January 1 .. ఈ రోజుతో కొత్త సంవత్సరం (New Year) ప్రారంభమైపోతుంది. కానీ ఈ రోజు కూడా సెలవు మంజూరు చేయకుండా.. పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తే ఏం చేస్తారు..? మనసులో తిట్టుకుంటారు కదా.
సంవత్సరమంతా కంపెనీ కోసం అహర్నిశలు పని చేశాక కూడా.. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో కలిసి స్పెషల్ పార్టీ లేదా డిన్నర్ ప్లాన్ చేద్దామనుకుంటే.. ఏంటీ టార్చర్ అని ఫీల్ అవుతారు కదా..? ఇది సాధారణంగా జరిగే విషయమే.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌కి వెళ్లాల్సిందే..!
ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే వారిని మినహాయిస్తే.. ప్రయివేట్ రంగంలో పనిచేసే చాలామందికి జనవరి 1 తేదిన సెలవు ఉండదు. అలాంటి జాబితాలో మీరున్నారా..?
ఇలాంటి సందర్భాలలో.. మీ బంధువులకి, స్నేహితులకి ఆరోజు సెలవు (Holiday) ఉండి.. మీకు లేకపోతే.. మీ మనసులో ఎటువంటి భావనలు (Feelings) కలుగుతాయి?
అలాంటి సందర్భాలు కొన్ని..
ముందుగా మీ భాగస్వామికి సెలవు ఉండి.. మీకు లేకపోతే…
న్యూ ఇయర్ వేళ.. మీరు, మీ లైఫ్ పార్టనర్ కలిసి ఏదైనా లంచ్‌కి లేదా సినిమాకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు తప్పకుండా ఆఫీస్‌కు రావాల్సిందేనని కాల్ వస్తే ఏం చేస్తారు? అన్నింటి కన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. మీ భాగస్వామికి సెలవు మంజూరు చేసినా.. మీకు సెలవు దొరక్కపోతే..? మీరు ప్లాన్స్ అన్నీ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది కదా. అలాగే మీ భాగస్వామి మూడ్ కూడా పాడవుతుంది. మీ బాస్ పట్ల కూడా మీకు కోపం కట్టలు తెంచుకుంటుంది.
మీ ఫ్యామిలీ అంతా ఒక చోట.. గెట్ టుగెదర్ ప్లాన్ చేసినప్పుడు…
న్యూ ఇయర్ సందర్భంగా మీ బంధువులంతా కలిసి ఒక చోట కలవాలని నిర్ణయించుకోవచ్చు. అందుకోసం ‘గెట్ టుగెదర్’ లాంటిదేదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో వారం రోజుల ముందే ప్లాన్ రెడీ కూడా చేసుకోవచ్చు. కానీ ఇంత ప్లాన్ చేసుకున్నాక కూడా.. జనవరి 1 తేదిన సెలవు రద్దు చేశామని ప్రకటిస్తే ఫీలవ్వరూ మరి. మీరు సరదాగా మీ కుటుంబసభ్యులతో గడపాలనుకున్న క్షణాలు కళ్ళ ముందే కరిగిపోతుంటే చాలా బాధపడతారు కదా. ఆ సమయంలో సెలవుని రద్దు చేసే నిర్ణయం తీసుకున్నవారిని మనస్ఫూర్తిగా తిట్టుకుంటారు. అలా తిట్టుకోవడం కూడా మీకు అసలు తప్పే అనిపించదు.
హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం
మీ ఆఫీస్ సహచరులతో కలిసి.. రోడ్ ట్రిప్‌కి ప్లాన్ చేసినప్పుడు
ప్రతిరోజు ఆఫీస్‌లో మనం మన సహచరులతో కలిసి పని చేస్తుంటాం. అలాంటి సహచరులలో కొంతమంది ప్రాణ స్నేహితులగానూ మారిపోతుంటారు. కొత్త సంవత్సరం వేళ.. అలాంటివారితో కలిసి రోడ్ ట్రిప్‌కి ప్లాన్ చేస్తే చాలా మజాగా ఉంటుంది. కానీ ఇలా ప్లాన్ చేసుకున్నాక … మీలోనే కొందరికి సెలవు మంజూరై..కొందరికి మంజూరు కాకపోతే.. మీరు చాలా అసహనానికి గురవుతారు కదా. అలాంటప్పుడు ఏం చేస్తారు.. మీ మనసు చంపుకొని ఆఫీసుకి వెళ్తారు. బాస్‌ను కూడా పదే పదే తిట్టుకుంటారు. కానీ ఏం చేస్తాం.. ఉద్యోగం ముఖ్యం కదా.
మీ బాల్య మిత్రులతో కలిసి.. గ్రాండ్ పార్టీకి ప్లాన్ చేస్తే..
కొత్త సంవత్సరానికి మీ స్నేహితులతో కలిసి స్వాగతం పలకడానికి.. న్యూ ఇయర్ పార్టీ అంటూ ఒక రెండు నెలల ముందు నుండే ప్లాన్ చేశారా..? పార్టీని ఎక్కడ.. ఎలా ప్రారంభించాలి..? అని ముందస్తుగానే ప్లాన్ చేసుకున్నారా..? కానీ సరిగ్గా పార్టీ ప్రారంభం అయినప్పుడే.. మీకు ఆఫీసు నుండి అర్జంట్ ఫోన్ కాల్ వస్తే..? ఏం చేస్తారు..? మీ బీపీ అమాంతం పెరిగిపోదు. వేరే ఆఫర్ చేతిలో ఉంటే.. ఆన్ ది స్పాట్ రిజైన్ చేసేయడానికి కూడా వెనుకాడరు కదా మరి.
(కానీ ఇలా ఆలోచించడం ఒక ఎత్తైతే.. న్యూ ఇయర్ రోజు కూడా ఆఫీసుకి వెళ్లి పనిచేయాలనుకొనే వర్క్ ఆల్కహాలిక్స్ కూడా ఉంటారు. ఇలాంటి వారు సాయంత్రం వేగంగా వచ్చి.. పార్టీలు లాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఓవర్ టైమ్ చేయాల్సి వస్తే మాత్రం.. మళ్లీ కథ మొదటికే వస్తుంది. బాస్‌కు కూడా తిట్లు తప్పవు మరి)
మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయా..? అయితే అలాంటి వాటిని మాతో పంచుకోండి. మీ స్పందనని క్రింది కామెంట్ సెక్షన్‌లోనూ తెలియచేయండి.
కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!