31 డిసెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

31 డిసెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (31 డిసెంబరు 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫ‌లాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) - ఈ రోజు వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభం (Tarus) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి. ఆలుమగల సంబంధాలు  పటిష్టంగా మారతాయి.  అలాగే వాహనాల నిర్వహణపై శ్రద్ధ వహించండి.

మిథునం (Gemini) -  ఈ రోజు మీ దీర్ఘకాలిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా మీరు విరివిగా పాల్గొంటారు. విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది. 

కర్కాటకం (Cancer) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఇంకాస్త కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది.  వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

సింహం (Leo) - ఈ రోజు  ఈ రాశి వ్యక్తులు అనుకోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే  ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాల్సిన అవసరం ఉంది. అప్పుడే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.

క‌న్య (Virgo) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తారు.  ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు. అలాగే పాత స్నేహితులను కలుస్తారు. అయితే కొన్ని వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అదేవిధంగా సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు  ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

తుల (Libra) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే తమ జీవిత భాగస్వామితో కలిసి అందమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులను వేగంగానే పూర్తి చేస్తారు. అలాగే ఈ  రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పాత మిత్రులను కలుస్తారు. అలాగే విద్యార్థులు లేదా నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాహితులు కొన్ని విషయాలలో తమ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. అలాగే మీ భాగస్వామితో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆహార నియమాలు పాటించే విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసు వాతావరణం  అనుకూలంగా ఉంటుంది. అయితే.. అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

మకరం (Capricorn) - ఈ రోజు మీరు కొన్ని చిత్రమైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఆర్థికంగా కూడా మీరు కొంత నష్టానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అయితే రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. 

కుంభం (Aquarius) - ఈ రోజు ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మీకు మీరే పరిష్కరించుకోవడం మంచిది. అలాగే మీ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సరైన సమయం. ఇక అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. 

మీనం (Pisces) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత అసహనానికి గురవుతారు. ఇలాంటి సమయాలలోనే కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఉద్యోగస్తులకు బదిలీలు సంభవించే అవకాశముంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగాలలో చేరతారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది.


ఇక ఇంగ్లీష్హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.