ఈ రోజు (07 జనవరి, 2020) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం
మేష రాశి (Aries) – ఈ రోజు మీ రోజంతా హాయిగా, ఆనందంగా గడుస్తుంది. అలాగే కొన్ని పనులు కూడా వాయిదా పడతాయి. ముఖ్యంగా మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది.
వృషభ రాశి (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు. అయితే కొన్ని అక్కరకు రాని స్నేహాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి.
మిథున రాశి (Gemini) – ఈ రోజు మీరు అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు. మానసికంగా కూడా మీ పై ఎంతో ఒత్తిడి ఉంటుంది. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో తెలియజేయడానికి ఇదే సమయం. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఒక కొలిక్కి వస్తాయి.
కర్కాటక రాశి (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే ఆర్థికపరమైన లావాదేవీలు చేసేటప్పుడు ఆచితూచి అడుగులు వేయడం అవసరం. అలాగే కుటుంబానికి సాధ్యమైనంత ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నించండి.
సింహ రాశి (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని విషయాలలో కుటుంబ సభ్యులతో వాదిస్తారు. ఆలుమగలు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరు నిజాయతీగా వ్యవహరించడం ముఖ్యం.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య రాశి (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే కొన్ని చిత్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు సినిమాలు లేదా కళా రంగం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం మంచిది.
తుల రాశి (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ క్రియేటివిటీతో ఆలోచనలకు పెద్దపీట వస్తారు. అలాగే వ్యాపార వికాసం కోసం కొత్త పద్ధతులను అమలు చేస్తారు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి ఇది మంచి రోజు. అలాగే విద్యార్థులు నిర్లక్ష్యాన్ని వీడితే.. అనుకోని అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు.
వృశ్చిక రాశి (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పని చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేయాల్సి వస్తుంది. అలాగే వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మేలు. అలాగే మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు రాశి (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు చాలా సాధారణంగా గడుస్తుంది. అలాగే వాయిదా పడిన పనులు మరల వాయిదా పడే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించండి. మహిళలు ఖర్చుల విషయంలో అప్రమత్తతతో ఉండాలి.
మకర రాశి (Capricorn) – ఈ రోజు మీరు అనుకోని సమస్యలలో ఇరుక్కుంటారు. అలాగే కొన్ని చిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటారు. ఉద్యోగులు ఆఫీసులో ప్రత్యర్థుల సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. వివాహితులు కొన్ని విషయాలలో పొరపొచ్చాలు వచ్చినా.. ఆ తర్వాత మళ్లీ కలిసిపోతారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభ రాశి (Aquarius) – ఈ రోజు మీరు చాలా నెమ్మదిగా పనిచేస్తారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు తీసుకుంటారు. అలాగే మీ కష్టకాలంలో మీరు.. మీ సోదరుల నుండి సహాయాన్ని పొందుతారు. మహిళలు కొన్ని అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు
మీన రాశి (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే సాధ్యమైనంత వరకూ కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి. ఆఫీసులో కూడా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో పొరపొచ్చాలు ఏర్పడినా.. తర్వాత సర్దుకుపోతారు.
మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.