Diet

గర్భిణులు ‘కుంకుమ పువ్వు’ కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా..?

Babu Koilada  |  Jan 16, 2020
గర్భిణులు ‘కుంకుమ పువ్వు’ కలిపిన పాలు తాగితే.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా..?

(Health Benefits of Saffron)

గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడం వల్ల.. బిడ్డలు ఎర్రగా, ఆరోగ్యంగా పుడతారని అంటుంటారు. పాతకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ఈ చిట్కాకు సంబంధించి ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేవని అంటున్నారు నిపుణులు. అయితే కుంకుమ పువ్వులో ఉండే ఔషధ గుణాలు చాలా మహత్తరమైనవని పలు ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మన రక్తాన్ని శుద్ది చేయడంలో కుంకుమ పువ్వు ప్రధానమైన పాత్ర పోషిస్తుందట.

బాదం పప్పు తింటే.. ఉండదు మన ఆరోగ్యానికి ముప్పు

అంతే కాదు.. మన జీర్ణ కోశాన్ని శుభ్రపరిచే అద్భుతమైన శక్తి కుంకుమ పువ్వుకి ఉందట. ఇక గర్భిణుల విషయానికి వస్తే కుంకుమ పువ్వు వల్ల వారికి కొన్ని అదనపు ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా నొప్పులను, తిమ్మిరిని నివారించే గుణాలు కలిగి ఉండడం వల్ల వారికి దీని వల్ల కలిగే ఉపశమనం చాలా ఎక్కువ. అలాగే నిద్రలేమితో బాధపడే గర్భిణులు, పాలలో కుంకుమ పువ్వును అతి తక్కువ మోతాదులో కలుపుకొని తాగితే మంచిదని అంటారు. అలాగే సుఖ ప్రసవానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుందట. అయితే కొంతమంది హోమియా వైద్యులు మాత్రం గర్భిణులు ఐదవ నెల నుండి మాత్రమే కుంకుమ పువ్వును వాడడం మంచిదని అంటున్నారు.

అమ్మాయిలూ.. యోని ఆరోగ్యానికి ఇవి పాటించండి..

ఏదేమైనా.. ఇలాంటి చిట్కాలు పాటించేముందు డాక్టరును లేదా వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతైనా శ్రేయస్కరం. అలాగే కుంకుమ పువ్వు అనేది చాలా ఖరీదైన దినుసు. కాబట్టి.. దీని విషయంలో మాత్రం ప్రభుత్వ ఆమోదం పొందిన లైసెన్స్డ్ ట్రేడ్ మార్క్ గల కంపెనీ ఉత్పత్తులనే వాడడం మంచిది. అలాగే కుంకుమ పువ్వు కల్తీని కనిపెట్టడం కూడా చాలా సులువు. నాణ్యమైన కుంకుమ పువ్వు నారింజ లేదా ఎరుపు చివర్లతో రక్త వర్ణంలో ఉంటుంది. అదే కల్తీదైతే.. దానిలో తెలుపు లేదా పసుపు ఛాయలు కనిపిస్తాయి.                               

మీకో విషయం తెలుసా..? కుంకుమ పువ్వును పండించడం కూడా చాలా ఖరీదైన ప్రక్రియే. ఒక కిలో కుంకుమ పువ్వును తయారుచేయాలంటే.. కనీసం 2 లక్షల పూల ముడిసరుకు అవసరమవుతుంది. అలాగే కుంకుమ పువ్వులను అందించే మొక్కలను చాలా శ్రద్ధగా పెంచాలి. దీని రుచి కొంచెం చేదుగా, కొంచెం తీపిగా ఉంటుంది. భారతదేశంలో కుంకుమ పువ్వును అత్యధికంగా పెంచే ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ పేరొందింది. అలాగే టర్కీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలలో కూడా దీనిని బాగానే సాగు చేస్తారు.

ఆయుర్వేదం.. మేని అందానికి చక్కటి ఔషధం..!

ఉత్తరాదిలో కుంకుమ పువ్వును ‘కేసర్’ అంటారు. నేడు సౌందర్య ఉత్పత్తులతో పాటు ఆయుర్వేద వైద్య ఉత్పత్తులలో కూడా కుంకుమ పువ్వు అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తోంది. పూర్వకాలంలో కేవలం రాచరిక కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఉత్పత్తి.. నేడు సామాన్య జనాల దరికి కూడా చేరింది. ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరు గాంచినా కూడా.. అనేకమంది తమకు పిల్లలు మంచి రంగుతో పుట్టాలనే కోరికతో ఈ దినుసును కొనుగోలు చేయడం విశేషం. కుంకుమపువ్వు మొక్క చూడ్డానికి ఉల్లి లేదా ఎర్ర లిల్లీ మొక్కలా ఉంటుంది.

Images: Pixabay

2020 సంవత్సరాన్ని సరికొత్త ప్రణాళికలతో కూల్‌గా ప్రారంభించండి. స్టేట్‌మెంట్ మేకింగ్ స్వీట్ షర్టులు మీకోసమే 100% సిద్ధంగా ఉన్నాయి… అలాగే 20% అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. POPxo.com/shop ను సందర్శించేయండి                        
 

 

 

Read More From Diet