Bollywood

అందుకే తొందరగా పెళ్లి చేసుకున్నా: అనుష్క శర్మ

Soujanya Gangam  |  Jul 17, 2019
అందుకే తొందరగా పెళ్లి చేసుకున్నా: అనుష్క శర్మ

మనం ఎవరినైనా ప్రేమిస్తేనే.. అందులో ఉన్న మ్యాజిక్ తెలుస్తుందంటారు చాలామంది. అయితే నిజమైన ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. సరైన వ్యక్తి దొరికితే పెళ్లి (Marriage) చేసుకోవడానికి.. సరైన వయసు కూడా అక్కర్లేదు. ఈ విషయాన్ని నిరూపిస్తూ అద్భుతంగా అచ్చం కథల్లో రాజకుమారిలా వివాహమాడింది అనుష్కా శర్మ (anushka sharma). డిసెంబర్ 11, 2017 తేదిన మనందరి ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కొహ్లీని వివాహం చేసుకున్న ఈ బ్యూటీ వివాహం.. ఇప్పటికీ అందరి మనసుల్లో నిలిచిపోయింది. ముఖ్యంగా వీరిద్దరి గులాబీ రంగు దుస్తులు.. అనుష్క అందమైన మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ ఇప్పటికే ఆ పెళ్లిని ఫెయిరీటేల్ వెడ్డింగ్‌గా చెప్పుకునేలా చేశాయి.

Instagram

పెళ్లి తర్వాత నాకు సినిమా ఆఫర్లు తగ్గాయి : సమంత

అలాగే పెళ్లికి ముందు తమ బంధం గురించి ఎప్పుడూ మీడియాతో మాట్లాడని అనుష్క, విరాట్‌లు తమ పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పెళ్లయి ఒకటిన్నర సంవత్సరం పూర్తవుతున్నా.. ఈ జంట పెళ్లి నిన్నో.. మొన్నో అయినట్లుగా అనిపిస్తుంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ అలాంటిది. అనుష్క 29 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంది.

ఇండస్ట్రీలో ఇంత తక్కువ వయసులో పెళ్లి చేసుకున్న కథానాయికలు చాలా కొద్దిమందే. హీరోయిన్‌కి పెళ్లయితే.. కెరీర్ అక్కడితో ఆగిపోతుందని ఇండస్ట్రీలో ఇప్పటివరకూ ఆలోచన ఉండేది. చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత.. ఇండస్ట్రీకి దూరం కావడం కూడా దీనికి కారణం కావచ్చు. అందుకే చాలామంది కథానాయికలు.. 30 పైబడిన తర్వాతే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. కానీ అనుష్క మాత్రం 29 సంవత్సరాలకే వివాహం చేసుకుంది.

దీని గురించి ఈ అందాల కథానాయిక ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. “మన అభిమానుల ఆలోచనా తీరులు మారుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్లను కేవలం సినిమాలో ఉన్నట్లుగానే చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. మా వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుతుందో కూడా వాళ్లు పట్టించుకోవట్లేదు.

మీరు పెళ్లి చేసుకున్నారా? పిల్లలకు తల్లయ్యారా? లేదా? వంటివి పట్టించుకోరు. దీన్ని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను 29 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నా. సాధారణంగా కథానాయికల విషయానికొస్తే అది చాలా చిన్న వయసే. కానీ నేను ప్రేమలో ఉన్నా. అందుకే పెళ్లి చేసుకున్నా” అంటూ త్వరగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించింది.

Instagram

పెళ్లి గురించి అనుష్క ఇంకా మాట్లాడుతూ.. “పెళ్లి అనేది ఓ సహజమైన ప్రక్రియ. మహిళలు మగవారితో సమానంగా ఉండాలని నేను నా జీవితం మొత్తం చెబుతూ వచ్చాను. నా పెళ్లి విషయంలోనూ అలాగే ఆలోచించాను. నా జీవితంలో అద్భుతమైన రోజు నా పెళ్లి. దాన్ని భయంతో జరుపుకోవాలనుకోలేదు. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందోనని కంగారు పడకుండా చేసుకోవాలనుకున్నా.

అయినా మగవాళ్లు పెళ్లి సమయంలో కెరీర్ గురించి ఆలోచించకుండా.. పెళ్లి తర్వాత తమ కెరీర్‌ని ఆనందంగా కొనసాగిస్తున్నప్పుడు.. ఆడవాళ్లు అలా ఎందుకు చేయలేరు? ఇప్పుడు చాలామంది కథానాయికలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. దీన్ని చూసి నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారు తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. అలా సంతోషంగా జీవితాన్ని సాగించే జంటలను చూస్తుంటే.. నాకూ ఎంతో ఆనందంగా అనిపిస్తోంది” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇది కూడా చదవండి : బ్లాండ్ జుట్టుతో అనుష్క.. ఎలా ఉంటుందో మీకు తెలుసా?

Instagram

పెళ్లి తర్వాత అనుష్క నటించిన ‘పరి’ సినిమా యావరేజ్‌గా నిలవగా.. జీరో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ “నేను జయాపజయాలను పెద్దగా పట్టించుకోను. ఈ రెండూ నిజమైనవి కాదు అని నా నమ్మకం. జీవితంలో విజయం అనేది ఓ ఆనందాన్ని అందిస్తే.. అపజయం మాత్రం మనకు ఎంతో నేర్పిస్తుంది. ఒక వ్యక్తి విజయం సాధించిన తర్వాత ఎలా ఉన్నాడో.. దాన్ని బట్టి అతడి వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు.

అలాగే ఆ వ్యక్తి ఓటమి తర్వాత ఏం నేర్చుకున్నాడో.. ఎలా ఉన్నాడో చూసి కూడా తన గురించి చాలా తెలుసుకోవచ్చు. ఓటమి తర్వాత తన కాళ్లపై తాను నిలబడేందుకు ఎంత సమయం పడుతుందో.. ఓటమి కూడా అంతే సమయంలో ఓర్పును లేదా అసహనాన్ని పెంచవచ్చు. ఇలాంటి వైఖరిని బట్టి కూడా ఆయా వ్యక్తిని అంచనా వేయవచ్చు. నేను ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే వ్యక్తిని. అందుకే విజయం చేకూరగనే పొంగిపోవడం, ఓటమికి బాధపడడం వంటివి నేను చేయను. ఏది జరిగినా తిరిగి భవిష్యత్తు గురించి ఆలోచించడమే నేను చేసే పని” అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!

Read More From Bollywood