Swami Vivekananda Quotes : ఓ యువతా మేలుకో.. (ఈ అద్భుతమైన సూక్తులు మీకోసం)

Swami Vivekananda Quotes : ఓ యువతా మేలుకో.. (ఈ అద్భుతమైన సూక్తులు మీకోసం)

(Swami Vivekananda Quotes)

ఓ యువతా మేలుకో.. అంటూ భారతదేశ యువజనులకు దిశా నిర్దేశం చేయడానికి తనదైన మార్గంలో కృషి చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. జనవరి 12 తేదిన ప్రతీ యేటా ఆయన జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మనం కూడా ఈ రోజు ఆయన బోధనల నుండి కొన్ని స్ఫూర్తిదాయకమైన సూక్తులను చదివేద్దాం

1. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడండి. లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

2. నీ వెనుక ఏముంది…ముందేముంది…? అనేది అనవసరమైన ప్రశ్న. నీలో ఏముందనేదే నీకు ముఖ్యం.

3. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

4. ఒక్క క్షణం సహనంగా ఉంటే చాలు.. కొండంత ప్రమాదాన్ని సైతం ఆపవచ్చు. కానీ ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

5. జీవితంలో ధనాన్ని కోల్పోయినా ఫరవాలేదు. కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోయినట్టే.

6. ఏ పరిస్థితులలో ఉన్నా.. నీ కర్తవ్యం నీకు గుర్తుండాలి. అప్పుడే జరగాల్సిన పనులు జరుగుతాయి.

7. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా స్వీకరించడం.. ఇవే విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.

8. విజయం కలిగిందని విర్రవీగకు.. అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమనేది అంతం కాదు.. అపజయమనేది తుది మెట్టు కాదు

9. ఆత్మనూన్యతా భావంతో బతకడం అనేదే అతి పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.

10. లేవండి ! మేల్కొనండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.

"యువతా మేలుకో.." - అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. ఈ కొటేషన్లు మీకోసం..!

 

11. ప్రతి ఆనందం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే.. తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఃఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి.

12. సత్యాన్ని త్రికరణశుద్దిగా నమ్మితే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించి తీరుతాం.

13. కార్యశక్తి కంటే, కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి ఎన్నో రెట్లు గొప్పది.

14. లక్ష్యంపై ఉన్నంత శ్రద్దాసక్తుల్ని, లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంటే ఇదే. 

15. ఆత్మ విశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి

16. హృదయానికి, మెదడుకు సంఘర్షణ జరిగినప్పుడు, హృదయాన్నే అనుసరించు.

17. వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం

విజేతగా నిలవాలంటే ఏం చేయాలి? - ఈ 40 కొటేషన్లు మీకోసం

18. ఈ జీవితం క్షణికం! ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూనాళ్ళ ముచ్చట్లే! ఎవరైతే పరుల కోసం జీవిస్తారో.. వాళ్ళే నిజంగా సజీవులు. మిగిలినవాళ్ళు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క! 

19. విధేయతను అలవరుచుకోవడమే మన ప్రధమ ధర్మం

20. నిజాన్ని వెయ్యి మార్గాల్లో చెప్పవచ్చు. ప్రతీ ఒక్కటీ నిజమై ఉండాలి

21. ప్రపంచం గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం దృఢపరచుకోవడానికి ఇక్కడికి వస్తుంటాం.

22. మానవ శరీరం అనే దేవాలయంలో.. దేవుడు ఉన్నాడని నేను గ్రహించాను. అందుకే ప్రతీ వ్యక్తి ముందు భక్తితో నిలబడతాను.

23. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకొండి. విజయం మీదే. 

24. మహిళా అభ్యున్నతి, ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి. అప్పుడే దేశానికి, భారతదేశానికి ఏదైనా మంచి జరుగుతుంది.

25. క్రైస్తవుడు హిందువు, బుద్ధిస్ట్ కాలేడు. అలాగే హిందువు, బుద్ధిస్ట్ కూడా క్రైస్తవుడు కాలేడు. కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.

మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి... అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి