
Special New Year Events in Hyderabad
డిసెంబర్ 31 తేది వచ్చేసింది. అలాగే 2019 సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తూ, 2020 కి స్వాగతం చెప్పే క్షణాలు దగ్గరపడ్డాయి. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. మీరు కూడా న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొనేందుకు స్పెషల్‌గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం..? మీలాంటి వారికోసమే భాగ్యనగరంలో ఎన్నో హోటళ్లు, పబ్బులు, రెస్టారెంట్లు స్పెషల్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలంటే.. ఈ 15 బెస్ట్ స్పాట్స్‌కి వెళ్లాల్సిందే..!
ఈ క్రమంలో మేం కూడా.. హైదరాబాద్‌లో ఏ పార్టీ, ఎక్కడ జరుగుతుంది? టికెట్ ధరలేమిటి? మొదలైన సమాచారాన్ని మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.
ఈ ఏడాది హైదరాబాద్‌లో జరిగే టాప్ టెన్ న్యూ ఇయర్ వేడుకలు ఇవే..!
* డ్యాన్స్ అఫ్ ది డికేడ్ – తాజ్ డెక్కన్
తాజ్ డెక్కన్ హోటల్‌లో ‘డ్యాన్స్ ఆఫ్ ది డికేడ్’ పేరిట న్యూ ఇయర్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో భాగంగా కపుల్స్ కోసం నైట్ హోటల్‌లో ఉండేందుకు స్పెషల్ స్టేని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం స్పెషల్ ప్యాకేజీలను కూడా అందిస్తున్నారు.
ఇక ఎంట్రీ టికెట్స్ విషయానికి వస్తే,
స్ట్యాగ్ పాస్ – రూ. 3500/-
కపుల్ పాస్ – రూ. 6500/-
కపుల్ పాస్ విత్ స్టే – రూ 12,999/-
సమయం – రాత్రి 8 గంటల నుండి 1 గంట వరకు
* న్యూ ఇయర్ బ్యాష్ 2020 – తాజ్ కృష్ణ
తాజ్ కృష్ణ హోటల్.. న్యూ ఇయర్ ఈవెంట్‌కి వచ్చే వారికోసం.. డీజే రియా & డీజే రాహుల్‌లతో ప్రత్యేకంగా డీజే నైట్‌ని ఏర్పాటు చేయబోతున్నారు.
ధరల విషయానికి వస్తే,
సింగిల్ పాస్ – రూ 5499/-
కపుల్ పాస్ – రూ 9999/-
సమయం – 8 గంటల నుండి 12 గంటల వరకు
* మ్యాడ్ ఆన్ 2020 – తెలంగాణ టూరిజం
తెలంగాణ టూరిజం వారి సమర్పణలో.. మ్యాడాన్ 2020 పేరిట హైటెక్ సిటీ దగ్గరలోని బీస్పోర్టి – స్పోర్ట్స్ & ఫిట్నెస్ సెంటర్‌లో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీజే నికిత, MTV ఎస్ ఆఫ్ స్పేస్ 2 విజేత సల్మాన్‌లు ప్రత్యేకంగా ఆడియన్స్‌ను అలరించనుండగా.. ఫైర్ వర్క్స్ & స్కై ల్యాంతర్ వంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.
ధరల విషయానికి వస్తే…
సింగిల్ – రూ 599
సిల్వర్ – రూ 899
గ్రూప్ ఆఫ్ 5 – రూ 2499
గ్రూప్ అఫ్ 10 – రూ 4499
గోల్డ్ కపుల్ టేబుల్ – రూ 4999
డైమండ్ (గ్రూప్ ఆఫ్ 5) – రూ 8999
ప్లాటినమ్ (గ్రూప్ ఆఫ్ 10) – రూ 15999
కిడ్స్ (5-12) – రూ 299
సమయం – 7 గంటల నుండి 12.30 గంటల వరకు
* న్యూ ఇయర్ @ ది పార్క్
రాజ్ భవన్ రోడ్డులో ఉన్న ‘ది పార్క్’ హోటల్‌లో జరిగే న్యూ ఇయర్ 2020 ఈవెంట్‌లో ముగ్గురు డీజేలు ఆహుతులని ఆహ్లాదపరిచేందుకు సిద్ధమవుతున్నారు. వారే – డీజే డయానా, డీజే NVN & డీజే నేషన్.
ధరల విషయానికి వస్తే …
సింగిల్ పాస్ – ట్రిలియన్ బాల్ రూమ్ – రూ 3999/-
కపుల్ పాస్ – ట్రిలియన్ బాల్ రూమ్ – రూ 5999/-
సింగిల్ పాస్ – కిస్మత్ – రూ 4999/-
కపుల్ పాస్ – కిస్మత్ – రూ 7999/-
సింగిల్ పాస్ – యాక్వా – రూ 5999/-
కపుల్ పాస్ – యాక్వా – రూ 9999/-
సింగిల్ పాస్ – ఐష్ – రూ 2499/-
కపుల్ పాస్ – ఐష్ – రూ 3999/-
సింగిల్ పాస్ – వరండా – రూ 2499/-
కపుల్ పాస్ – వరండా – రూ 3999/-
కిడ్స్ – సింగిల్ – రూ 1999/-
సమయం – 6 గంటల నుండి 12.30 గంటల వరకు
టాలీ గ్రాండ్ పార్టీ – రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్‌లో ప్రముఖ టూరిజం స్పాట్ అయిన రామోజీ ఫిలిం సిటీలో ప్రతి సంవత్సరం ‘న్యూ ఇయర్ ఈవెంట్’ని ప్లాన్ చేయడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ తరుణంలో 2020కి సంబంధించి టాలీ గ్రాండ్ పార్టీ పేరిట ఓ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారు.
ధరల విషయానికి వస్తే …
చైల్డ్ పాస్ – రూ 1499/-
అడల్ట్ విత్ కపుల్ – రూ 2999/-
కపుల్ పాస్ – రూ 4999/-
సమయం – రాత్రి 8.30 గంటల ఉంది 1 వరకు
* లా ఫెస్టా 2020 న్యూ ఇయర్స్ ఈవ్ పార్టీ – ట్రీడెంట్ హోటల్
మాదాపూర్‌లోని ట్రీడెంట్ హోటల్ గురించి తెలియని వారుండరు. ఇక ట్రడెంట్ హోటల్‌లో ‘లా ఫెస్టా 2020 పేరిట న్యూ ఇయర్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో ప్రముఖ డీజే ఆసిఫ్ ఆహుతులను అలరించబోతున్నారు.
ధరల విషయానికి వస్తే..
స్ట్యాగ్ పాస్ – రూ 4500/-
కపుల్ పాస్ – రూ 8500/-
కిడ్ పాస్ (5-12) – రూ 2000
సమయం – 8 గంటల నుండి 12 గంటల వరకు
* ఈజిప్షియన్ నైట్స్ ఎట్ ఆదిత్య పార్క్ – ఆదిత్య పార్క్ హోటల్
అమీర్ పేట్‌లోని ఆదిత్య పార్క్ హోటల్‌లో ‘ఈజిప్షియన్ నైట్స్ ఎట్ ఆదిత్య పార్క్’ పేరిట న్యూ ఇయర్ ఈవెంట్ జరగనుంది. డీజే స్యాండీ & డీజే అయోధ్య తమ లైవ్ మ్యూజిక్‌తో ఆడియన్స్‌ని అలరించబోతున్నారు.
ధరల విషయానికి వస్తే..
స్ట్యాగ్ పాస్ – రూ 2499/-
కపుల్ పాస్ – రూ 3999/-
కిడ్స్ (5-12) – రూ 899/-
సమయం – 8.30 నుండి 12.30 వరకు
హైదరాబాద్‌లో క్రిస్మస్ & న్యూ ఇయర్ ‘కేక్స్’కి.. ఈ బేకరీలు ప్రత్యేకం
* ది మాస్క్యూరెడ్ నైట్ 2020 – హ్యాంప్ షైర్ ప్లాజా హోటల్
హైదరాబాద్ నగరం నడిబొడ్డులో.. ఖైరతాబాద్ ప్రాంతంలోని హ్యాంప్ షైర్ ప్లాజా హోటల్‌లో ‘ది మాస్క్యూరెడ్ నైట్ 2020 ‘ పేరిట న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రూఫ్ టాప్ రెస్టారెంట్ అనేది ఇక్కడ ప్రధాన ఆకర్షణ.
స్ట్యాగ్ పాస్ – రూ 2499/-
కపుల్ పాస్ – రూ 3499/-
కిడ్ పాస్ – రూ 999/-
సమయం – రాత్రి 8 గంటల నుండి 12.15 వరకు
*న్యూ ఇయర్ ఈవెంట్ 2020 @ 21st ఎవెన్యూ
హైదరాబాద్ పరిసర ప్రాంతమైన కర్మన్ ఘాట్ ఏరియాలోని 21st ఎవెన్యులో.. న్యూ ఇయర్ ఈవెంట్ @ 21st పేరిట ఒక మంచి ఈవెంట్‌ని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఈ ఈవెంట్‌కి హైలైట్2గా డీజే అన్ టోల్డ్ చే లైవ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుంది.
ధరల విషయానికి వస్తే…
స్ట్యాగ్ పాస్ – రూ 1899/-
ఫీమేల్ పాస్ – రూ 1299/-
కపుల్ పాస్ – రూ 2799/-
టేబుల్ ఫర్ 4-6 పీపుల్ – రూ 12999/-
టేబుల్ ఫర్ 7-10 పీపుల్ – రూ 19999/-
సమయం – 8 గంటల నుండి 12 గంటల వరకు
* టెస్ట్స్ ఆఫ్ ఇండియా – ఏ బ్లిస్ ఫుల్ ఈవెనింగ్ – హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, బంజారా హిల్స్
ఇప్పటివరకు చెప్పినవన్ని పార్టీ లవర్స్ గురించి అయితే.. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవడానికి ఇష్టత చూపేవారికి.. శాకాహారం అలవాటు ఉన్న వారికి సరైన న్యూ ఇయర్ ఈవెంట్ ఈ టెస్ట్స్ ఆఫ్ ఇండియా – ఏ బ్లిస్ ఫుల్ ఈవెనింగ్. బంజారా హిల్స్‌లో ఉన్న హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో ఈ ఈవెంట్ జరగనుంది.
ఈ ఈవెంట్‌లో క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్స్ వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబోతున్నారు. ఈ తరుణంలో న్యూ ఇయర్‌ని కాస్త వైవిధ్యంగా చేసుకోవాలి అని అనుకునేవారికి ఇది సరైన ఈవెంట్ అని చెప్పవచ్చు.
ధరల విషయానికి వస్తే …
కపుల్ పాస్ – రూ 1549/-
చైల్డ్ పాస్ – రూ 399/-
ఫ్యామిలీ పాస్ (4 సభ్యులు) – రూ 2199/-
ఫ్యామిలీ (6 సభ్యులు) – రూ 3699/-
అడల్ట్ పాస్ సింగిల్ – రూ 799/-
సమయం విషయానికి వస్తే – 7.30 నుండి 12 గంటల వరకు
ఇవండీ.. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ 2020 సందర్భంగా జరగబోతున్న బెస్ట్ 10 ఈవెంట్స్. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే మీకు నచ్చిన దానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని.. డిసెంబర్ 31 రాత్రిని సరదాగా గడిపేయండి. మీ అందరికి మా తరపున అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్.
కొత్త సంవత్సరం వచ్చేస్తున్న వేళ.. మీరూ కొత్త నిర్ణయాలు తీసేసుకోండి..!