29 జనవరి 2020 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

29 జనవరి 2020 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

ఈ రోజు (29 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం


మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జరిపే చర్చలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వివాహితులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంకాస్త కష్టపడాలి.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు ఆలుమగల మధ్య అపార్థాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ప్రేమికుల బంధాలు సంక్లిష్టంగా మారతాయి. వాణిజ్య రంగంలో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులు కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించండి.

మిథున రాశి  (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. మీకు మీ స్నేహితుల మద్దతు కూడా కచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యాలు కూడా అనుకూల ఫలితాలు చేకూరుస్తాయి. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీకు చాలా శుభదినం. అలాగే ఆఫీసులో ప్రమోషన్ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. వ్యాపారంలో మీరు బయటి వ్యక్తుల నుండి ప్రయోజనాలు పొందుతారు. అలాగే విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. కొంచెం కష్టపడితే.. అనుకోని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే మీ భాగస్వామి నుండి శుభవార్తలు వింటారు.వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఆలుమగలు కొన్ని విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నా.. ఆ సమస్యల నుండి వేగంగానే బయటపడతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దు. ఉద్యోగులకు ఆఫీసులో ప్రత్యర్థులతో సమన్వయం ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. 

తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. ఉద్యోగులు ఛాలెంజింగ్ టాస్క్‌లు టేకప్ చేస్తారు. ప్రేమికులు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమ సమస్యలను తాము మాత్రమే పరిష్కరించుకోవడం మంచిది. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సవాళ్లను ఎదుర్కోవచ్చు. అదేవిధంగా  నిరుద్యోగులు సోమరితనాన్ని వీడాలి. వ్యాపారవేత్తలు జాగ్రత్తగా లేకపోతే ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) -  ఈ రోజు మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు అధిక శ్రమ మరియు క్రమశిక్షణా రాహిత్యం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. విద్యార్థులు ఇంకాస్త కష్టపడాలి.

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మీ భాగస్వామి నుండి అనుకోని బహుమతులు పొందుతారు. అలాగే సమాజ సేవ పట్ల కూడా మొగ్గు చూపిస్తారు. అదేవిధంగా మీకు ఆఫీసులో సహోద్యోగుల నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) - ఈ రోజు నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు  ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు వ్యాపారస్తులు రుణాలు ఇవ్వడం లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అనుకోని చిక్కులలో పడతారు. అలాగే వివాహితులకు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది.  అదేవిధంగా విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవడం మంచిది. విద్యార్థుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి