Lifestyle

ఏడు రోజుల్లోనే అధిక బరువు తగ్గించే.. అద్భుతమైన డైట్ ప్లాన్ ఇది..! ( Weight Loss Diet In Telugu)

Lakshmi SudhaLakshmi Sudha  |  Mar 24, 2019
ఏడు రోజుల్లోనే అధిక బరువు తగ్గించే.. అద్భుతమైన డైట్ ప్లాన్ ఇది..! ( Weight Loss Diet In Telugu)

అధిక బరువు కారణంగా ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక రక్తపోటు,గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అందుకే వైద్యులు కూడా మంచి ఆరోగ్యాన్ని పొందాలంటే.. బరువు తగ్గమని సూచిస్తున్నారు. దీని కోసం చాలామంది వ్యాయామాలు చేస్తుంటారు. అయితే కేవలం వ్యాయామంతోనే కాకుండా.. మనం తీసుకొనే ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు. దీనికోసం నెలల తరబడి డైటింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు.

ఏడు రోజుల పాటు ప్రత్యేకమైన డైట్ ప్లాన్ పాటిస్తే సరిపోతుంది. ఈ డైట్ ప్లాన్‌లో భాగంగా ఏడురోజులు.. ప్రతి రోజు విభిన్నమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. హెల్త్ లైన్ వెబ్సైట్ ప్రకారం ఈ పద్ధతి ద్వారా.. 6.8 కేజీల వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడు రోజుల డైట్ ప్లాన్ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఏమైనా దుష్పలితాలు ఎదురవుతాయా? ఏడురోజుల్లో బరువు తగ్గడం సాధ్యమేనా? అనే అంశాలను మనం ఈ కథనంలో తెలుసుకొందాం.

7 డే డైట్ ప్లాన్ అంటే ఏమిటి?

ఏ రోజు ఏం తినాలి?

7 డే డైట్ ప్లాన్‌లో మీరు చేయాల్సినవి, చేయకూడనివి

7 డే డైట్ వల్ల ఎలాంటి ఫలితం కనిపిస్తుంది?

7 డే డైట్ ప్లాన్ అంటే ఏమిటి? (What is a 7 Day Weight Loss Diet Plan?)

7 డే డైట్ ప్లాన్‌ను (7 day diet plan)  జీఎమ్ డైట్ ప్లాన్ అని పిలుస్తారు. జీఎమ్ అంటే జనరల్ మోటార్స్. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటం కోసం ఈ డైట్ ప్లాన్‌ను రూపొందించారు. దీనివల్ల వారి ఆరోగ్యం మెరుగ్గా ఉండి.. చురుగ్గా పనులు పూర్తిచేయగలుగుతారనే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిని అనుసరించిన ఉద్యోగులు తమ బరువు తగ్గడంవల్ల.. ఆరోగ్యంగా ఉండటంతో పాటు వారిలో పనిసామర్థ్యం, ఏకాగ్రత పెరిగాయని తెలిపారు. అంతేకాదు వారి ఆత్మవిశ్వాసం మరింత మెరుగుపడిందని కూడా తెలిపారు. అలాగని ఇది మరీ కఠినంగా ఉండే డైట్ ప్లాన్ ఏమీ కాదు. చాలా సులువుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం తింటూనే శరరీంలోని కొవ్వు కరిగించుకోవచ్చు. ఈ డైట్‌లో పండ్లు, బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్ ఉంటాయి.

బ‌రువు స‌మ‌స్య‌ను ఎదుర్కోవ‌డం ఎలా? (Healthy Weight Gain Tips In Telugu)

ఏ రోజు ఏం తినాలి? (What Should I Eat During Diet For Weight Loss?)

జీఎమ్ డైట్ ఏడు రోజులకు వర్తిస్తుంది. ప్రతిరోజూ విభిన్నమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు డైట్‌తో పాటు.. కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసులు నీరు తాగడం చాలా ముఖ్యం. అవసరం కూడా. Weight loss ప్రయాణంలో మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ డైట్ చేసేటప్పుడు మొదటి మూడు రోజులు వ్యాయామానికి దూరంగా ఉండటం తప్పనిసరి. ఇక డైట్‌లో భాగంగా ఏ రోజు ఏ ఆహారం తినాలో తెలుసుకొందాం.

మొదటి రోజు (First Day)

గుర్తుంచుకోవాల్సిన విషయం: మొదటి రోజు పూర్తిగా పండ్లనే ఆహారంగా తీసుకోవాలి. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్డు మొదలైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. నూనెతో చేసిన ఆహారపదార్థాలు, పాలు, పాల పదార్థాలు, మిల్క్ షేక్స్, ఐస్ క్రీం.. ఇలా వేటినీ ఆహారంగా తీసుకోకూడదు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. పండ్లు ఆహారంగా తీసుకొంటున్నాం కాబట్టి..  ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు అనుకొంటే పొరపాటే. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు.

బరువు తగ్గడానికి ఇంట్లో చేయదగిన వ్యాయామాలు

ఎప్పుడు ఏది తినాలి? (What To Remember)

  1. అల్పాహారం: గిన్నెడు మిక్స్డ్ బెర్రీస్ లేదా యాపిల్
  2. స్నాక్/బ్రంచ్: గిన్నెడు కర్భూజా ముక్కలు
  3. లంచ్: యాపిల్
  4. స్నాక్:  కప్పు పుచ్చకాయముక్కలు
  5. డిన్నర్: ఆరెంజ్ లేదా యాపిల్
  6. స్నాక్: గిన్నెడు కర్భూజా ముక్కలు
  7. పండ్లను తీసుకొన్న ప్రతిసారి  ఒకటి నుంచి రెండు గ్లాసుల నీరు తీసుకోవడం ముఖ్యం. కచ్చితంగా ఈ కొలతల్లోనే ఆహారం తీసుకోవాలనే నియమం లేదు కాబట్టి మీ ఆకలి తీరేంత వరకు పండ్లను తినడం మంచిది.

7 డే డైట్ ప్లాన్‌లో (Diet Plan) మొదటి రోజు పూర్తయ్యేసరికి మీ శరీరంలోని టాక్సిన్లు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.

రెండో రోజు (Second Day)

గుర్తుంచుకోవాల్సిన విషయం: బరువు తగ్గించుకోవడం మన ప్రధాన గమ్యం కాబట్టి.. ఈ రోజు పూర్తిగా పచ్చి లేదా ఉడకబెట్టిన కూరగాయలను మాత్రమే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూరగాయలను వేయించి తినకూడదు. వెజిటబుల్ సలాడ్‌లో ఫ్లేవర్ కోసం నూనె ఉపయోగించాల్సి వస్తే..కొద్ది మొత్లంలో ఆలివ్ నూనె మాత్రమే ఉపయోగించండి. ఈ రోజు ఆహారంలో పండ్లను భాగంగా చేసుకోకూడదు. పాలు, పాల పదార్థాలు, పండ్ల రసాలు, స్మూతీస్, కూల్ డ్రింక్స్, మాంసాహారానికి దూరంగా ఉండాలి. బంగాళాదుంప తినచ్చు అన్నారు కదా అని.. డీప్ ఫ్రై చేసిన ఆలూ చిప్స్ మాత్రం తినకండి. దానివల్ల జరిగే మేలు కంటే చెడే ఎక్కువగా ఉంటుంది.

ఎప్పుడు ఏది తినాలి? (What To Remember)

  1. బ్రేక్ ఫాస్ట్: గిన్నెడు ఉడకబెట్టిన బంగాళాదుంపలు
  2. స్నాక్/బ్రంచ్: ఉడకబెట్టిన క్యారెట్లు
  3. లంచ్: ఉడకబెట్టిన బ్రొకోలి(బ్రొకోలీని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆవిరిపై ఉడకబెట్టుకోవాలి).
  4. స్నాక్: గిన్నెడు చెర్రీ టమాటాలు
  5. డిన్నర్: ఉడకబెట్టిన కాలీఫ్లవర్
  6. స్నాక్: కీరదోస

విభిన్న రకాల రుచులతో తినేవారు ఒక్కసారిగా ఇలా ఉడకబెట్టిన కూరగాయలు తినాలంటే చాలా ఇబ్బందే. అయినా తప్పదు. ఈ కూరగాయలపై కాస్త  పెప్పర్ జల్లుకొని తింటే వాటి రుచి కాస్త పెరుగుతుంది. రెండో రోజు సైతం కచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాల్సిందే.

రెండో రోజు పూర్తయ్యేసరికి మీకు కాస్త నీరసంగా అనిపించవచ్చు. చాలా తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం దీనికి కారణం. ఈ రోజు కూడా వ్యాయామం చేయకపోవడమే మంచిది.

మూడో రోజు (Third Day)

గుర్తుంచుకోవాల్సిన విషయం: బరువు తగ్గించుకొనే క్రమంలో మీ ప్రయాణం మూడో రోజుకి చేరింది. అచ్చంగా కూరగాయలు, పండ్లు తినడం వల్ల మీ నాలుక రుచుల కోసం ఆరాటపడవచ్చు. కానీ బరువు తగ్గాలనే మీ కోరికను తరచూ గుర్తు చేసుకోవడం మంచిది. మొదటి రెండు రోజులు ఏ ఆహార పదార్థాలు, పానీయాలకు దూరంగా ఉన్నామో ఈరోజు కూడా వాటికి దూరంగా ఉండాలి. వాటితో పాటు అరటి పండు, బంగాళాదుంపకు సైతం దూరంగా ఉండాలి.

ఎప్పుడు ఏది తినాలి? (What To Remember)

  1. బ్రేక్ఫాస్ట్: యాపిల్ లేదా కర్భూజాలో సగం
  2. స్నాక్/బ్రంచ్: టమాటాలు లేదా పైనాపిిల్
  3. లంచ్: పాలకూర, కీర, టమాటా, క్యారెట్లతో తయారు చేసిన వెజిటబుల్ సలాడ్
  4. స్నాక్: కమలాఫలం, కర్భూజాలో సగం
  5. డిన్నర్: స్ట్రాబెర్రీలు
  6. స్నాక్: ఉఢకబెట్టిన బ్రొకోలీ, బీట్ రూట్

వీటితో పాటుగా ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. మూడోరోజు తీసుకొన్న ఆహారం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. ముందు రెండు రోజులతో పోలిస్తే ఈ రోజు శరీరంలోకి కాస్త సత్తువ వచ్చి చేరినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఓ పదినిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయవచ్చు.

నాలుగో రోజు (Fourth Day)

గుర్తుంచుకోవాల్సిన విషయం: మొదటి మూడు రోజులు పూర్తిగా దూరంగా పెట్టిన అరటి పండ్లు, పాలే ఈ రోజు మీ ఆహారం. కాబట్టి రోజు గడిచేటప్పటికి మీకు కాస్త చిరాగ్గా అనిపించవచ్చు. తరచూ మీ మూడ్ మారిపోనూ వచ్చు. రోజంతా ఇవే తినాల్సి రావడం వల్లే ఇలా జరుగుతుంది. మిల్క్ షేక్లో ఆర్టిఫిషియల్ స్వీటనర్స్, చక్కెరకు బదులుగా తేనె మాత్రమే ఉపయోగించాలి.

ఎప్పడు ఏది తినాలి? (What To Remember)

  1. బ్రేక్ ఫాస్ట్: పెద్ద సైజులో ఉన్నరెండు అరటిపళ్లు, గ్లాసు పాలు
  2. లంచ్: రెండు అరటిపళ్లు, గ్లాసు పాలు
  3. డిన్నర్: రెండు అరటిపళ్లు, గ్లాసు పాలు

అరటిపళ్లు తక్షణ శక్తినిస్తాయి. దీనిలో ఉన్న పెక్టిన్ జీర్ణప్రకియ సులభంగా జరిగేలా చేస్తుంది. అలాగే దీనిలో పొటాషియం కూడా అధికంగానే ఉంటుంది. పాలల్లో క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. నాలుగోరోజు గడిచేసరికి మీలో మరింత ఉత్సాహం వచ్చి చేరుతుంది. కానీ ఆహారం విషయంలో మానసికంగా బలహీనమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం తప్పనిసరి.

ఐదో రోజు (Fifth Day)

గుర్తుంచుకోవాల్సిన విషయం: పండ్లు, దుంపలు, కొవ్వు కలిగిన పాలపదార్థాలు, కూల్ డ్రింక్స్ వంటివి ఈ రోజు మీరు దూరంగా ఉంచాల్సిన ఆహారపదార్థాలు. మాంసాహారం తినేవారు ఈ రోజు తాగాల్సిన నీటికి అదనంగా మరో రెండు గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. ఆహారం సిద్ధం చేసుకోవడానికి కొద్ది మొత్తంలో నూనె ఉపయోగించవచ్చు. వ్యాయామం చేయాలనుకొనేవారు ఈరోజు కూడా తేలికపాటి వ్యాయామాలకే పరిమితమవ్వడం మంచిది.

ఎప్పుడు ఏది తినాలి? (What To Remember)

  1. బ్రేక్ ఫాస్ట్: మూడు టమాటాలు, ఉడకబెట్టిన చిక్కుడు గింజలు
  2. లంచ్: కప్పు బ్రౌన్ రైస్ లేదా పావుకిలో చికెన్ లేదా చేపలు, టమాటా ఒకటి 
  3. డిన్నర్: బ్రౌన్ రైస్ లేదా పావుకిలో చికెన్ లేదా చేపలు, రెండు టమాటాలు
  4. స్నాక్: నూనె లేకుండా చికెన్ లేదా టమాటా సూప్

బ్రౌన్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థం ఉంటాయి. కాబట్టి సులభంగా జీర్ణమైపోతుంది. కోడిమాంసం, చేపల్లో లీన్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సైతం అధికంగా ఉంటాయి. ఈ నాలుగూ శరీరానికి చాలా మేలు చేస్తాయి. టమాటాల్లో ఉండే పీచుపదార్థం ఆహారం జీర్ణమవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఐదో రోజు పూర్తయ్యేసరికి మీ శరీరంలో కొత్త ఉత్సాహం వచ్చిచేరుతుంది.

ఆరో రోజు (Sixth Day)

గుర్తుంచుకోవాల్సిన విషయం: మీరు ఆహారంలో కూరగాయలను భాగంగా చేసుకోవాలనుకొంటే.. వాటిని ఉడకబెట్టి తినాల్సిందే తప్ప వేపుళ్ల జోలికి వెళ్లకూడదు. చికెన్ లేదా చేపలను 500 గ్రాములకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. ఈ రోజు కూడా బంగాళాదుంప, చిలగడదుంపకు దూరంగా ఉండాల్సిందే. ఈ రోజు మీరు వ్యాయామం చేసే సమయం కూడా పెంచుకోవచ్చు. జాగింగ్, వాకింగ్, పుషప్స్, బ్రీత్ ఎక్సర్‌సైజులు చేయొచ్చు. అలాగని మరీ ఎక్కువ సమయం వ్యాయామం చేయడం కూడా అంత మంచిది కాదు.

ఎప్పుడు ఏది తినాలి? (What To Remember)

  1. బ్రేక్ ఫాస్ట్: ఒక బౌల్ ఉడకబెట్టిన కూరగాయలు
  2. లంచ్: పావు కిలో గ్రిల్డ్ చికెన్ చేపలు లేదా కప్పు బ్రౌన్ రైస్(బ్రౌన్ రైస్‌తో పాటు కూరగాయలు, పండ్లు తినొచ్చు)
  3. డిన్నర్: ఉడకబెట్టిన కూరగాయలు, బ్రౌన్ రైస్ లేదా పావుకిలో చికెన్ లేదా చేపలు
  4. స్నాక్స్: మూడు నుంచి నాలుగు బేబీ క్యారెట్స్

కూరగాయలు, చికెన్, ఫిష్, బ్రౌన్ రైస్ శరీరానికి అవసరమైన పోషణను అందించడంతో.. ఈ రోజు మీరు మరింత ఉత్సాహంగా కనిపిస్తారు. 7 డే డైట్‌లో ఆరో రోజు పూర్తయ్యేసరికి మీ శరీరం స్లిమ్‌గా తయారవడం మీరు గమనిస్తారు.

ఏడో రోజు (Seventh Day)

గుర్తుంచుకోవాల్సిన విషయం: 7 డే డైట్ ప్లాన్‌లో ఇదే చివరి రోజు. ఈ రోజు కూడా మీరు మానసికంగా బలంగా ఉంటే మీరు కోరుకొన్న ఫలితం మీకు దక్కుతుంది. మిగిలిన అన్ని రోజుల మాదిరిగానే.. ఈ రోజు కూడా కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వెన్న తీయని పాలు, పాల పదార్థాలు, ఐస్ క్రీం, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాల్సిందే. కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసుల నీటిని తాగాల్సిందే.

ఎప్పుడు ఏది తినాలి? (What To Remember)

  1. బ్రేక్ ఫాస్ట్: బౌల్ బ్రౌన్ రైస్, పుచ్చకాయ ముక్కలు
  2. లంచ్: బౌల్ బ్రౌన్ రైస్‌తో పాటుగా ఉడకబెట్టిన బ్రొకోలి, కప్పు ఫ్రూట్ జ్యూస్
  3. డిన్నర్: బౌల్ బ్రౌన్ రైస్‌తో పాటు ఉడకబెట్టిన కూరగాయలు
  4. స్నాక్స్: పండ్లు, పండ్లరసాలు

ఏడోరోజు పూర్తయ్యేసరికి మీ శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పైగా మీ బరువు సైతం తగ్గుతుంది. ఈ రోజు నుంచి మీరు ఎక్సర్‌సైజ్ రొటీన్‌ను కంటిన్యూ చేయవచ్చు.

7 డే డైట్ ప్లాన్‌లో మీరు చేయాల్సినవి, చేయకూడనివి (Do’s & Don’t During Your Diet Plan)

ఇవి చేయండి(Do’s)

ఇవి చేయకండి (Don’ts)

7 డే డైట్ వల్ల ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? (Result Of The Diet Plan At The End)

ఈ డైట్ వల్ల చాలా తక్కువ సమయంలో ఆరు కేజీల వరకు బరువు తగ్గొచ్చు. నీరు అధికంగా తాగడం, ఆహారంలో పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల శరీరంలో టాక్సిన్లు బయటకు పోతాయి. ఫలితంగా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. పీచు పదార్థాలు, కార్బొహైడ్రేట్స్ ప్రధానంగా తీసుకొంటాం కాబట్టి శరీరంలోని కొవ్వులు తగ్గుముఖం పడతాయి.

ఈ డైట్ పాటించడం వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. అలాగే దుష్పలితాలు సైతం కలిగే అవకాశం లేకపోలేదు. తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకొంటాం. కాబట్టి శరీరంలో మెటబాలిజం ప్రక్రియ మందగించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా తక్కువ సమయంలో వేగంగా బరువు తగ్గొచ్చు. కానీ దీర్ఘకాల ప్రయోజనాలను పొందలేం. వారానికంటే ఎక్కువ రోజులు దీన్ని కొనసాగించడానికి ఉండదు. డైట్ ముగిసిన తర్వాత మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉంది.

హెచ్చరిక: 7 డే డైట్ ప్లాన్ పాటించే ముందు మీరు వైద్యులను సంప్రదించి వారి సలహా తీసుకోండి. దాని ప్రకారం నడుచుకోండి. ఏయే ఆహార పదార్థాలు డైట్‌లో చేర్చుకోవాలో తెలుసుకోవడానికి డైటీషియన్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

Images: Unsplash.com

ఇలా చేస్తే జిమ్ అవ‌స‌రం లేకుండానే.. బ‌రువు త‌గ్గొచ్చు..

సానియా మీర్జా 4 నెల‌ల్లో 22 కేజీల బ‌రువు త‌గ్గింది.. ఎలాగో తెలుసా..?

ప్ర‌పంచ సుంద‌రి ఫిట్‌నెస్ రహస్యాలేమిటో మీకు తెలుసా?

Read More From Lifestyle