Lifestyle

‘హ్యాపీ కపుల్’గా ఉండాలంటే.. ఈ రిలేషన్‌షిప్ సూత్రాలు పాటించాల్సిందే..!

Lakshmi Sudha  |  Jul 2, 2019
‘హ్యాపీ కపుల్’గా ఉండాలంటే.. ఈ రిలేషన్‌షిప్ సూత్రాలు పాటించాల్సిందే..!

అనుబంధం (Relationship) సుదీర్ఘ కాలం నిలిచి ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అనునిత్యం మారిపోతున్న నేటి పరిస్థితుల్లో.. కొన్ని బంధాలు స్వల్ప కాలంలోనే విఫలమవుతన్నాయి. కానీ కొంతమందిని చూస్తే మాత్రం ‘పెళ్లయి ఇంత కాలమైనా.. ఎంత సంతోషంగా ఉన్నారో కదా’ అనిపిస్తుంది.

వివాహమై చాలా కాలమైనా.. వారి మధ్య అనుబంధం అప్పుడే మొదలైనంత ప్రెష్‌గా కనిపిస్తుంది. అలాంటి వారినే ఆదర్శదంపతులని, హ్యాపీ కపుల్ (happy couple) అని పిలుస్తాం. అసలు వారి మధ్య ఇంత అనురాగం ఏర్పడటానికి కారణం ఏమై ఉంటుంది? ఇంత బిజీ లైఫ్‌లోనూ ఒకరితో ఒకరు సమయం ఎలా గడపగలుగుతున్నారు? వారి  రిలేషన్‌షిప్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.

వాస్తవ విరుద్ధమైన అంచనాలుండవు

భాగస్వామి విషయంలో ప్రతి ఒక్కరికీ కొన్ని ఊహలుంటాయి. అయితే కొన్నిసార్లు అవి వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఆదర్శదంపతులు లేదా రిలేషన్‌షిప్ విషయంలో సంతోషంగా ఉండేవారి మధ్య.. ఇలా వాస్తవ విరుద్ధమైన అంచనాలు ఉండవు. ఇద్దరూ ఒకరితో ఒకరు కలసి.. సమయాన్ని గడపడానికే ప్రాధాన్యమిస్తారు. సరదాగా కబుర్లు చెప్పుకొంటూ సంతోషంగా ఉంటారు. అలాగే ప్రతి చిన్న విషయానికీ గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించరు.

కలసి పని చేయడంలోనే ఆనందం

వాస్తవానికి హ్యాపీ కపుల్ ఏ పని చేసినా కలిసే చేస్తారు. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, వీకెండ్ ట్రిప్‌కు ప్లాన్ చేయడం.. ఇలా ఏదైనా సరే కలిసే చేస్తారు. అలాగే ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగిపోతుంటారు.

Giphy

‘నో ఫోన్’ పాలసీ ఫాలో అవుతుంటారు

ఈ మధ్య మొబైల్ ఫోన్ మన శరీరంలో ఓ అవయవంగా మారిపోయిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడటం, చాట్ చేసుకోవడం లేదా వీడియోలు చూస్తూ.. సమయం గడపడం వల్ల భాగస్వామితో సమయం గడపడానికే అవకాశం ఉండదు. ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చొని.. చెరో ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఫీడ్ చెక్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది?

సంతోషంగా జీవితాన్ని సాగించే దంపతులు ఇద్దరూ కలసి సమయం గడిపేటప్పుడు.. ఫోన్‌కి చాలా దూరంగా ఉంటారు. ఇద్దరూ కలిసి సినిమా చూడడం లేదా ఒకరినొకరు సరదాగా టీజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఇవి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత పెంచుతాయి.

గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు.

తమ భాగస్వామిని గౌరవించడం మాత్రమే కాదు.. తమ భాగస్వామి కుటుంబాన్ని, స్నేహితులను, వారి కెరీర్ ఛాయిస్‌ను.. ఇలా ప్రతి విషయాన్ని గౌరవిస్తారు. అలాగే దూరంగా ఉండాల్సిన విషయాల్లోనూ దూరంగా ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా తన భాగస్వామి తీసుకొనే నిర్ణయాల్లో కలగజేసుకోవడం లేదా వారు అడగకుండా తమ అభిప్రాయాన్ని చెప్పడం లాంటి పనులు చేయరు. ఎందుకంటే.. పర్సనల్ స్పేస్‌కున్న విలువ వారికి తెలుసు.

Giphy

క్షమాపణ అడగడానికి సిగ్గు పడరు

అప్పుడప్పడూ భాగస్వాముల మధ్య చిన్న చిన్న కలతలు చోటు చేసుకోవడం సహజం. ఆ సమయంలో కాస్త వెనక్కి  తగ్గి క్షమాపణ కోరితే కలతలు తొలగిపోతాయి. కానీ  చాలా మందికి ఈ విషయంలో అహం అడ్డొస్తుంది. హ్యాపీ కపుల్ విషయంలో అహం అన్న పదానికే చోటు లేదు. తమ భాగస్వామిని క్షమించమని అడగడాన్ని వారు చిన్నతనంగా భావించరు.

ఎక్కువ మాట్లాడుకుంటారు.

హ్యాపీ  కపుల్ తమకు సంబంధించిన అన్ని విషయాలను దాదాపుగా ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. తమ ఇష్టాయిష్టాల గురించి, అభిరుచుల గురించి చర్చించుకుంటారు. అంతేకాదు సమకాలీన అంశాల గురించి సైతం వారు చర్చించుకుంటారు.

Giphy

మంచి మాత్రమే కాదు చెడునూ అంగీకరిస్తారు

ప్రతి ఒక్కరిలోనూ కొన్ని మంచి లక్షణాలు, కొన్ని చెడు లక్షణాలుంటాయి. అలాగే సంతోషాలుంటాయి. ఇబ్బందులుంటాయి. సంతోషాన్ని మాత్రమే పంచుకొని బాధలను వదిలేస్తే అది అసలు ప్రేమబంధమే కాదు. కష్టసుఖాలు రెండింటిలోనూ ఒకరికొకరు తోడుగా నిలబడినప్పుడే అది నిజమైన బంధమవుతుంది. హ్యాపీ కపుల్ తమ భాగస్వామిలోని మంచి, చెడు లక్షణాలు రెండింటినీ అంగీకరిస్తారు.

తన నిఖా జరిపించే మహిళ కోసం.. ఎనిమిది నెలలు వెతికిందట ఈ అమ్మాయి..!

 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

Read More From Lifestyle