Dating

“కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..” అనే ఫీలింగ్ తనకు కలిగేదెప్పుడు..?

Soujanya Gangam  |  Apr 10, 2019
“కోపమా నాపైనా.. ఆపవా ఇకనైనా..” అనే ఫీలింగ్ తనకు కలిగేదెప్పుడు..?

ప్రేమైనా.. పెళ్లి అయినా రెండు విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కలిసి ఉండడం కాబట్టి.. గొడవలు ( Fight) సహజంగానే జరుగుతుంటాయి. కానీ ఎలాంటి ఇబ్బంది ఎదురైనా.. మాటలతోనే సర్దుకుపోవాలే కానీ.. ఒకరిపై ఒకరు కోపాన్ని ప్రదర్శించడం.. గొడవ పెట్టుకోవడం వంటివి సరికాదని పెద్దవాళ్లు చెబుతుంటారు.

సాధారణంగా మనం ఎప్పుడూ మృదువుగానే మాట్లాడుతుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం కోపాన్ని ఆపుకోలేం.

అలాంటప్పుడు మాట్లాడకుండా ఉండిపోతాం. కానీ కొన్నిసార్లు మీ కోపాన్ని ప్రదర్శించడమే మంచిది అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఎప్పటి కోపం అప్పటికే తగ్గిపోతుందని.. ఆ తర్వాత దాన్ని మర్చిపోయే వీలుంటుందని వారి అభిప్రాయం. మరి, ఎలాంటి సందర్భాల్లో మన భాగస్వామి (partner) పై కోపం చూపించవచ్చో మీకు తెలుసా?

1. పీఎంఎస్‌తో బాధపడుతున్నప్పుడు..

ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా మీ భర్త చేసిన పనులకు మీరు హర్ట్ అయ్యి కోపగించుకుంటున్నారంటే.. అది పీఎంఎస్ సమస్య అయ్యి ఉండొచ్చు. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ రోజుల్లో మూడ్ స్వింగ్స్ మనకి తెలియకుండానే మనల్ని డ్రామా క్వీన్స్‌గా మార్చేస్తాయి.

2. అతడికి ఎవరైనా లైన్ వేసినప్పుడు..

అరె. మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ భర్త మీకే సొంతం. వేరేవాళ్లు తనకి లైనేస్తే వూరుకుంటామా? ఏంటి?

3. మీ భాగస్వామి వేరే అమ్మాయిని చూస్తుంటే..

మీరు పక్కనుండగానే వేరే అమ్మాయిలను చూస్తుంటే.. మీకు కోపం రావడం సహజమే. తన పట్ల మీకున్న ఫీలింగ్‌ని బయటపెట్టాలని తను ఇలా చేసినా.. మీరంటే ఏంటో ఒక్కసారి చూపించేయండి.

4. ముఖ్యమైన రోజు మర్చిపోతే..

మీ పుట్టిన రోజున అర్థరాత్రి లేపి కేక్ కట్ చేయిస్తాడని.. ఫొటోల్లో అందంగా కనిపించాలని మీరు అనుకుంటారు. అందుకోసం మంచి డ్రస్ వేసుకొని పడుకుంటారు. కానీ తాను మీ పుట్టినరోజునే మర్చిపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి? అందుకే వరల్డ్ వార్ డిక్లేర్ చేయడం సరైన పనే..

5. మిమ్మల్ని పట్టించుకోకపోతే..

మీకు ఏదైనా ఇబ్బంది ఎదురై మీకు తన అవసరం ఎక్కువగా ఉన్నప్పుడు.. తను మిమ్మల్ని పట్టించుకోకపోతే బాధగా అనిపించడం సహజం. ఇలా పట్టించుకోకపోతే మీ  మనసులో ఉన్న కోపాన్ని, బాధను తనతో చెప్పేయడం మంచిది.

6. ఆఖరి నిమిషంలో ప్లాన్ క్యాన్సిల్ చేస్తే..

మీరిద్దరూ కలిసి సెకెండ్ షో సినిమాకి వెళ్ధాం అనుకున్నారు. లేదా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకున్నారు. కానీ తను ఆఖరి నిమిషంలో వచ్చి.. స్నేహితులతో బయటకు వెళ్లాల్సి వచ్చిందనో.. లేక ఇంటికి చుట్టాలొస్తున్నారనో చెప్పి ప్లాన్ క్యాన్సిల్ చేస్తే కోపం రావడం సహజం కదా.. ఇలాంటప్పుడు గొడవ పెట్టేసుకోవచ్చు.

7. మీపై జోకులు వేస్తే..

సాధారణంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. కానీ ఆ వేసే జోకులు మీపైనే అయితే కోపం వస్తుంది కదా.. మీరిద్దరూ కలిసి ఇతరుల గురించి జోక్స్ వేసుకుంటూ నవ్వుకోవడం ఓకే.. కానీ మీ ముందు లేదా ఇతరుల ముందు మీ గురించి జోక్స్ వేయడాన్ని మాత్రం ఒప్పుకోవద్దు. ఇలాంటి సందర్భాల్లో కావాలంటే గొడవ పెట్టుకోవచ్చు.

8. కథ ముందే చెప్పేస్తే..

సాధారణంగా భార్యాభర్తలు కలిసి సినిమాలు, నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ షోస్‌లో చూడడం సహజమే. కానీ మీ భాగస్వామి మీకంటే ముందుగానే.. ఆ షో చూస్తే కోపం వస్తుంది. ఇక తను చూసిన షో లేదా సినిమా కథ గురించి ముందే  చెప్పేస్తే.. మీకు ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అప్పుడు రిమోట్‌లో పౌజ్ బటన్ నొక్కి తనకి ముందు మామూలుగా చెప్పిచూడండి.  లేదంటే దబిడి దిబిడే..

9. ఎక్స్ గర్లఫ్రెండ్ గిఫ్ట్ దొరికితే..

మనం ప్రేమించిన వాళ్లు ఇచ్చిన బహుమతులన్నీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం. కానీ మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ భర్త తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన బహుమతిని ఇంకా దాచుకుంటుంటే.. మీ భాగస్వామి మనసులో వారికి ఇంకా చోటున్నట్లే. మీదే అనుకున్న హృదయంలో వేరే వ్యక్తికి కూడా చోటుందంటే అది మిమ్మల్ని బాధపెట్టే విషయమే. అయితే బాధపడే ముందు తననోసారి అడగండి.

10. తను డ్రామా కింగ్ అయిపోతే..

కొన్నిసార్లు మగవాళ్లు కూడా చిన్న విషయాలను పెద్దవి చేసి గొడవ పెట్టుకుంటుంటారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా డ్రామాని డ్రామాతోనే ఖతం చేస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి.

తొలిచూపులోనే పుట్టిన ఈ ప్రేమ క‌థ‌లు.. మీ మ‌న‌సును హ‌త్తుకుంటాయి..!

మ‌నుషులు దూరంగా ఉన్నా.. ఈ యాప్స్ తో మీ బంధం దృఢంగా ఉంటుంది..

సెలబ్రిటీ టాక్: ప్రేమబంధం కలకాలం.. నిలవాలంటే ఏం చేయాలి ..?

Images : Gifskey.

Read More From Dating