5 Best Tips to make this New Year so special for your Partner
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం కావడానికి.. ఇంకొద్ది రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఈ తరుణంలో మీ లైఫ్ పార్టనర్‌కి కొత్త సంవత్సరం వేళ.. కొత్త సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారా? అయితే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించేయండి. తద్వారా మీ జీవిత భాగస్వామి జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులను అందివ్వండి
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌కి వెళ్లాల్సిందే..!
* ట్రిప్ ప్లాన్ చేయండి (Surprise Trip)
మన దైనందిన జీవితమంతా ఉరుకుల పరుగుల మధ్యే సాగుతోంది. ఈ క్రమంలో మనకి తెలియకుండానే యాంత్రికంగా మారిపోతుంటాం. ఇలాంటి తరుణంలో న్యూ ఇయర్ సందర్భంగా.. మీ భాగస్వామికి ఏదైనా సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారా..? అయితే ఏదైనా ఓ రొమాంటిక్ ప్రదేశానికి షార్ట్ ట్రిప్ ప్లాన్ చేయండి. మీ భాగస్వామిని అలాంటి చోటుకి తీసుకువెళ్లడం వల్ల.. ఆమెకి రోజువారీ కార్యక్రమాల నుండి కాస్త విరామం కలిగించిన వారవుతారు. అలాగే తన మనసును కూడా దోచుకుంటారు.
* థీమ్ రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళండి (Theme Restaurant)
పండగ రోజు కూడా పచ్చడి మెతుకులేనా.. అనే సామెతని మీరు వినేవుంటారు కదా! అందుకే.. చక్కగా న్యూ ఇయర్ రోజున కూడా ఇంటిలో రిలాక్స్ అవ్వకుండా.. కాస్త డిఫరెంట్‌గా ఆలోచించండి. వంటావార్పు అంటూ మీ లైఫ్ పార్టనర్‌ను కష్టపెట్టకుండా… తనను ఓ మంచి థీమ్ రెస్టారెంట్‌కి తీసుకువెళ్ళండి. అక్కడ తనకి నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వడం లేదా మరేదైనా కొత్త డిషెస్ ఆర్డర్ చేసి కొసరి కొసరి తినిపించండి. అప్పుడే తన మనసును గెలుచుకోగలరు.
* డిజైనర్ డ్రెస్ (Designer Dress)
సందర్భం ఏదైనా సరే.. ఒక కొత్త డ్రెస్ లేదా చీర కచ్చితంగా.. మీ ప్రియమైన వ్యక్తిలో ఆనందాన్ని నింపుతుంది. అలాంటిది మీరు న్యూ ఇయర్ సందర్భంగా ఓ డిజైనర్ డ్రెస్‌ను.. మీ పార్టనర్‌కి బహుమతిగా ఇస్తే చాలు.. తన ఆనందానికి హద్దులే ఉండవు. ఎందుకంటే డిజైనర్ డ్రెస్ అంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి.
హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం
* జ్యూవెలరీ (Jewellery)
మీ ప్రియమైన వారి మనసును గెలుచుకోవడానికి ఇదో సులువైన మార్గం. ఎక్కువమందికి జ్యూవెలరీ అంటే ఎంతో మక్కువ. అదే మక్కువ మీ లైఫ్ పార్టనర్‌కి కూడా ఉంటే… ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా.. వెంటనే వారికి నచ్చే ఒక జ్యూవెలరీ సెట్‌ని బహుమతిగా ఇవ్వండి. వారు మీకు కచ్చితంగా ఫిదా అవుతారు.
* టైం ఇవ్వండి (Valuable Time)
ఒక బంధం బలపడాలన్నా లేదా ఇరువురి మధ్య ప్రేమానుబంధాలు వెల్లివిరియాలన్నా … దానికి ముఖ్యంగా కావాల్సింది ఒకరితో మరొకరు సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడం. ఎన్ని బహుమతులు ఇచ్చినా.. దీనిని మించిన విలువైన బహుమతి మరొకటి ఉండదు. ఎందుకంటే ‘న్యూ ఇయర్’ లాంటి రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సమయంలో.. తమ లైఫ్ పార్టనర్ పక్కనే ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకే బయట ఎన్ని పార్టీలకు, ఫంక్షన్లకు హాజరైనా.. మీ భాగస్వామికి ఇవ్వాల్సిన సమయాన్ని మాత్రం కచ్చితంగా ఇచ్చేయండి.
ఈసారికి ఈ టిప్స్ పాటించేయండి చాలు.. ఈ న్యూ ఇయర్ మీ భాగస్వామిని కచ్చితంగా ‘దిల్ ఖుష్’ చేసేస్తుంది.
‘చెన్నై’లో క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్‌గా.. అందరిని ఆకర్షిస్తున్న ‘ఇళయరాజా’ కేక్
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.