Health

అవాంఛిత గర్భం రాకుండా చేసే.. ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు

Lakshmi Sudha  |  May 2, 2019
అవాంఛిత గర్భం రాకుండా చేసే.. ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు

సాధారణంగా గర్భం దాల్చకుండా ఉండటానికి చాలామంది మహిళలు కాంట్రాసెప్టివ్ పిల్స్ (గర్భ నిరోధక మాత్రలు), Birth Control Pills (గర్భ నియంత్రణ మాత్రలు) ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు పిల్స్ మరచిపోవడం లేదా ముందు జాగ్రత్త తీసుకోకపోయినా.. లేదా కండోమ్ వాడకపోయినా.. గర్భం వస్తుందేమోననే భయం ఉంటుంది.

అలాంటి సందర్భాల్లో ఇంటి చిట్కాలు (home remedies) పాటించడం ద్వారా అవాంఛిత గర్భం (unwanted pregnancy) రాకుండా చూసుకోవచ్చు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోననే భయం కూడా ఉండదు. దాని కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం..

పచ్చి బొప్పాయి:

కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు రోజుకి రెండు సార్లు చొప్పున.. మూడు నుంచి నాలుగు రోజుల పాటు పచ్చి బొప్పాయి తినడం వల్ల అవాంఛిత గర్భం దాల్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ బొప్పాయిని పురుషులు తినడం ద్వారా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందట. కాబట్టి ప్రస్తుతం పిల్లలు కనే విషయంలో తొందరేమీ లేదనుకొనేవారు రోజూ బొప్పాయి తినడం వల్ల వారి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.

బొప్పాయి తినడం ఆపేయగానే.. స్పెర్మ్ కౌంట్ యధావిధిగా పెరుగుతుంది. అయితే బాగా ముగ్గిన బొప్పాయి కాకుండా కాస్త పచ్చిగా ఉన్నది తినడం మంచిది. పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రొజెస్టిరాన్ విడుదలవకుండా చేస్తుంది. ఈ హార్మోన్ గర్భధారణకు తగినట్టుగా గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది. పచ్చిబొప్పాయి తినడం వల్ల ఈ హార్మోన్ విడుదల అవదు కాబట్టి.. గర్భం దాల్చే అవకాశం ఉండదు.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కను కూడా అవాంఛిత గర్భం రాకుండా వాడవచ్చు. అయితే ఇది సత్వరమే ఫలితాన్నివ్వదు. కాబట్టి  ఎక్కువ రోజులు ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెలసరి మొదలైన తర్వాత నుంచే దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల ఎక్కువ లాభం కలుగుతుంది. దాల్చిన చెక్క గర్భాశయాన్ని ప్రేరేపించడం ద్వారా గర్భస్రావం అయ్యేలా చేస్తుంది. కాబట్టి గర్భనియంత్రణ కోసం ఈ చిట్కాను పాటించే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహాను తీసుకోవడం మరచిపోవద్దు.

అల్లం:

రోజుకి రెండు కప్పుల అల్లం టీ తాగడం ద్వారా గర్భం దాల్చకుండా చూసుకోవచ్చు. అల్లం పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అల్లం ముక్కను బాగా కడిగి దాన్ని సన్నని ముక్కలుగా కోయాలి లేదా తురమాలి. దీన్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరగనివ్వాలి. దీన్ని వడపోస్తే జింజర్ టీ రెడీ అయిపోతుంది.

కొత్తిమీర:

కొత్తిమీర సైతం అవాంఛిత గర్భం రాకుండా చూస్తుంది. పైగా ఇది ఎప్పుడూ మనకు అందుబాటులోనే ఉంటుంది. దీన్ని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సైతం ఉండవు. కాబట్టి..దీన్ని నిరభ్యంతరంగా గర్భనియంత్రణ కోసం ఉపయోగించవచ్చు. కొత్తిమీరతో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం ద్వారా గర్భం దాల్చకుండా చూసుకోవచ్చు.

ఆప్రికాట్(ఖుబానీ)

Image: Shutterstock

ఆప్రికాట్ తినడం ద్వారా అండం శుక్రకణంతో కలసి ఫలదీకరణం చెందకుండా ఉంటుంది. సెక్స్‌లో పాల్గొన్న అనంతరం ఐదు నుంచి 10 ఆప్రికాట్లను తినడం ద్వారా గర్భం రాకుండా చూసుకోవచ్చు. ఇలా పీరియడ్స్ వచ్చేవరకు తింటే సరిపోతుంది. అలాగే వంద గ్రాముల ఆప్రికాట్‌ను కప్పు నీటిలో వేసి రెండు చెంచాల తేనె కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని తాగడం ద్వారా కూడా అవాంఛిత గర్బం రాకుండా చూసుకోవచ్చు.

వీటితో పాటు వేప, అంజీర్, ఇంగువ, విటమిన్ సి వంటివి కూడా గర్భం రాకుండా చేస్తాయి.

పైన మనం చెప్పుకొన్న ఆహార పదర్థాల వల్ల గర్భం రాకుండా ఉండటంతో పాటు గర్భస్రావం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి.. గర్భం దాల్చినవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

సహజమైన గర్భ నియంత్రణ పద్ధతులు పాటించేటప్పడు చేయాల్సినవి:

సహజమైన గర్భ నియంత్రణ పద్ధతులు పాటించేటప్పుడు చేయకూడనివి:

Running Images: Pixabay

ఇవి కూడా చదవండి:

ఆ మాత్రలు గర్భం రాకుండా ఆపుతాయా? వాటిని ఉపయోగించడం శ్రేయస్కరమేనా?

గర్భిణిలూ.. మీ శరీరంలో వస్తున్న మార్పులను ప్రేమించండి..!

Period Tracker.. పీరియడ్స్ గురించి ఏం చెబుతుందో తెలుసా?

Read More From Health