోయినట్లుగా అయిపోయి సెక్స్ కి అది సహకరించకపోవడం వల్ల నొప్పి ఎదురు కావచ్చు. మన యోని, దాని చుట్టూ ఉన్న భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. దాని నుంచి డిశ్చార్జ్ కావాలంటే సెక్స్ కి ముందు కాస్త ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేస్తూ మూడ్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఫోర్ ప్లే వల్ల సెక్స్ చాలా సౌకర్యంగా మారుతుంది.

ADVERTISEMENT

5. ఎక్కువ డిశ్చార్జ్

సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే కాదు.. మామూలు సమయంలోనూ కొందరికి మూడ్ రాగానే యోని నుంచి ద్రవాలు కారుతూ ఉంటాయి. ఇది సెక్స్ వల్ల ఓ సైడ్ ఎఫెక్ట్ అయినా ఇది మీకు సెక్స్ లో సహకారం అందిస్తుంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ. దీని గురించి సిగ్గు పడాల్సిన అవసరం లేదు. సెక్స్ లో పాల్గొనడం వల్ల ఆనందం మన సొంతమవుతుంది. కానీ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను భరించాల్సి రావచ్చు.

6. మధ్యలోనే ఆసక్తి పోవడం

ఇది కేవలం అమ్మాయిల విషయంలోనే కాదు.. అబ్బాయిల విషయంలోనూ జరుగుతుంది. దీనికి ఇది కారణం అని చెప్పలేం. మన మెదడు అన్నింటి కంటే చంచలమైనది. అది ఒకసారి ఒకదాని గురించి ఆలోచించదు. కాసేపట్లోనే వేరే అంశం గురించి ఆలోచిస్తుంది. సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు మన మనసులోకి వస్తాయి. ఇవి ఇబ్బంది పెట్టే ఆలోచనలైతే సెక్స్ పై ఆసక్తి కూడా పోతుంది. మరో కారణం మీరు అలసిపోవడం కూడా కావచ్చు. దానివల్ల కూడా మధ్యలోనే ఆసక్తి పోతుంది. మన శరీరానికి కూడా విశ్రాంతి కావాలి. దాన్ని గుర్తిస్తే ఇలా జరగకుండా ఉంటుంది.

7. యూటీఐ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్టన్లు సెక్స్ లో పాల్గొనడం వల్ల కూడా రావచ్చు. ఇది ఎవరికైనా జరగవచ్చు. ఇది పెద్ద సమస్య కూడా కాదు. అందుకే మీరు సెక్స్ లో యాక్టివ్ గా ఉంటే మీకు యూటీఐ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవి రాకుండా చూసుకునేందుకు సెక్స్ కి ముందు, తర్వాత మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. యోని భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఎక్కువ నీళ్లు తాగడం వంటివి చేయడం వల్ల యూటీఐ నుంచి దూరంగా ఉండొచ్చు.

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

04 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT