ర‌ష్మీ గౌత‌మ్ ఫ్యాష‌న్స్ .. సింపుల్ & స్టైలిష్.. మీరూ చూడండి..!

ర‌ష్మీ గౌత‌మ్ ఫ్యాష‌న్స్ .. సింపుల్ & స్టైలిష్.. మీరూ చూడండి..!

ర‌ష్మీ గౌత‌మ్ (Rashmi Gautam).. బుల్లితెర‌ను ఫాలో అయ్యే వారికే కాదు.. సినిమాలు ఎక్కువ‌గా చూసేవారికి కూడా ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఈ అమ్మ‌డు ఇచ్చే స్టేట్ మెంట్స్ కాస్త బోల్డ్‌గా ఉన్న‌ప్ప‌ట‌ికీ.. ఫాలో అయ్యే ఫ్యాష‌న్స్ మాత్రం భలే అనిపిస్తాయి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల‌ు, ఆఫీసుల‌కు వెళ్లే ఉద్యోగినులు వాటిని చ‌క్క‌గా ఫాలో కావ‌చ్చు. కాక‌పోతే చేయాల్సింద‌ల్లా.. అకేష‌న్‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్న అవుట్ ఫిట్‌ను ఎంపిక చేసుకోవ‌డ‌మే..! మ‌రి, ఈ అమ్మ‌డు అనుస‌రించిన కొన్ని టాప్ ఫ్యాష‌న్స్‌ను మ‌న‌మూ ఓసారి చూసేసి.. వాటిలో మ‌న‌కు న‌చ్చిన వాటిని ఫాలో అయిపోదామా..
 

 

 


View this post on Instagram


#nofilters #summeready styled by @duta_couture


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
ర‌ష్మి ధ‌రించిన ఈ బ్లాక్ క‌ల‌ర్ అవుట్ ఫిట్ చూశారా? ఫ‌్లోర‌ల్ ప్రింటెడ్ టాప్‌కు, ప్లెయిన్ బాట‌మ్ జ‌త చేసి సింపుల్ బ్రేస్ లెట్ తో ఎంత స్టైలిష్‌గా, కూల్‌గా, అందంగా మెరిసిపోతుందో! ఈ అవుట్ ఫిట్‌ను కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలే కాదు.. ఆఫీసుకు వెళ్లే మ‌హిళ‌లు కూడా నిస్సందేహంగా ఫాలో అవ్వ‌చ్చు. పైగా యాక్సెస‌రీస్ ఎక్కువ‌గా పెట్టుకోవాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌దు కాబ‌ట్టి సింపుల్‌గా మ‌న లుక్ ని పూర్తి చేసేయచ్చు. ఏమంటారు??
 

 

 


View this post on Instagram


Outfit by @duta_couture 💄 makeup @venugopalashwini Pic @sandeepgudalaphotography


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
అటు ఎరుపుకు, ఇటు ఆరెంజ్‌కు మ‌ధ్య‌లో ఉండే షేడ్ ఎలా ఉంటుందో తెలుసా?? ఇదుగో.. ర‌ష్మీ గౌత‌మ్ ధ‌రించిన లాంగ్ ఫ్రాక్ త‌ర‌హాలోనే ఉంటుంద‌ని చెప్ప‌చ్చు. ఇక ఈ అవుట్ ఫిట్ పై వ‌చ్చిన గోల్డ్ ప్రింట్స్ డ్ర‌స్ అందాన్ని మ‌రింత పెంచుతున్నాయి. చ‌క్క‌ని హెయిర్ స్టైల్ ఒక్క‌టి జ‌త చేసిన ర‌ష్మీని చూడండి.. ఎంత క్యూట్‌గా ఉందో..!
 

 

 


View this post on Instagram


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
బ్లాక్ క‌ల‌ర్ అంటే ఇష్ట‌ప‌డ‌ని అమ్మాయిలుంటారా చెప్పండి?? అందుకేగా క‌ల‌ర్ కాంబినేష‌న్స్‌లో కూడా బ్లాక్ ని చాలామంది భాగం చేసుకుంటూ ఉంటారు. ర‌ష్మీ కూడా అదే ఫాలో అయింది.. లెమ‌న్ ఎల్లో లెహెంగాకు బ్లాక్ క‌ల‌ర్ టాప్ జ‌త చేసి, దానికి న‌లుపు రంగులోని ఓవ‌ర్ కోట్‌ను జ‌త చేసి భ‌లే ఫ్యాష‌న‌బుల్ అనిపించుకుంది.
 

 

 


View this post on Instagram


#Dhee10 #wednesdaydancenight Pic by @kalyanchatha6840


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
కాలేజీలో మంచి పార్టీ జ‌రుగుతున్న‌ప్పుడో లేదా ఏదైనా హోట‌ల్లో ఆఫీస్ లంచ్/ పార్టీ వంటివి జ‌రిగిన‌ప్పుడో మ‌నం ధ‌రించే దుస్తులు కూడా ఫ్యాష‌న‌బుల్‌గా ఉండాల‌ని మ‌నం ఆరాట‌ప‌డ‌డం స‌హ‌జ‌మే క‌దా! ఇలాంట‌ప్పుడు ర‌ష్మీని ఫాలో అయిపోతే స‌రి.. అదేనండీ.. ప్లెయిన్ అవుట్ ఫిట్‌కు ఫ్లోర‌ల్ ఓవ‌ర్ కోట్ జ‌త చేసి, మ్యాచింగ్ ఫుట్ వేర్ ధ‌రిస్తే స‌రి..!


భిన్న‌మైన ప్రింట్స్ ధ‌రించాలంటే అది కాలేజీ అమ్మాయిల త‌ర్వాతే! న‌లుగురిలోనూ భిన్నంగా క‌నిపించాల‌నే ఆరాటంతో ర‌క‌ర‌కాల ప్రింట్స్‌ను ప్ర‌య‌త్నించడం మామూలే! మీరూ అంతేనా?? అయితే ర‌ష్మీ ధ‌రించిన అవ‌కాడో ప్రింటెడ్ అవుట్ ఫిట్ ని ఫాలో అయిపోండి.. భ‌లేగా ఉంటుంది.

ప్రింట్స్‌లో ఎన్ని ర‌కాలు వ‌చ్చినా.. యానిమ‌ల్ ప్రింట్స్ మాత్రం ఎప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ అనే చెప్పుకోవాలి. అందుకే ప్ర‌తిఒక్క‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో వాటిని ఎంచుకుంటూ ఉంటారు. ర‌ష్మీ కూడా అదే ఫాలో అయిన‌ట్లుంది. కాక‌పోతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేష‌న్‌లో ఆమె ధ‌రించిన అవుట్ ఫిట్ అందాన్ని మెడ‌లో ఉన్న చోకర్ మ‌రింత పెంచేస్తోంది.
 

 

 


View this post on Instagram


#Live #Love #Life #quirky #kiwiprint #rashmigautam


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
ఫ్రెష్ లుక్‌లో మెరిసిపోవాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా ఎంచుకునే క‌ల‌ర్ కాంబినేష‌న్ తెలుపు & ఆకుప‌చ్చ‌. కివీ ప్రింటెడ్ లెహెంగాకు ఎంబ్రాయిడ‌రీ ఉన్న వైట్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన ర‌ష్మీ చూడండి.. ఎంత అందంగా మెరిసిపోతోందో! సింపుల్‌గా ఇయ‌ర్ రింగ్స్‌తో త‌న లుక్‌ని పూర్తి చేసేసింది.

కొంత‌మంది అమ్మాయిలు/ మ‌హిళ‌ల‌కు స్క‌ర్ట్స్ ధ‌రించ‌డం అంటే చాలా ఇష్టం. అయితే చాలామంది ప్లెయిన్ క‌ల‌ర్స్‌లో ఉన్న స్కర్ట్స్‌నే ఎక్కువ‌గా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. కానీ కాస్త బోల్డ్‌గా అనిపించిన‌ప్ప‌టికీ మ‌ల్టీక‌ల‌ర్ స్క‌ర్ట్‌ని కూడా ప్ర‌య‌త్నించవ‌చ్చు. అదెలా అంటారా?? మ‌న క్యూట్ బ్యూటీ ర‌ష్మీని ఫాలో అయిపోవ‌డ‌మే ఇలా..!
 

 

 


View this post on Instagram


👗 @duta_couture 💃stylist @itsme_sru 📷 @sandeepgudalaphotography 💄 @venugopalashwini


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ఓ వైపు ఫ్యాష‌న‌బుల్‌గా క‌నిపిస్తూనే మ‌రోవైపు హుందాగా కూడా మెరిసిపోవాలి. ఈసారి ఇలాంటి సంద‌ర్భాలు మీకు ఎదురైన‌ప్పుడు ఒక్క‌సారి ఈ ఫ్యాష‌న్‌ను ప్ర‌య‌త్నించి చూడండి. ఎరుపు రంగు లెహెంగాకు బ్లాక్ క‌ల‌ర్ టాప్‌ను జ‌త చేసి, దానిపై గోల్డ్ వ‌ర్క్ ఉన్న ఓవ‌ర్ కోట్‌ని ధ‌రించి చూడండి. ఈ అవుట్ ఫిట్‌కు మ్యాచింగ్ హెయిర్ స్టైల్ కూడా ఉండాలి సుమా!
 

 

 


View this post on Instagram


Because I like symmetry 💗💓💕💞🎀🛍👚👛🌸


A post shared by Rashmi Gautam (@rashmigautam) on
జీన్స్‌ను ఇష్ట‌ప‌డ‌ని అమ్మాయిలుంటారా చెప్పండి?? కానీ జీన్స్‌తో కిల్లింగ్ లుక్స్ సొంతం చేసుకోవాలంటే అది కొంద‌రికే సాధ్యం. అలాంటి అతికొద్దిమందిలో ర‌ష్మీ కూడా ఒక‌రు. మీరే చూడండి.. బ్లూ క‌ల‌ర్ జీన్‌కు, బ్లాక్ టాప్ జ‌త చేసిన ఈ అమ్మ‌డు దానికి జ‌త‌గా పింక్ క‌ల‌ర్ సూట్‌తో భ‌లే అందంగా క‌నిపిస్తోంది క‌దూ! పైగా పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ ఇంకా బాగా న‌ప్పింది.


 ఇవి కూడా చ‌ద‌వండి


బ్లాక్ అండ్ వైట్.. ఆల్ టైం బ్యూటిఫుల్ క‌ల‌ర్ కాంబినేష‌న్ అంటే ఇదే.!


ఫ్యాష‌న్ క్వీన్ సోన‌మ్ క‌పూర్ అవుట్ ఫిట్స్ చూశారా??


అమ్మ చీర‌తో అందంగా ఇలా..