Entertainment

కొత్త కథలకే.. ప్రేక్షకుల ఓటు : 2019 టాప్ టెన్ టాలీవుడ్ చిత్రాలివే..!

Sandeep Thatla  |  Dec 13, 2019
కొత్త కథలకే.. ప్రేక్షకుల ఓటు : 2019 టాప్ టెన్ టాలీవుడ్ చిత్రాలివే..!

2019 Top Ten Tollywood Movies

2019 సంవత్సరంలో దాదాపు 100కి పైగానే తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో సుమారు 50 వరకు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే.. 150కి పైగా చిత్రాలు విడుదలైనా.. ప్రేక్షకుల మనసులను గెల్చుకున్న చిత్రాలు కేవలం పదుల సంఖ్యలోనే ఉండడం గమనార్హం.

దీన్ని బట్టి చూస్తూ.. ఈ సంవత్సరం కేవలం.. 10 శాతం మాత్రమే సక్సెస్ రేట్ కనిపిస్తోంది. మరి ఈ 10 శాతంలో నిజంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాలేమిటి? వాటి సక్సెస్ సీక్రెట్ ఏమిటి? మొదలైన విషయాలను మనం తెలుసుకుందాం

“ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి.. నెలరోజులు చాలు” – నటి ‘రాశి’ ఆసక్తికర లవ్ స్టోరీ ..!

F2

సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్  ప్రేక్షకులకు బాగానే వినోదం పంచడంతో.. 2019లో విజయం అందుకున్న తొలి చిత్రంగా  నిలిచిపోయింది. పైగా ఫన్ & ఫ్రస్ట్రేషన్ అంటూ ఆలుమగల మధ్య జరిగే సరదా విషయాలని తెరపైన చూపెట్టడంలో.. దర్శకుడు అనిల్ రావిపూడి  సక్సెస్ అయ్యాడు. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా & మెహ్రీన్‌లు తమ నటనతో ప్రేక్షకులను నిజంగానే ఆకట్టుకున్నారు.  ఈ చిత్రం నిర్మాతలకు వసూళ్ల వర్షం కురిపించింది

 

మజిలీ

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగ చైతన్య – సమంతలు  ‘మజిలీ’ చిత్రం ద్వారా.. 2019 సమ్మర్ సీజన్‌కి మరో సూపర్ హిట్ సినిమాతో స్వాగతం పలికారు. పాత్రల స్వభావాలకు దర్శకుడు పెద్దపీట వేయడంతో  పాటు.. ఈ కథలో ప్రధాన తారాగణం అద్భుతంగా నటించడంతో.. ఈ సినిమా  ప్రేక్షకుల మనసులని కూడా గెల్చుకోగలిగింది. 

 

చిత్రలహరి

వరుస అపజయాలతో కెరీర్‌లో కాస్త వెనుకబడిన సాయి ధరమ్ తేజ్‌కి.. ఈ ‘చిత్రలహరి’ చిత్రం ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో సాయి పోషించిన పాత్ర కూడా.. సక్సెస్ కోసం ఎదురు చూసే ఒక సగటు మనిషి పాత్రే కావడంతో.. సినిమా కూడా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో ఇది ఓ చెప్పుకోదగ్గ చిత్రంగా నిలిచిపోతుందనే చెప్పవచ్చు. దర్శకుడు కిషోర్ తిరుమల కూడా చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

 

జెర్సీ

ఇప్పుడున్న హీరోలలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న కథానాయకుడు నాని. అటువంటి నాని నుండి ఒక చిత్రం వస్తుందంటే.. అది కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం సినీ ప్రేక్షకుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని పదింతలు చేసే చిత్రం ‘జెర్సీ’. తండ్రీకొడుకుల బాంధవ్యాలను, భావోద్వేగాలను.. ఈ చిత్రం ద్వారా చాలా చక్కగా చూపించడంలో దర్శకుడు గౌతమ్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ చిత్రం క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ చేత కంటతడి పెట్టించకుండా ఉండవు.

 

మహర్షి

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా విడుదలైన ‘మహర్షి’ పై.. ప్రారంభ రోజు నుండే అనేక అంచనాలు ఉన్నాయి. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల అంచనాలను అందుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే మహేష్ బాబు కెరీర్‌లోనే గుర్తుండిపోయే చిత్రంగా మిగిలిపోయింది. 

 

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

ఈ సంవత్సరం ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకి వచ్చి.. ఘన విజయం సాధించిన చిత్రాలలో ‘ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి. బాలీవుడ్, టాలీవుడ్ నటుడు నవీన్ పోలిశెట్టి ఈ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమవ్వడం విశేషం. ఆసక్తిని కలిగించే కథ, కథనంతో పాటు.. నవీన్ పోలిశెట్టి నటన కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దాదాపు 1.5 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ 17.5 కోట్లు ఆర్జించడం గమనార్హం. 

‘ప్రేమించిన వాడితో పెళ్లికి.. 9 ఏళ్ళ పాటు నిరీక్షించిన అనసూయ’.. ఓ అందమైన ప్రేమకథ మీకోసం

 

బ్రోచేవారెవరురా

నేటి సమాజంలో సగటు మనిషి ఎదుర్కొనే దైనందిన పరిస్థితులను నేపథ్యంగా తీసుకొని.. వాటికి హాస్యాన్ని జోడించి అంతర్లీనంగా ఒక మెసేజ్‌‌ని అందిస్తూ రూపొందించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. నివేతా థామస్, శ్రీ విష్ణు, ప్రియదర్శి. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆద్యంతం అలరించేవిధంగా ఉంటూ.. మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. 

 

ఇస్మార్ట్ శంకర్

వరుస అపజయాలతో సతమతమవుతున్న దర్శకుడు పూరి జగన్నాధ్‌.. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ద్వారా మరోసారి విజయాల బాట పట్టగలిగాడు. హీరో రామ్ కూడా.. ఇంతకు ముందెన్నడు చేయని పాత్రలో ఈ సినిమాలో కనిపించాడు. పైగా ఈ సినిమాలో పూరి జగన్నాధ్ రాసిన సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి. రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఇస్మార్ట్ శంకర్’ నిలిచింది.

 

ఎవరు

ఈ ఏడాది విడుదలైన చిన్న సినిమాల్లో.. పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం ‘ఎవరు’. అడివి శేష్, రెజీనా, నవీన్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఒక మంచి థ్రిల్లర్ చిత్రంగా ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇక ఈ సినిమాలో నటీనటుల అభినయం, కథనం నిజంగానే ప్రేక్షకులను ఆకట్టుకొని.. తద్వారా చిత్రం కూడా మంచి విజయాన్ని  దక్కించుకుంది.

 

గద్దలకొండ గణేష్

ఒక పాత్ర కోసం తనని తాను ఎంతగానో మలచుకొని.. తర్వాత అదే పాత్ర స్వభావాన్ని దర్శకుడి కోణం నుండి చూస్తూ.. తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను అందించారు నటుడు వరుణ్ తేజ్. తమిళంలో విజయవంతమైన “జిగర్ తండా” చిత్రానికి రీమేక్‌గా రూపొందిన.. ఈ ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ తనదైన శైలిలో చిత్రీకరించి.. ఒక మంచి మాస్ చిత్రంగా దీనిని తెరకెక్కించగలిగాడు.

 

ఇవి 2019లో తెలుగులో విడుదలై.. విజయవంతమైన టాప్ 10 చిత్రాల వివరాలు.

యాడ్ షూట్‌లో కలిసి జీవితాంతం ఒకరికి ఒకరై : విరాట్ – అనుష్కల అద్భుత ప్రేమకథ ..!

Read More From Entertainment