Real Bride Inspirations

పెళ్లి సమయంలో ధరించే దుస్తులు, నగలు ఎలా ఉండాలంటే..? (నవ వధువుల చిట్కాలు)

Lakshmi Sudha  |  Jul 17, 2019
పెళ్లి సమయంలో ధరించే దుస్తులు, నగలు ఎలా ఉండాలంటే..? (నవ వధువుల చిట్కాలు)

కల్యాణ తిలకం, నుదుటిన బాసికం, చెవులకు అందమైన జుంకాలు, మెడలో బంగారు ఆభరణాలు, ముచ్చటైన పట్టుచీర, నడుముకి వడ్డాణం, కాళ్లకు వెండి పట్టీలు, పాదాలకు పారాణి.. ఇదీ తెలుగింటి పెళ్లికూతురి ఆహార్యం. చూడగానే ఎంత బాగుందో అనిపించేంత అందంగా తయారవుతుంది వధువు. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపించే కాంతి, కళకు ఏదీ సాటిరాదు.  మరి కొన్ని రోజుల్లో శ్రావణమాసం రానుంది. అంటే ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువగానే జరుగుతాయి. ఇక సందడంతా పెళ్లికూతుళ్లదే.

అసలు పెళ్లికి (marriage)  కొన్నిరోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. పెళ్లి రోజు కట్టుకునే చీరలు కొనడం, దానికి తగిన మ్యాచింగ్ డిజైనర్ బ్లౌజులు కుట్టించుకోవడం, నచ్చిన నగలు చేయించుకోవడం ఇలా పెళ్లికి రెండు నెలల ముందు నుంచే కొత్త పెళ్లికూతుళ్ల (brides) హడావుడి మొదలవుతుంది. ఇదంతా ఒకవైపు.. మరో వైపు కాస్త టెన్షన్, మరికాస్త అయోమయంగా అనిపిస్తుంటుంది.

ఎందుకంటే.. పెళ్లి రోజు తాను కట్టుకున్న చీర తనకు నప్పుతుందా? ఆ చీరలో తాను అందంగా కనిపిస్తుందా? తాను వేసుకున్న నగలు(jewellery)  చీరకు మ్యాచింగ్ అవుతాయా? ఇలాంటి సందేహాలుంటాయి. ఆ సందేహాలు తొలగిపోవడంతో పాటు.. ఫ్యాషనబుల్ పెళ్లికూతురిలా కనిపించాలంటే.. కొంతమంది నవవధువులు ఫాలో అయిన వెడ్డింగ్  ఫ్యాషన్ గురించి తెలుసుకోవాల్సిందే.

రాజసం ఒలికించేలా..

Instagram

హెవీ ఎంబ్రాయిడరీ అంచులున్న కంచి పట్టు చీరకు.. మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌లో ఎంతో అందంగా ఉంది కదా ఈ పెళ్లికూతురు. మెడలో వేసుకున్న ఎరుపు రంగు రాళ్ల నెక్లెస్, మామిడి పిందెల హారం, కాసుల పేరుతో రెట్రో లుక్‌లో రాజసంగా మెరిసిపోతోంది.

చీర కుచు డిజైన్

ఎవర్ గ్రీన్ కాంబినేషన్‌లో అందంగా

Instagram

గులాబీ, నీలం రంగు ఎవర్ గ్రీన్ కాంబినేషన్లో రూపొందిన ఈ కంచి పట్టు చీరలో మెరిసిపోతున్న ఈ నవవధువుని చూస్తే చాలా ముగ్థమనోహరంగా కనిపిస్తోంది కదా. హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్.. సింపుల్ గా ఉన్న చీరను బ్యాలెన్స్ చేస్తోంది. ఇటీవలి కాలంలో వివాహ సమయంలో టెంపుల్ జ్యుయలరీ వేసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం డిజైనర్ నగలు ధరించింది.

సింపుల్‌గా ఉన్నా.. సూపర్బ్‌గా

Instagram

సాధారణంగా చీర సింపుల్ గా ఉంటే.. జాకెట్ పై ఎంబ్రాయిడరీ కాస్త హెవీగా ఉండేలా చూసుకుంటారు. అలా అంటే.. చీర, బ్లౌజ్ కి మధ్య బ్యాలెన్స్ చక్కగా కుదురుతుందని భావిస్తారు. కానీ వాటికి భిన్నంగా ఈ పెళ్లికూతురు సింపుల్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ ధరించింది. అయినా చాలా బ్యాలెన్స్డ్ లుక్ లో అందంగా కనిపిస్తోంది కదా. దీనికి తోడు ఈమె ధరించిన డిజైనర్ బంగారు నగలు సైతం ఆమె అందాన్ని మరింత పెంచుతున్నాయి.

మల్టిపుల్ నెక్లెస్‌లతో మ్యాజిక్

Instagram

ఎక్కువ ఆభరణాలు ధరిస్తే కాస్త అతిగా కనిపిస్తుంది. వాటిని సరిగా అలంకరించుకోకపోతే.. లుక్ మొత్తం పాడైపోతుంది. కానీ ఈ పెళ్లి కూతురుని చూడండి. మల్టిపుల్ నెక్లెస్ లు ధరించినా చూడటానికి ఎంత మనోహరంగా కనిపిస్తుందో కదా. వేర్వేరు పొడవులున్న డైమండ్ నెక్లెస్ లు, హారాలను చక్కగా పెయిర్ అప్ చేసి ప్రత్యేకమైన స్టైల్ తో మెరిసిపోతుంది.

వజ్రాల నగలతో వైబ్రంట్ లుక్

Instagram

సాధారణంగా తెలుగింటి నవవధువులు బంగారు నగలనే ధరించడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ పెళ్లి కూతురు మాత్రం వజ్రాల హారం, నెక్లెస్ ను వేసుకొచ్చింది. లేత నారింజ రంగులో ఉన్న చీరకు కాస్త ముదురు రంగులో ఉన్న ఆరెంజ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ధరించింది. ఆమె ధరించిన నగల దగ్గర నుంచి దుస్తుల వరకు అన్నింటిలోనూ భారీతనం కనిపిస్తున్నా.. వధువు మాత్రం చాలా సింపుల్ గా కనిపించడం విశేషం.

సింపుల్‌గా.. సూపర్బ్‌గా..

Instagram

పెళ్లి కూతురంటే.. భారీగా ఎంబ్రాయిడరీ చేసిన చీరలు కట్టుకోవక్కర్లేదు. పెద్ద మొత్తంలో నగలు ధరించాల్సిన అవసరం లేదని చెబుతోంది ఈ వధువు. చాలా సింపుల్ గా రెడీ అయినా.. చాలా అందంగా కనిపించవచ్చని నిరూపించింది.

తెలుపు చీరలో మెరిసిపోతూ..

Instagram

పెళ్లి సమయంలో తెలుపు చీర కట్టే సంప్రదాయం కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. ఆ చీరకు తగినట్లుగా మన నగలు ఉంటేనే బాగుంటుంది. ఈ పెళ్లికూతురుని చూస్తే తెల్ల చీరపై ఎలాంటి నగలు వేసుకోవాలో ఓ ఐడియా వస్తుంది. తాను ధరించిన చీరకు నప్పేలా కుట్టుపూసల హారం, నెక్లెస్ ధరించి అందంగా మెరిసిపోతుంది.

డిజైనర్ పెళ్లి పట్టు చీరలను అందించే టాప్ 10 బొతిక్స్ ఇవే..

 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.