'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' : ఎందుకో తెలుసా..?

'డిసెంబరు' నెలలో పుట్టిన వ్యక్తులు.. నిజంగానే చాలా 'ప్రత్యేకం' :  ఎందుకో తెలుసా..?

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. పుట్టిన తేది, నెల, సంవత్సరాన్ని బట్టి వ్యక్తుల గుణగణాలు నిర్ణయించబడతాయని అంటారు. అలాగే పుట్టిన సమయం, తిధిని బట్టి కూడా.. ఆయా వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయచ్చని ప్రతీతి. నిజానికి, డిసెంబరులో జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారట. అలాగే బాగా కష్టపడి పనిచేస్తారు. కానీ మతిమరుపు వల్ల.. అప్పుడప్పుడు వీరు చిక్కులలో పడతారట. 

మీ బంధువులు, స్నేహితులలో ఎవరైనా డిసెంబరులో (December) జన్మించినట్లయితే, ఈ క్రింది పాయింట్ల ఆధారంగా వారి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు


1- డిసెంబరులో జన్మించిన వ్యక్తులు పుట్టు మేధావులు. అలాగే అత్యద్భుత ప్రతిభ కలిగి ఉంటారని ప్రతీతి. అందుకే వీరి స్వభావం కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. 


2- అలాగే ఈ  నెలలో జన్మించిన వారు ఎప్పుడూ యంగ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తారట. అదేవిధంగా క్రియేటివ్ ఆలోచనలకు పెద్దపీట వేస్తారు. ఈ క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడరట. 


3- డిసెంబరు నెలలో పుట్టిన వ్యక్తులకు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయట. అందుకే రాజకీయ రంగం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు.  అలాగే సినిమా రంగం అంటే అమితమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి


4- కొన్ని సందర్భాలలో ఈ వ్యక్తులు తమని తాము చాలా శక్తిమంతులుగా అంచనా వేసుకుంటారు. ఈ క్రమంలో కొందరు వీరి పట్ల ద్వేషాన్ని పెంచుకుంటారు. 


5- డిసెంబరు నెలలో పుట్టిన బాలికలు నిజంగానే ఆశాకిరణాలు. ఒక రకంగా చెప్పాలంటే మట్టిలో మాణిక్యాలు. కానీ ఆశావాదులు.  సానుకూల వైఖరితో జీవితాన్ని చూడటానికి ఇష్టపడతారు. కోపానికి ఆమడదూరంలో ఉంటారు. కానీ నిజంగానే కోపం వస్తే మాత్రం.. వీరిని తట్టుకోవడం చాలా కష్టం.  కానీ స్నేహానికి ప్రాణమిస్తారు. ఆదర్శ గృహిణిగా భర్త అభిమానాన్ని పొందుతారు. అలాగే  ఎవరిపైనా ఆధారపడి జీవించేందుకు ఇష్టపడరు. 


6- ఇక డిసెంబరు నెలలో పుట్టిన అబ్బాయిలకు సరదా పనులు చేయడం అంటే చాలా ఇష్టం. ఈ వ్యక్తులు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతారు. మీరు ఈ వ్యక్తులతో ఉంటే, ఎప్పటికీ విసుగు చెందరు. అయితే వీరి భిన్నమైన పద్ధతి.. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం


7- ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఒకవేళ ప్రేమలో పడితే.. ఆ భావనను ఎదుటి మనిషికి చెప్పడానికి ఇష్టపడరు.  కానీ తమ ప్రవర్తనతో ఇతరులకు కచ్చితంగా అనుమానాన్ని కలిగిస్తారు. అయితే వీరిది నిజాయతీతో కూడిన ప్రేమని కచ్చితంగా చెప్పవచ్చు.


8- కొంతవరకు, ఈ వ్యక్తులు  మొండి పట్టుదల కలిగి ఉంటారు. కానీ తమ ఆలోచనలను ఎదుటివారి మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించరు.  ఈ క్రమంలో ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు కలిగితే.. వారితో సాధ్యమైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. 

పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవాలంటే ఏం చేయాలి?


9- అలాగే వీరు స్వేచ్ఛా జీవులు. చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. కానీ ఎవరైనా నియంత్రించడానికి ప్రయత్నిస్తే.. మాత్రం ఒప్పుకోరు. వీరికి స్వాభిమానం చాలా ఎక్కువ.


10- అలాగే ఎక్కువశాతం బిజీగా గడపడానికే ప్రయత్నిస్తారు. పుస్తకాలు చదవడం లేదా గేమ్స్ ఆడడం లేదా దూర ప్రయాణాలు చేయడం వీరికి చాలా ఇష్టం. మీకో విషయం తెలుసా.. దగ్గుబాటి రానా, రజనీకాంత్, తమన్నా, వెంకటేష్, రెజీనా కాసెండ్రా, నగ్మా, జయసుధ.. మొదలైన సినీ నటులంతా డిసెంబరులోనే పుట్టారంట.


అదృష్ట సంఖ్యలు - 6,16,23,60 మరియు 81


అదృష్ట రంగులు - పసుపు, గులాబీ రంగు


అదృష్ట దినాలు - గురువారం, మంగళవారం


అదృష్ట రత్నం - పుష్పరాగము