Bollywood

రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు.. ఇక ‘వెంకీ మామ’ నా క్లోజ్ ఫ్రెండ్ : సల్మాన్ ఖాన్

Babu Koilada  |  Dec 19, 2019
రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివాడు.. ఇక ‘వెంకీ మామ’ నా క్లోజ్ ఫ్రెండ్ : సల్మాన్ ఖాన్

(Salman Khan praises Ram Charan and Venkatesh in Dabangg 3 Pre Release Event)

‘దబంగ్‌ 3’ ప్రీ రిలీజ్ వేడుకలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ నటులు వెంకటేష్, రామ్ చరణ్‌ల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖ్యంగా చరణ్ తనకు చాలా సన్నిహితుడని.. చిన్న తమ్ముడు లాంటి వాడని తెలిపిన సల్మాన్.. వెంకటేష్‌ తన చిరకాల మిత్రుడని సభికులకు తెలిపాడు. ‘‘వెంకీమామ నాకు పాతికేళ్లుగా తెలుసు. నాకున్న మంచి మిత్రులలో ఆయన కూడా ఒకరు‘‘ అని సల్మాన్ అనడంతో వేడుకలో నవ్వులు విరిశాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘సల్మాన్, చిరంజీవి, వెంకటేష్, సుదీప్ లాంటి వ్యక్తుల నుండి తాను నేర్చుకున్నది ఒక్కటే అని.. అది క్రమశిక్షణ‘‘ అని తెలిపారు.

సల్మాన్ ఖాన్ కోసం.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక నిర్ణయం..!

సల్మాన్ ఖాన్ హీరోగా, సుదీప్ విలన్‌గా నటిస్తున్న ‘దబంగ్‌ 3’ చిత్రం శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా.. సోనాక్షి సిన్హా, అర్బాజ్ ఖాన్, మహి గిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో కొంత సల్మాన్ ఖాన్ కూడా రాయడం గమనార్హం. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని హిందీతో పాటు, కన్నడ, తమిళ, తెలుగు భాషలలో కూడా డబ్ చేయడం విశేషం. ఈ సినిమా తెలుగు డైలాగ్స్‌కి అప్పుడే యూట్యూబులో మంచి రెస్పాన్స్ వస్తోంది. 

సల్మాన్ ఖాన్ ఆమెను పెళ్లి చేసుకుంటున్నారట.. నిజమేనా..?

‘దబంగ్‌ 3’ చిత్రంలో ప్రముఖ నటి ప్రీతి జింతా కూడా ఓ చిన్న పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే వరీనా హుస్సేన్ ఓ ఐటమ్ సాంగ్ చేస్తుండగా.. ప్రభుదేవా కూడా ఓ పాటలో కనిపించనున్నారు. దబాంగ్ 1, 2 చిత్రాలు బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ‘దబంగ్‌ 1’ చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ‘గబ్బర్ సింగ్‘ పేరుతో రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్‌తో, హైదరాబాద్‌తో సల్మాన్ ఖాన్‌కి ఉన్న అనుబంధం ఇప్పటికి కాదు. తన చెల్లెలి వివాహాన్ని హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలెస్‌లోనే సల్మాన్ చేయించారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుకలకు కూడా సల్మాన్ ప్రత్యేక అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. అలాగే తెలుగులో రూపొంది సూపర్ హిట్ అయిన చిత్రాలను.. హిందీలో రీమేక్ చేయడం కూడా సల్మాన్‌కు కొత్తేమీ కాదు.  కిక్, రెడీ చిత్రాలను అదే టైటిల్స్‌తో హిందీలో రీమేక్ చేయగా.. ‘పోకిరి‘ చిత్రాన్ని ‘వాంటెడ్‘ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమిళ చిత్రం ‘సేతు‘ను ‘తేరా నామ్‘ పేరుతో..  మలయాళం చిత్రం ‘బాడీగార్డ్‘ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు సల్మాన్.

ఆమెను ట్రోల్ చేసి.. ఆ తర్వాత క్షమాపణ చెప్పిన సల్మాన్ అభిమాని

ఇక అప్పటి చిత్రాల విషయానికి వస్తే వెంకటేష్ నటించిన ‘ప్రేమ‘ చిత్రాన్ని హిందీలో ‘ప్రేమ్‘గా.. అలాగే నాగార్జున చిత్రం ‘హలో బ్రదర్‘ని ‘జుడువా‘గా హిందీలో రీమేక్ చేయగా.. ఈ సినిమాలలో కూడా నటించారు సల్మాన్. అన్నింటి కన్నా ముఖ్యంగా సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్‘ చిత్రానికి కూడా కథ అందించిన వ్యక్తి కూడా తెలుగువాడు.. అలాగే ఎస్.ఎస్ రాజమౌళి తండ్రైన విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం. అలాగే విజయేంద్ర ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘బజరంగీ భాయ్‌జాన్‘ సినిమా కథ రాయడానికి ప్రేరణ.. చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం‘ చిత్రమని చెప్పడం గమనార్హం.

చూశారా.. సల్మాన్ ఖాన్‌‌కి.. దక్షిణాది సినిమాలు.. ముఖ్యంగా తెలుగు సినిమాలతో ఎంత కనెక్టివిటీ ఉందో..!

Photos: Instagram.com/Daggubati Venkatesh

శుభవార్త.. ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవడానికి POPxo మీ కోసం సరికొత్త బహుమతులను #POPxoLucky2020 పేరుతో తీసుకొచ్చింది. అందమైన మ్యాజిక్ మగ్, నోట్ బుక్, మొబైల్ కవర్స్ వంటివన్నీ ఉన్న POPxo జోడియాక్ కలెక్షన్ మీ కోసమే సిద్ధంగా ఉన్నాయి. మరి, ఇంకెందుకాలస్యం? వెంటనే popxo.com/shopzodiac కి వెళ్లి షాపింగ్ చేసేయండి.

Read More From Bollywood