(Youngest Indian shooter Esha Singh thrilled with her medals at Asian Shooting Championship)
ఆమె వయసు కేవలం 14 ఏళ్లే. కానీ షూటింగ్ బరిలోకి దిగితే మాత్రం.. గొప్పగొప్ప దిగ్గజాలనే ఆమె బెంబేలెత్తించగలదు. తన ప్రతిభతో అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తగలదు. అంతే కాదు.. అంతర్జాతీయ పోటీలలో సైతం పాల్గొని తనను తాను నిరూపించుకోనూగలదు. ఆమే ఈషా సింగ్. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి ఇటీవలే 14వ ఆసియన్ షూటింగ్ ఛాంపియన్ షిప్‌లో వరుసగా 3 బంగారు పతకాలు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. జూనియర్ మహిళల విభాగంలో.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ పోటీలలో భాగంగా ఈ అరుదైన ఘనతను సాధించింది ఈ బాలిక.
క్రికెట్ అంటే పడి చచ్చే.. మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?
ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఈ క్షణం కోసం తాను ఎన్నో రోజులు ఎదురుచూశానని తెలిపింది. “ఒక అంతర్జాతీయ పోటీలో పతకం పొందడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే నా శక్తిమేరకు శ్రమించాను. ప్రతీ రోజు నా గురి టార్గెట్ మీదే ఉండేది. నా లక్ష్యం కోసం కొన్నాళ్లు స్నేహితులకూ దూరమయ్యాను. సినిమాలు కూడా చూసేదాన్ని కాదు. అంతే కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా చాలా తక్కువగా హాజరయ్యేదాన్ని. ఎప్పుడూ నా టార్గెట్‌ను నేను చేరుకోవాలంటే.. ఏం చేయాలో అన్న విషయాన్నే ఆలోచించేదాన్ని ” అని తన మనసులోని మాటలను పంచుకుంది ఈషా.
శభాష్ మిథాలీ రాజ్.. మరో చరిత్ర తిరగరాసిన క్రికెట్ దిగ్గజం
“నేను 9 ఏళ్ల వయసు నుండే షూటింగ్ పట్ల ఎనలేని మక్కువ పెంచుకున్నాను. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి సబ్ జూనియర్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాను. 2022 యూత్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలవడమే నా లక్ష్యం. నా లక్ష్యసాధనకు నా తల్లిదండ్రులతో పాటు.. నా కోచ్ అందిస్తున్న సహకారం కూడా మరువలేనిది. దాదాపు 4 సంవత్సరాల పాటు నేను షూటింగ్ విభాగంలో కోచింగ్ తీసుకుంటున్నాను. కొన్ని సందర్భాలలో గాయాలు కూడా అయ్యేవి. అయినా పట్టుదలతో ఈ రంగంలో రాణించేందుకు శ్రమిస్తున్నాను” అని తెలిపింది ఈషా.
ఈషా సాధించిన విజయం పై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈషాకి తన అభినందనలు తెలియజేసింది. ప్రస్తుతం మన దేశంలో అతి తక్కువ వయసులోనే షూటింగ్‌లో రాణిస్తున్న క్రీడాకారిణులలో ఈషా కూడా ఒకరు. జూనియర్ షూటర్లలో జాతీయ రికార్డు సాధించిన అరుదైన రికార్డు కూడా ఈమె పేరిట ఉండడం విశేషం. గతంలో ఈమె లెజెండరీ షూటర్ గగన్ నారంగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న షూటింగ్ క్లబ్ “గన్ ఫర్ గ్లోరీ” ద్వారా కూడా గైడెన్స్ పొందారు.
20 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఏకైక మహిళ ‘మిథాలీ రాజ్ .. ఇదో అరుదైన రికార్డ్
అలాగే హీనా సిద్ధూ, మను బకర్ లాంటి ప్రముఖ ఇండియన్ షూటర్లకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఘనత ఈషా సొంతం. తొలుత జాతీయ క్రీడలలో సత్తా చాటి.. ఆ తర్వాత జూనియర్ వరల్డ్ కప్‌లో కూడా పతకాలు పొందాక.. ఈషా ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన లక్ష్యం దిశగా తాను దూసుకుపోతూనే ఉంది. మన దేశానికి పతకాలు తీసుకొస్తూనే ఉంది. అంతర్జాతీయ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంది. మరి ఈ యంగ్ షూటర్ మన దేశానికి మరింత పేరు తీసుకురావాలని.. మరిన్ని పతకాలు తనని వరించాలని కోరుతూ POPxo తరఫున చెప్పేద్దామా ఆల్ ది బెస్ట్
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.