Ayurveda

పసుపు వాడేద్దాం.. ఈ ప్రయోజనాలు పొందేద్దాం..!

Lakshmi Sudha  |  Jan 15, 2019
పసుపు వాడేద్దాం.. ఈ  ప్రయోజనాలు పొందేద్దాం..!

మార్కెట్లో ల‌భ్య‌మ‌య్యే బ్యూటీ ప్రొడక్ట్స్  (Beauty Products) ఎన్ని ఉపయోగించినప్పటికీ మ‌న చ‌ర్మ సౌంద‌ర్యానికి ప్ర‌కృతి అందించిన స‌హ‌జసిద్ధ‌మైన‌ ఉత్ప‌త్తుల కంటే ఉత్త‌మైన‌వి మ‌రేవీ ఉండ‌వు. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్పుడు మ‌హిళ‌లు తమ అందాన్ని కాపాడుకోవడానికి పసుపునే ఎక్కువ‌గా ఉపయోగించేవారు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ప్రస్తుత తరంలో పసుపు (Turmeric) ఉపయోగించడానికి ఎవరూ అంత ఆసక్తి చూపించడం లేదనే చెప్పుకోవాలి. కానీ పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకొంటే.. మనమూ దాన్ని ఉపయోగించడం మొదలుపెడతాం.

1. ట్యాన్ పోగొడుతుంది

సూర్యరశ్మి ప్రభావం వల్ల స్కిన్ పై ట్యాన్ పెరగం స‌హ‌జ‌మే. చాలామంది దీని నుంచి విముక్తి పొందేందుకు మార్కెట్లో దొరికే ర‌క‌ర‌కాల ట్యాన్ ప్యాక్ లు ఉపయోగించడం లేదా బ్యూటీ పార్లర్లను ఆశ్రయించడం వంటివి చేస్తారు. అయితే చర్మంపై ఉన్న ట్యాన్ ను పసుపు (Turmeric) సమర్థంగా పోగొడుతుంది. బీచ్ హనీమూన్ కి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మీ చర్మంపై ఏర్పడిన ట్యాన్ ను పోగొట్టడానికి పసుపు, చందనం, నిమ్మరసం తగుపాళ్లలో కలిపి చర్మానికి ప్యాక్ లా వేసుకొంటే.. ట్యాన్ పోతుంది.

Also Read: మచ్చలు తొలగించేందుకు ఇంటి చిట్కాలు (Home Remedies To Remove Acne Scars)

2. ఫేషియల్ హెయిర్ తగ్గిస్తుంది

మన బామ్మ, అమ్మ తరాలకు చెందినవారు ఇప్పటికీ ముఖానికి పసుపు రాసుకొంటూ ఉంటారు. దీనివల్ల ముఖ వర్చస్సు పెరగడమే కాకుండా ముఖంపై రోమాలు పెరగకుండా ఉంటాయి. మీరు కూడా ముఖంపై అవాంఛిత రోమాల (Unwanted Hair)తో ఇబ్బంది పడుతుంటే పసుపులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకొని కాసేపాగిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. పెళ్లికి సిద్ధమవుతున్నవారు కొన్ని నెలల ముందు నుంచి ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా అంద‌మైన‌, ఆరోగ్య‌వంత‌మైన చ‌ర్మాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

3. మోచేతులపై డార్క్ ప్యాచెస్ లేకుండా

సాధారణంగా మన మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద ఉండే చర్మం కాస్త నల్లగా ఉంటుంది. ఈ డార్క్ ప్యాచెస్ (Dark patches) ను పసుపు ఉపయోగించి సులభంగా పోగొట్టచ్చు. దీనికోసం శెనగపిండిలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి అప్లై చేసుకొంటే.. డార్క్ ప్యాచెస్ క్రమంగా చర్మం రంగుకి మారతాయి.

4. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్

వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు, గీతలు ఏర్పడటం సహజం. వీటిని తగ్గించుకోవడం కోసం పచ్చిపాలల్లో బియ్యప్పిండి, కొద్దిగా పసుపు కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత దీనిని శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్ మీ చర్మాన్ని తిరిగి యవ్వనం (Youthfulness)గా మారుస్తుంది.

5. మొటిమలు మాయం

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. ప‌సుపులో త‌గిన‌న్ని నీళ్లు వేసి ముద్దగా చేసి ముఖానికి రాసుకొని పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు (Pimples) తగ్గుముఖం పడతాయి.

Read More About Pimples

6. ఎక్సలెంట్ ఎక్స్ఫోలియేటర్

మృదువైన, కాంతివంతమైన చర్మం కావాలని కోరుకునేవారు పసుపు ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. శెనగ పిండిలో కొద్దిగా పసుపు కలిపి స్నానానికి ముందు చర్మానికి నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత‌క‌ణాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం సాఫ్ట్ గా తయారవుతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల మీ చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది.

7. చర్మం యవ్వనంగా..

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యవ్వనమైన మెరిసే చర్మాన్ని అందిస్తాయి. ఇవి చర్మంపై కొత్త కణాలు పెరిగేలా చేస్తాయి. ఫ‌లితంగా చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉంటుంది. అయితే ఈ ఫలితాన్ని పొందడానికి పసుపు, తేనె మిశ్రమంగా చేసి వాడాల్సి ఉంటుంది.

8. మచ్చలు తగ్గిస్తుంది.

చర్మంపై మొటిమలు, గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు తగ్గడానికి మనం పాటించదగిన సులభమైన చిట్కా పసుపు. క్రమం తప్పకుండా మచ్చలపై పసుపు (Turmeric) అప్లై చేస్తూ ఉంటే.. కొన్ని రోజుల తర్వాత అవి చర్మం రంగులోకి మారిపోతాయి.

9. జిడ్డుగా మారకుండా..

కొందరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా చర్మం చాలా జిడ్డుగా తయారవుతుంటుంది. దీనికి కారణం చర్మ గ్రంథుల నుంచి అధికంగా విడుదలయ్యే సీబమ్. దీనివల్ల చర్మం తన మెరుపుని కోల్పోతుంది. దీనికోసం గంధం, పసుపుని కమలాఫల రసంలో కలిపి ముద్దగా చేసి ముఖానికి మాస్క్ లాగా అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

10. ప్రకాశవంతమైన చర్మం..

చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తుంది. శెనగపిండి, పసుపు, టమాటా ర‌సం కలిపి మిశ్రమంగా చేసి చర్మానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇది చర్మానికి త‌క్ష‌ణ మెరుపు (Instant Brightness)ని అందిస్తుంది.  పొడి చ‌ర్మ‌త‌త్వం (Dry Skin) ఉన్న‌వారు ఈ ప్యాక్ లో కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

పసుపు (Turmeric) ఉపయోగించడం వల్ల చర్మానికి మేలు జరిగే మాట వాస్తవమే అయినప్పటికీ.. మనం ఎంచుకొన్న పసుపు కల్తీదైతే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి పసుపుతో చర్మం ఆరోగ్యాన్ని, అందం (Beauty) పెంచుకోవడానికి ఆర్గానిక్ పసుపు ఉపయోగించడం మంచిది.

Images: Shutterstock

 ఇవి కూడా చ‌ద‌వండి

బ్యూటీ రిజల్యూషన్స్: సులభమైన చిట్కాలతో అందం మీ సొంతం..

సౌందర్యాన్ని పరిరక్షించే.. పది రకాల కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్..!

పతంజలి ఉత్పత్తులు- వాటి ప్రయోజనాలపై మా సమీక్ష

Read More From Ayurveda