అనసూయ భరద్వాజ్ (Anasuya bharadwaj).. 33 ఏళ్ల వయసులోనూ తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఇటు వెండితెరపై కూడా ప్రత్యేక పాత్రల్లో మెరుస్తోన్న ముద్దుగుమ్మ. కానీ ఈ అమ్మడు ఫాలో అయ్యే ఫ్యాషన్స్ మాత్రం ఆమె వయసును తగ్గించి చూపిస్తాయి. ఒకసారి పూర్తిగా మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తే; మరోసారి రెట్రో ఫ్యాషన్స్‌తో అలనాటి సుందరీమణులను తలపిస్తుంది.
ఇంకోసారి.. సందర్భానికి తగినట్లుగా బంగారు బొమ్మలా మెరిసిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అనసూయ అంటే ఫ్యాషన్ విషయంలో ఆల్ టైం బెస్ట్ అని అనొచ్చు. మీరు గమనించారా.. ఈ అమ్మడు ఫాలో అయ్యే ఫ్యాషన్స్‌లో చాలావరకు చేనేత అవుట్ ఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అసలే వచ్చేది సమ్మర్.. మరి మనం కూడా కూల్‌గా ఉండేందుకు కాటన్, చేనేత వంటి ఫ్యాబ్రిక్స్‌నే కదా ఆశ్రయించేది.. అందుకే మరి.. ఈ అందాల భామ ఫాలో అయిన కొన్ని అందమైన ఫ్యాషన్స్‌ను మనమూ చూసేద్దామా..
ఇక్కత్.. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకునే చాలామంది ఎంపిక చేసుకునేందుకు వెనకాడే ఫ్యాబ్రిక్స్‌లో ఇదీ ఒకటి. ఎందుకంటే ఇది పాతకాలం నాటిదని.. దీనిని ధరించడం వల్ల ఓల్డ్ లుక్ లేదా వయసులో పెద్దవారిలా కనిపిస్తామని చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ చేనేతలో కూడా చక్కని చుక్కలా ఎలా మెరిసిపోవచ్చో అనసూయను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
ఒకసారి చేనేత చీరతో చక్కనమ్మని తలపిస్తే; మరోసారి చేనేతతో తయారు చేసిన ట్రెండీ అవుట్ ఫిట్‌లో పున్నమి చంద్రునిలా మెరిసిపోతుంది. అంతేనా.. రెట్రో ఫ్యాషన్స్‌లోనూ దానిని ఉపయోగిస్తుంది. కావాలంటే మీరే చూడండి. బిస్కట్ & బ్రౌన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ఫ్యాంట్- షర్ట్ కు బ్లూ కలర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన సూట్ ధరించి రెట్రో ఫ్యాషన్ లో ఎంత అందంగా మెరిసిపోతోందో!
ఇక్కత్‌తోనే కళ్లు చెదిరే ఫ్యాషన్స్‌ని సృష్టించవచ్చని చెప్పడానికి అనసూయ ధరించిన ఈ అవుట్ ఫిట్ కూడా ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పచ్చు. ట్రెండీగా ఉన్న టాప్, బాటమ్‌కు ఒక బెల్ట్, చున్నీ జత చేసిన ఈ అందాల భామ ఎంత స్టైలిష్ గా కనిపిస్తుందో మీరే చూడండి. పైగా ఈ ఫ్యాషన్‌ను కాలేజీ అమ్మాయిలు కూడా చాలా సులువుగా ఫాలో అవ్వచ్చు. ఏమంటారు??
చీర కట్టుకోవడానికి స్పెషల్ అకేషన్స్‌లో తప్ప అంతగా ఆసక్తి చూపరు నేటితరం అమ్మాయిలు. అప్పుడు కూడా ఏ సిల్క్ లేదా క్రేప్, జార్జెట్.. వంటి ఫ్యాబ్రిక్స్‌కే ఓటేస్తారు తప్ప చేనేత చీర వైపు అస్సలు చూడరు. కానీ అనసూయను చూస్తే ఎలాంటి అకేషన్‌లోనైనా మనల్ని చాలా స్పెషల్‌గా కనిపించేలా చేసేందుకు.. చేనేత కూడా సరైన ఎంపిక అనిపిస్తుంది. నమ్మడం లేదా?? అయితే ఈ ఫొటోను చూడండి. బ్రౌన్ & స్కై బ్లూ కలర్ కాంబినేషన్‌లో కుందనపు బొమ్మలా ఎంత అందంగా కనిపిస్తుందో అనసూయ..!
కాలేజీ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే ఈ ఫ్యాషన్‌ను కూడా అనసూయ ఇక్కత్ ఫ్యాషన్‌తో ఎంత స్టైలిష్‌గా మార్చేసిందో చూడండి. తెలుపు రంగు ప్లెయిన్ టాప్‌కు, బ్రౌన్ కలర్ ఇక్కత్ బాటమ్‌ని జత చేసి భలేగా మెరిసిపోయింది కదూ! ఇక ఈ అవుట్ ఫిట్‌కు జతగా ఈ అమ్మడు ధరించిన స్నీకర్స్, గ్లాసెస్ ఆమె లుక్‌ని మరింత క్యూట్‌గా కనిపించేలా చేస్తున్నాయి.
ఏంటి?? ఇక్కత్‌తో ట్రెండీ అవుట్ ఫిట్స్ అన్నారు.. అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా?? అయితే అనసూయ ధరించిన ఈ తెలుపు రంగులోని అవుట్ ఫిట్‌ని చూడండి. స్లిట్టెడ్ ఫ్రాక్‌కు హై హీల్స్, ఇయర్ రింగ్స్ జత చేసి మినిమల్ యాక్సెసరీస్ తోనే అందంగా మెరిసిపోయింది కదూ..!
లాంగ్ ఫ్రాక్స్.. లేదా ఫ్లోర్ లెంత్ టాప్స్ ఈ రోజుల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్. అనసూయ దానిని కూడా ఇక్కత్‌తో ఎంత అందంగా కనిపించేలా చేసిందో చూడండి. డార్క అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్‌తో రూపొందించిన ఈ అవుట్ ఫిట్‌లో అనసూయ అందం రెట్టింపైందని చెప్పచ్చు. కాదంటారా??
కాస్త మనసు పెట్టాలే కానీ ఇక్కత్‌ను దేనితో అయినా మిక్స్ చేసి ధరించవచ్చు. కావాలంటే అనసూయ ధరించిన ఈ అవుట్ ఫిట్ చూడండి. మీకే అర్థమవుతుంది. స్కర్ట్‌కు ఇక్కత్ స్లిట్టెడ్ టాప్‌ని జత చేసి కార్న్ బ్రైడ్ హెయిర్ స్టైల్‌తో పూర్తి మోడ్రన్ అమ్మాయిని తలపిస్తోంది కదూ!
అమ్మాయిలంతా ఎంతో ఇష్టంగా ధరించే జీన్స్‌కు సైతం ఇక్కత్‌ను జతగా ధరించవచ్చని మీకు తెలుసా?? బ‌్లూ జీన్స్‌కు బ్లాక్ కలర్ ప్లెయిన్ స్లీవ్ లస్ టాప్‌ని జత చేసి, దానిపై ఇక్కత్‌తో రూపొందించిన ఓవర‌్ కోట్ ధరించి ఎంత ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతోందో చూడండి.. అవుట్ ఫిట్‌కు జతగా ధరించిన సిల్వర్ జ్యుయలరీ దాని అందాన్ని మరింత ఇనుమడించేలా చేస్తున్నాయి.
Images: www.instagram.com/itsme_anasuya
ఇవి కూడా చదవండి
రష్మీ గౌతమ్ ఫ్యాషన్స్ .. సింపుల్ & స్టైలిష్.. మీరూ చూడండి..!
బ్లాక్ అండ్ వైట్.. ఆల్ టైం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంటే ఇదే.!
కాలేజ్ ఫంక్షన్స్‌లో.. ఈ శారీ లుక్స్‌తో అదరగొట్టేయండి..!