షాపింగ్‌కు వెళ్తున్నారా.? అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

షాపింగ్‌కు వెళ్తున్నారా.? అయితే ఈ చిట్కాలు మీకోసమే..!

(Tried and Tested Hacks to save money if your a shopaholic)

మన ఇంట్లో పెద్దలు ఎప్పుడూ డబ్బు ఆదా చేయమనే చెబుతారు. అయినప్పటికీ మనం షాపింగ్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తుంటాం. అమ్మాయిలకు, షాపింగ్‌కు.. ఒక రకంగా చెప్పాలంటే ఏదో అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఇంట్లో ఎన్ని చీరలు, వస్తువులు, నగలు ఉన్నా.. పదే పదే షాపింగ్ అంటే మొగ్గు చూపిస్తుంటారు. విండో షాపింగ్ అంటే చాలు.. ఇంకా పడి చచ్చిపోతారు.

ఎన్నోసార్లు మనం షాపింగ్‌‌కు స్వస్తి పలకాలని భావిస్తాం. అయినప్పటికీ డిస్కౌంట్లు, రిబేట్లు అన్న మాటలు చెవిలో పడగానే.. ఆ ప్రలోభాలకు వెంటనే లొంగిపోతాం. కానీ ఒకటి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. షాపింగ్ అంటే మనకు ఎంత ఇష్టమున్నా.. అదే ఇష్టాన్ని డబ్బు ఆదా చేసేందుకు కూడా చూపించాలి.   

ఎందుకంటే.. ఈ రోజు మీరు పొదుపు చేసే డబ్బే రేపు మీకు అక్కరకొస్తుంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, దసరా, దీపావళి.. ఇలా ఏ పండగ వచ్చినా సరే..  ఈ రోజులలో షాపింగ్ అత్యవసరం అయిపోయింది. కానీ ఇలాంటి సందర్భాలలో బడ్జెట్‌ను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే.. జేబుకి చిల్లు పడకుండా వెంటనే బయటపడవచ్చు.

ఆ వస్తువులు మనకు తెలియకుండానే.. పర్యావరణానికి హాని చేస్తున్నాయి..!

అందుకే షాపింగ్ ఖర్చులను ఆదా చేయడానికి పాటించాల్సిన కొన్ని సాధారణ చిట్కాలను మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. 

మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను  ఇంట్లోనే ఉంచండి  - డెబిట్ లేదా క్రెడిట్ కార్డు చేతిలో ఉంటే చాలు. డబ్బులు ఖర్చుపెట్టడం చాలా సులభం. ఎందరో ఈతరం మహిళలు అనుభవపూర్వకంగా చెప్పిన మాట ఇది. చేతిలో డబ్బుంటే.. ఎక్కడ ఖర్చయిపోతుందో అన్న భయం సైకలాజికల్‌గా మనిషిని ఆవహిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉంటాం. కానీ కార్డులు చేతులో ఉంటే.. అకౌంటులో డబ్బులున్నాయి కాబట్టి.. ఎక్కువ వస్తువులు కొన్నా తప్పేమీ లేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.  కనుక.. మీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఇంట్లోనే ఉంచండి. ఒక బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని, నగదుతోనే షాపింగ్‌కు వెళ్లండి. 

హైదరాబాద్‌ ట్రెండ్స్: షాపింగ్ చేయాలా? అయితే ఈ మార్కెట్లపై ఓ లుక్కేయండి..!

 

 

Shutterstock

అమ్మకాలు లేదా ప్రమోషన్ ఆఫర్ల విషయంలో జాగ్రత్త - డిస్కౌంట్లు లేదా రిబేట్ ఆఫర్లు ఉన్నప్పుడు.. షాపింగ్ చేయడం మంచిదే. ఎందుకంటే ఎంతోకొంత డబ్బు ఆదా అవుతుంది. అయితే బ్రాండెడ్ వస్తువులు అమ్మే పెద్ద పెద్ద మాల్స్ లేదా షాపింగ్ సెంటర్లనే మీరు టార్గెట్ చేయండి. అంతేగానీ.. ఆఫర్ అందించే ప్రతీ షాపును సందర్శించడం మంచిది కాదు. కొన్నిసార్లు బ్రాండెడ్ వస్తువులను సంవత్సరాంతంలో ప్రత్యేక రాయితీ ధరలకూ అందిస్తారు. ఆ సమయంలో, షాపింగ్‌కు వెళ్లండి. అప్పుడు ఖచ్చితంగా మీ డబ్బు ఆదా అవుతుంది. 

జాబితాను రూపొందించండి - కొందరికి షాపింగ్ చేయడం ఒక హాబీ. అందుకే ఆ హాబీ ప్రకారం షాపింగ్ చేసేటప్పుడు.. ఏ వస్తువు కనబడితే  ఆ వస్తువును వెంటనే కొనేస్తారు. 

ఈ క్రమంలో ఇష్టం లేని చాలా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు మీ డబ్బును ఆదా చేయాలనుకుంటే, ఇలాంటి హాబీలకు స్వస్తి పలకండి. మీ బడ్జెట్ తయారుచేసుకున్నప్పుడే.. మీకు అవసరమైన వస్తువుల జాబితాను రూపొందించండి. ఆ జాబితా ప్రకారమే కొనుగోళ్లు చేయండి. 

Shutterstock

ప్రత్యేక బడ్జెట్  అవసరమే - మరొక విషయం ఏమిటంటే.. షాపింగ్ కోసమే మీరు ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తయారుచేసుకుంటే మంచిది. ఈ క్రమంలో మీరు ఒక నెలలో షాపింగ్ చేయకపోయినా, ఆ డబ్బును  పిగ్గీ బ్యాంకులో జమ చేయండి. అలాగే మీరు వేసుకొనే బడ్జెట్ కూడా చాలా సహేతుకంగా ఉండాలి. 

ఈ ఫ్యాష‌న‌బుల్ వ‌స్తువులు.. మీ వార్డ్‌రోబ్‌లో త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే..!

ధరల మధ్య తారతమ్యాలు తెలుసుకోవాలి - కొన్ని సందర్భాలలో ఒక్కొక్క వస్తువు ధర ఒక్కో షాపులో.. ఒక్కో విధంగా ఉంటుంది. కొన్నిసార్లు మార్కెట్ ప్రభావం వల్ల కూడా ఈ ధరలు తారుమారవుతుంటాయి. అందుకే ఒక వస్తువును కొనేటప్పుడు దాని ధరను  ఆన్‌లైన్‌లో ఓసారి చెక్ చేసుకుంటే మంచిది. ఈ పద్ధతి బ్రాండెడ్ వస్తువులు, ఆభరణాలు లాంటి వాటికి కూడా వర్తిస్తుంది.  

ఛాయా చిత్రాలు - Instagram

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ


క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.