Birthday Special : "సిల్క్".. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది

Birthday Special : "సిల్క్".. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది

Interesting Facts about South Indian Actress - Silk Smitha

"ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్" .. "డర్టీ పిక్చర్" సినిమాలో కథానాయిక తనకు జీవితంలో కావాల్సిన మూడు ప్రధాన విషయాలను గురించి చెబుతూ పలికే డైలాగ్ అది. అవును.. సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం కోసం.. తమను తాము వెండితెరపై చూసుకొని ఎనలేని ఆనందాన్ని పొందడం కోసం.. అంతకు మించి డబ్బు సంపాదించడం కోసం ఎక్కడినుంచో తారలు దిగి వచ్చేస్తుంటారు. కొందరు సక్సెస్ అవుతుంటారు.. కొందరు ఫెయిల్ అవుతుంటారు.. మరికొందరు కొన్ని కపట నాటకాలకు.. రాజకీయాలకు బలైపోతుంటారు. సినీ పరిశ్రమలో అలాంటి తారల కన్నీటి కథలెన్నో. 

సిల్క్.. ఆ పదంలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఏలూరుకి చెందిన ఓ తెలుగమ్మాయి తొలిసారి సినిమా అవకాశం వచ్చాక.. ట్రైన్ ఎక్కి మద్రాసుకొచ్చింది. విజయలక్ష్మి ఆమె అసలు పేరు. కానీ ఇండస్ట్రీ ఆమె పేరును "స్మిత"గా మార్చింది". అదే స్మిత.. తర్వాత సిల్క్ స్మితగా తారాలోకంలో విహరించింది. హీరోయిన్ అవకాశాల కోసం వచ్చినా.. తర్వాత వ్యాంప్ పాత్రలకే పరిమితమైంది. ఆ పాత్రలు చేస్తూనే హీరో, హీరోయిన్లతో సరి సమానంగా పారితోషికాలూ తీసుకుంది. అంతకు మించిన పాపులారిటినీ కూడా కైవసం చేసుకుంది. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన అభిమాన గణాన్ని సంపాదించుకుంది. 

ఈ అందాల నాయిక‌ల‌ హెయిర్‌స్టైల్స్‌తో.. మీరూ హీరోయిన్‌లా మెర‌వండి..!

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 200 పైగా చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత.. బండి చక్రం అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. సీతాకోక చిలుక, వసంత కోకిల లాంటి చిత్రాలలో తన నటనతో.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె రాణించే అవకాశం ఉన్నా.. సాఫ్ట్ పోర్న్ రోల్స్‌తో పాటు డ్యాన్సర్‌గా, వ్యాంప్‌గా మాత్రమే ఆమె ఎక్కువ సినిమాలలో కనిపించింది. తర్వాత ఆమె ప్రేమలో పడిందని కూడా వార్తలు వచ్చాయి. ఒక నటిగా తను సంపాదించిన డబ్బును.. నిర్మాతగా కొన్ని సినిమాలలో పెట్టుబడిగా పెట్టి.. ఆర్థికంగా కూడా నష్టపోయింది అంటారు. ఈ కారణాలే ఆమెను మానసికంగానూ కుంగదీశాయని అంటారు. 

తండ్రీ, కొడుకులతో.. ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరోయిన్స్ వీరే..!

 

 

 

ఆ తర్వాత ఒకవైపు సినిమాలు చేస్తూనే.. తన ఆర్థిక నష్టాలను పూడ్చుకోవాలని భావించిన స్మిత.. ఎందుకో కొన్నాళ్లు ్గగ్యాప్ కూడా తీసుకుంది. ఆ సమయంలోనే మద్యపానం బాగా అలవాటైంది. సెప్టెంబరు 23, 1996 తేదిన ఆమె తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించింది. ఆమె మరణానికి గల కారణాన్ని ఒకొక్కరూ ఒక్కో రకంగా చెబుతుంటారు. ఏదేమైనా.. ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్ అనుభవించిన తార అర్థాంతరంగా కేవలం 36 ఏళ్ల వయసులో మరణించడం విషాదకరమే. ఆమె మరణం ఇప్పటికీ పోలీస్ రికార్డులలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 

అందాల నాయిక.. అభినయ దీపిక (టాలీవుడ్ తార త్రిష బర్త్‌డే స్పెషల్)

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 2011లో బాలీవుడ్‌లో "ది డర్టీ పిక్చర్" అనే చిత్రాన్ని తీశారు నిర్మాత ఏక్తా కపూర్. విద్యా బాలన్ ఈ చిత్రంలో స్మిత పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు విద్యా బాలన్. ది డర్టీ పిక్చర్ చిత్రంలో సిల్క్ పాత్రకు భిన్న కోణాలు ఉంటాయి.  కేవలం సిల్క్ స్మిత జీవితం ఆధారంగానే ఈ సినిమాను తీశామని చెప్పలేమని.. అర్థాంతరంగా తమ జీవితాలను ముగించిన తారల వ్యధాభరిత కథలను విని వాటిని ప్రేరణగా తీసుకొని.. ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ఆ చిత్ర దర్శకుడు మిలన్ లుత్రియా పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.