ఈ రోజు (30 డిసెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అంతా మంచే జరుగుతుంది. ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినా.. ఆ తర్వాత కలిసిపోతారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మహిళలు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు వివేకంగా ఆలోచించాలి.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అలాగే ఉద్యోగస్తులకు బదిలీలు సంభవించే అవకాశముంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది.
మిథున రాశి (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే ఉద్యోగస్తులు ప్రత్యర్థుల నుండి సవాళ్లను ఎదుర్కొంటారు. ఆలుమగలు దూర ప్రయాణాలు చేస్తారు. వివాహితులు పలు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది.
సింహ రాశి (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇలాంటి సందర్భంలోనే ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. మీ నిజాయతీయే మీకు శ్రీరామరక్ష. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఆలుమగలు కొన్ని విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. ప్రేమికులు ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించాలి. అప్పుడే మీ బంధం మరింత పటిష్టమవుతుంది.
తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. ఆఫీసులో మీ ప్రవర్తన కొందరికి బాధ కలిగించవచ్చు. అలాగే కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అలాగే వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలు షాపింగ్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధను రాశి (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కళలు లేదా క్రీడల పట్ల ఆసక్తిని చూపిస్తారు. అలాగే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రేమికులు కొన్ని విపత్కర పరిస్థితుల నుండి బయటపడతారు.
మకర రాశి (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకొనే ముందే.. కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలను వింటారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని విషయాలలో భావోద్వేగానికి గురవుతారు. అలాగే ఊహించని పరిణామాలను చవిచూస్తారు. అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు ఆసక్తి చూపించే అవకాశముంది. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడతారు.
మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని అనుకోని వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు తమ నిర్లక్ష్యం కారణంగా.. ముఖ్యమైన అవకాశాలను కోల్పోతారు. సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.
ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.