28 డిసెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

28 డిసెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (28 డిసెంబరు) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారదశకు వస్తాయి. అలాగే భాగస్వామి నుండి అనుకోని కానుకలు పొందుతారు. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మహిళలు అపరిచితుల విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. 

వృషభం (Tarus) – ఈ రోజు మీరు ఆఫీసులో పని ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. వ్యాపారంలో హెచ్చుతగ్గుల పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపించే అవకాశం ఉంది

మిథునం (Gemini) –  ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే వివాహితులకు సులభ ధనయోగం  ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త కెరీర్ వైపు బాటలు వేస్తారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.  పోటీ పరీక్షలలో విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఆఫీసులో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా వివాదాల జోలికి పోవద్దు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు.. శక్తివంచన లేకుండా చదవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఏజెంట్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి.

సెల్ఫీలకు.. రాశి ఫలాలకూ ఉన్న లింక్ ఏమిటో తెలుసా.. ?

సింహం (Leo) –  ఈ రోజు మీరు అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. మీ నిజాయతీ మాత్రమే మీకు శ్రీరామరక్ష. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తి చూపిస్తారు. కొన్ని విషయాలలో మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది.

క‌న్య (Virgo) –  ఈ రోజు ప్రేమికులకు శుభదినం. తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే వివాహితులు తమ మనసులోని భావాలను తమ భాగస్వామితో పంచుకోండి. విద్యార్థులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. 

ఈ కథనం కూడా చదవండి: ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట 

తుల (Libra) – ఈ రోజు విద్యార్థులు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు తమ కొత్త ఆలోచనలు, ఐడియాలను అధికారులకు చెప్పే అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులు నూతన భాగస్వాములతో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. అయితే ఆర్థిక విషయాలలో ఆచితూచి అడుగులు వేయాలి.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపాన్ని నియంత్రించుకొని.. కొన్ని సందర్బాల్లో సంయమనంతో మెలగండి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో నూతన బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించండి.  ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా బదిలీలు సంభవించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి.. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం బెటర్. 

మకరం (Capricorn) – ఈ రోజు మీ కుటుంబ సమస్యలు అన్నీ పరిష్కార దశకు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులు పని ఒత్తిడిలో పడి.. భాగస్వామికి సమయం కేటాయించడం మరిచిపోవద్దు. సృజనాత్మక, మార్కెటింగ్, సినిమా రంగాల్లోని వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది.

కుంభం (Aquarius) – ఈ రోజు మీరు నిర్లక్ష్యాన్ని వీడాలి. అప్పుడే పనులు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులు తమ ప్రణాళికలను నిజాయతీగా అనుసరించడం మేలు. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. 

మీనం (Pisces) – ఈ రోజు కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కొత్త ఇల్లు కొనాలనే మీ కల పూర్తవుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజంతా లాభసాటిగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా బదిలీలు సంభవించే అవకాశముంది. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాలి. 

ఈ కథనాన్ని కూడా చదివేయండి: ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.