ADVERTISEMENT
home / Food & Nightlife
శీతాకాలం స్పెషల్ వంటకం..   సీతాఫల్ ఖీర్ తయారీ మీకు తెలుసా?

శీతాకాలం స్పెషల్ వంటకం.. సీతాఫల్ ఖీర్ తయారీ మీకు తెలుసా?

శీతాకాలం (winter season) వచ్చిందంటే చాలా త్వరగా చీకటి పడిపోవడం & బయటకి వెళదామంటే కూడా విపరీతమైన చలి ఉంటుండడంతో.. ఎక్కడికి కూడా వెళ్లాలన్నా కాస్త ఇబ్బందిగా అనిపించడం సహజం. అయితే ఈ సీజన్ లో మనకు దొరికే అద్భుతమైన సీతాఫలాల కోసం అయినా శీతా కాలం గురించి ఎంతో వేచి చూస్తుంటారు చాలామంది. మరి, ఎప్పుడూ మామూలుగా తినడమేనా? దీంతో ఏదైనా రెసిపీ చేసుకొని తింటే బాగుంటుంది కదా.. అని అనుకునే వారు ఈ సీతాఫల్ ఖీర్ గురించి తెలుసుకోవాల్సిందే.

స్పెషల్ అరేబియన్ స్వీట్ కునాఫ తయారు చేసుకునే విధానం ఇదే

ఏ కాలంలో దొరికే పండ్లని ఆ కాలంలో తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకనే శీతా కాలంలో విరివిగా లభించే సీతాఫలం (custard apple) తప్పకుండా తినాలి. అయితే దీన్ని కొంతమంది మాత్రం సీతాఫలాన్ని నేరుగా తినేందుకు అంతగా ఇష్టపడరు. ఇంకొంతమందేమో ఈ పండ్లన్నీ చెట్టు నుంచి కోసిన ఒకటి లేదా రెండు రోజులకు అన్నీ ఒకేసారి పండిపోతాయి కాబట్టి వీటితో ఏం చేయాలా? అని ఆలోచిస్తుంటారు.  అటువంటి వారికోసం.. సీతాఫలంని ఉపయోగించే చేసే రకరకాలైన వంటకాలని ఇష్టపడేవారికి ఈ సీతాఫల్ ఖీర్ (custard apple kheer) చాలా బాగా నచ్చుతుంది. 

ముందుగా సీతాఫల్ ఖీర్ తయారికి (custard apple recipe) కావాల్సిన పదార్ధాలు

ADVERTISEMENT

* 2 సీతాఫలం పండ్లు

* బాదం పప్పు

* జీడి పప్పు

* కిస్మిస్

ADVERTISEMENT

* 2 కప్పుల పాలు

* 1 కప్పు సీతాఫలం గుజ్జు

* పావు కప్పు కోవా

* యాలకుల పొడి

ADVERTISEMENT

* 3 స్పూన్ తేనె (తీపి తక్కువగా అనిపిస్తే)

ఈ పైన చెప్పిన పదార్ధాలు మీ దగ్గర ఉంటే, రుచికరమైన సీతాఫల్ ఖీర్ మీరు సులభంగా చేసుకోవచ్చు.

హైదరాబాద్ వెళ్తున్నారా… అయితే తప్పకుండా ఈ అనోఖి ఖీర్ టేస్ట్ చేయండి..!

ఇక ఇప్పుడు సీతాఫల్ ఖీర్ ఎలా చేయాలో తెలుసుకుందాం…

ADVERTISEMENT

ముందుగా 1 పెద్ద టీ స్పూన్ తో తీసుకున్న బాదం పప్పు, జీడి పప్పు ని సన్నగా తురుముకుని ఒక ప్యాన్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటికి తోడుగా 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసి ఈ మూడింటి రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని ఫ్రై చేసుకునే సమయంలో కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ లేదా కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు.

ఇక అలా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్న ప్యాన్ లోనే రెండు లీటర్ల పాలు పోసుకోవాలి. ఇక ఆ పాలని బాగా మరిగించాల్సి ఉంటుంది, ఎంతవరకు అంటే 2 లీటర్ల పాలు దాదాపు ఒకటిన్నర లీటర్ల వరకు వచ్చేవరకు.. ఆ తరువాత అందులోనే మనం రెండు సీతాఫలం పండ్ల గుజ్జుని (గింజలు గుజ్జు నుండి వేరు చేసేయాలి) వేసుకోవాల్సి ఉంటుంది.

అలా వేసిన గుజ్జుని పాలలో బాగా కలిసిపోయేలా మనం ఒక గరిటతో తిప్పుతూ ఉండాలి. గుజ్జు కలిసింది అని అనిపించగానే వెంటనే ఒక పావు కప్పు కోవా ని కూడా అందులో వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కోవాని కూడా ఆ పాలలో బాగా కలిసిపోయే వరకు కలుపుకుని స్టవ్ ని ఆఫ్ చేసెయ్యాలి.

ఇక స్టవ్ పై నుండి దించిన మిశ్రమం రుచి చూసి, అది మీకు కావాల్సినంత తీపిగా ఉంటే సరే సరి.. అలా కాకుండా కాస్త తీపి తక్కువగా ఉంటే, మూడు స్పూన్ల తేనెని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆ తేనె పూర్తిగా కలిసిపోయే వరకు కలుపుకుని, ఈ సీతాఫల్ ఖీర్ ని రెండు నుండి మూడు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లబరచాలి.

ADVERTISEMENT

అలా చల్లబడిన దానిని మీకుటుంబసభ్యులతో కలిసి హాయిగా సీతాఫల్ ఖీర్ ని హాయిగా ఆరగించండి. తెలుసుకున్నారుగా.. చాలా సులభమైన & రుచికరమైన సీతాఫల్ ఖీర్ ఎలా చెయ్యాలో (recipe) అని.. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ కుటుంబ సభ్యులకు కూడా దీని రుచి చూపించండి. 

హైదరాబాద్ ఖీమా లుక్మీ గురించి మీకు తెలుసా??

05 Nov 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT