ADVERTISEMENT
home / Astrology
05 జనవరి 2020 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

05 జనవరి 2020 (ఆదివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (5 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు రాశి వ్యక్తులు బహుమతులు లేదా కానుకలను పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మహిళలు అపరిచితుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. అలాగే ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా.. తర్వాత మళ్లీ సర్దుకుపోతారు.

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అక్కరకు రాని స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులు పలు నూతన ఒప్పందాలను చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రత్యమ్నాయ రంగాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. అలాగే వివాహితులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

మిథునం (Gemini) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని కొన్ని విషయాలకు సంబంధించి ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు.  నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచిస్తారు.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – ఈ రోజు ప్రేమికుల సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. మీ కుటుంబంతో సంబంధాలు పటిష్టంగా మారతాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు. సినిమా రంగంలో ప్రయత్నాలు చేసే వారికి.. ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

సింహం (Leo) – ఈ రోజు విద్యార్థులు మరింత కష్టపడాలి.  నిరుద్యోగులు కొన్ని విషయాలలో నిర్లక్ష్యాన్ని వీడాలి. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రాశి వ్యక్తులు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు.. నూటికి పది సార్లు ఆలోచించాలి. అలాగే వివాహితులకు ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. విద్యార్థులు కెరీర్‌లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడాలి. ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. 

ADVERTISEMENT

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు శుభవార్తలు వింటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆలుమగల సంబంధాలు కూడా పటిష్టంగా మారతాయి. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు కుటుంబ సమస్యల వల్ల.. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.  అలాగే కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోండి. ప్రేమికులు కొన్ని సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా తమకు తామే పరిష్కరించుకోవడం ముఖ్యం. అలాగే ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యతను పాటించండి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ కుటుంబ సమస్యలు.. మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాలలోనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అలాగే ఆఫీసులో ఉద్యోగులు ఉద్రిక్త వాతావరణాన్ని చూస్తారు. అలాగే మీకు సంబంధం లేని వివాదాల జోలికి వెళ్లవద్దు.

ADVERTISEMENT

మకరం (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడే సూచనలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి రంగానికి చెందిన వ్యక్తులకు.. ఈ రోజు బాగా కలిసొస్తుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు.. కొన్ని అపోహలను తొలిగించుకోవడం మంచిది. లేకపోతే కొన్ని బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు చేసే బిజినెస్ పర్యటనలు విజయవంతమవుతాయి. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏ మాత్రం అలసత్వం చూపించినా సరే.. చేతికందిన అవకాశాలు చేజారిపోతాయి. అలాగే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమికులు తమ బంధంలో నిజాయతీ ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలి. ధన వ్యామోహం కొన్ని బంధాలను శాశ్వతంగా దూరం చేస్తుందని భావించాలి. 

ADVERTISEMENT

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.

05 Jan 2020

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT